Read more!

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మార్పు

 

“కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ ఛార్జ్ గా దిగ్విజయ్ సింగ్ నిమమితులయ్యారు. గులాంనబీ ఆజాద్ స్థానంలో సోనియా దిగ్విజయ్ ని నియమించారు. గతంలోకూడా ఈ బాధ్యతల్ని నిర్వర్తించిన అనుభవం ఉండడంతో ఆయనకీ పదవి దక్కింది.

 

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోపాటు పలువురు నేతలు దిగ్విజయ్ అనుగ్రహంకోసం ఆయన ఇంటిముందు పడిగాపులు పడుతున్నారు. తెలంగాణ వ్యవహారాన్ని త్వరగా తేల్చమని పాల్వాయి, గండ్ర, చెంగారెడ్డి శనివారంనాడు దిగ్విజయ్‌కి విజ్ఞప్తి చేశారు.

 

ఇదంతా రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతున్న ప్రచారం. నిజానికి గులాంనబీ సీటు మారనూ లేదు ఆయన స్థానంలో దిగ్విజయ్ కి బాధ్యతలు అప్పచెప్పినట్టు అధిష్టానం చెప్పనూ లేదు. అంతా రూమర్.. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని దిగ్విజయ్ మన నేతల్ని అడగడంవల్ల ఇంతపెద్ద ఎత్తున సీటు మారిందహో అంటూ ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పాలిటిక్స్ లో ఎప్పుడైనా, ఏదైనా సాధ్యమే కాబట్టి దేన్నీ కొట్టిపారేయలేమని కొందరంటున్నారు.