హోలీ...ఇలా చేస్తే జాలీ

 

హోలీ...ఇలా చేస్తే జాలీ

 


హోలీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది రంగులు. ఈ హోలీ పండుగ రోజు ఒకరికొకరూ రంగులు పూసుకుంటూ పిల్లలూ, పెద్దలు అనే తేడా లేకుండా చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఈ రంగులు పూసుకునేప్పుడు చాలా బాగానే ఉంటుంది కానీ, అవి వదిలించుకోవాలంటేనే నానా తంటాలు పడాల్సి వస్తుంది. అలా కాకుండా హోలీ ఆడేముందే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రంగుల వల్ల చర్మం పాడవకుండా ఉండటమే కాకుండా తొందరగా వదిలిపోతాయి.

ఆడటానికి ముందు:

* రంగులు పూసుకోవడానికి ముందు కాళ్లు, చేతులు,  నూనె రాసుకోవాలి.

* పొడవాటి దుస్తులు ధరించాలి. దీనివల్ల ఒంటికి రంగులు తక్కువ అంటే అవకాశం ఉంది.

ఆడిన తరువాత:

* హోలీ ఆడిన తరువాత ముందు ఒళ్లంతా చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ముందు ఆయిల్ రాసుకోవడం వల్ల రంగులు తొందరగా పోయే అవకాశం ఉంది.

* లెమన్ మంచి బ్లీచ్ గా పనిచేస్తుంది. దీనితో ముఖానికి రబ్ చేసుకోవచ్చు
 
* ముఖం మీద ఉన్న ఆయిల్ పోవాలంటే కొంచం పెరుగు, చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకొని 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి.

* జుట్టుకు అంటుకున్న రంగులు పోవాలంటే హెర్బల్ షాంపూలు వాడటం మంచిది. మన ఇంట్లో వాడే సీకాకాయ, రీటా, ఆమ్లా లాంటివి వాడితే ఇంకా మంచిది.

* ఒకవేళ జుట్టుకు రంగు వదిలించడం కష్టమైతే ఒక కప్పు పెరుగులో  ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకొని కలిపి దానిని తలకు పట్టించి కొంచెం సేపు మర్ధనా చేసి తలస్నానం చేస్తే రంగు పోతుంది.