‘టి’ ఫై తేడా వస్తే మూడినట్లే : హరీష్ రావు
posted on Dec 23, 2012 5:42AM
ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణా ఫై జరిగే అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా కు అనుకూల వైఖరి అవలంభించకపోతే కాంగ్రెస్, తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు మూడినట్లేనని టిఆర్ఎస్ నేత హరీష్ రావు హెచ్చరించారు. లేకపోతే, ఆ మూడు పార్టీలు ఖాళీ అయిపోతాయని స్పష్టం చేశారు.
హైదరాబాద్ లోని తెలంగాణా భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సమావేశం తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల అసలు స్వరూపం బయటపడుతోందని హరీష్ అన్నారు. అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణా ఫై తమ అభిప్రాయాన్ని ప్రకటిస్తామని చెప్పిన చంద్ర బాబు నాయుడు, తీరా అది ఏర్పాటు చేసాక ఈ అంశం ఫై నోరేత్తడంలేదని హరీష్ విమర్శించారు.
అలాగే, ఈ తేదీని ప్రకటించగానే షర్మిలా పాద యాత్ర ఆగిపోయిందని అసలు ఆమెకు మోకాలి నొప్పి వచ్చిందో లేదో ఈ సమావేశం తర్వాత తేలిపోతుందని హరీష్ వ్యాఖ్యానించారు.