ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలి అంతక్రియలు పూర్తి

 

 

 

ఢిల్లీలో అత్యాచారానికి గురైన బాధితురాలి అంత్యక్రియలు ఆదివారం ఉదయం 7.35 గంటలకు పూర్తయ్యాయి. సింగపూర్ ఆస్పత్రిలో మరణించిన ఆమె మృతదేహాన్ని ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఢిల్లీకి తీసుకువచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్, సోనియా గాంధీ నివాళులు అర్పించారు. అనంతరం వారణాసిలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ అంత్యక్రియలకు కేంద్ర మంత్రి ఆర్పీసింగ్, ఆరోగ్య శాఖ అధికారులు కూడా హాజరయ్యారు.