కాంగ్రెస్‌లో ఎవడిగోల వాడిదే
posted on Jul 30, 2012 @ 1:59PM
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులంతా అంతా ఒకటిగా ఉండాల్సిన సమయంలో ఎవరి దారి వారిది అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీకాకుళం ఇందిరమ్మబాటలో ఉన్నారు. దేవాదాయ శాఖమంత్రి రామచంద్రయ్య కాపు సంఘంలో మాట్లాడుతూ కాబోయే సిఎం మన చిరంజీవే త్వరలో ప్రజాభీష్టం నెరవేరుతుందంటారు. ఈలోపు గాంధీ భవన్‌లో వి. హనుమంతరావు మౌనదీక్షను ప్రారంభించి మేధోమధనం జరగాలని కోరారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ మొన్న తూర్పుగోదావరి సక్సెస్‌ఫుల్‌గా ఇందిరమ్మ బాట పూర్తి చేసి ప్రస్తుతం శ్రీకాకుళంలో పర్యటన చేస్తున్నారు. దానిలో భాగంగానే రోజూ సెక్రటేరియట్‌లోబోరు కొడుతుందని సభాలలో మీద మేకలను పట్టుకొని ఫోటోలు తీయించుకొని పోలాలకెళ్లి నాట్లువేసే ట్రాక్టరు ఎక్కి కాసేపు స్టీరింగు తిప్పి సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో పడుకొని, సహపంక్తి భోజనాలు చేస్తూ పిల్లలతో క్రికెట్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. అసలు చేయవలసిన నిత్యావసర ధరల కళ్లేనికి ఏంచేస్తున్నారో ఇప్పటికీ ఏం తేల్చలేదు.
అయినా అఫీసులో కూర్చుని ప్రజారంజకంగా పాలన చేయమని అధికారం ఇస్తే మందిమార్బలం వెంటేసుకొని ఊళ్లూళ్లూ తిరుగుతూ కబుర్లుచెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.అంతేకాకుండా అధికార పార్టీకి ప్రతిపక్షానికి తేడా లేకుండా చేస్తున్నారు మన ముఖ్యమంత్రి. ఈలోపు దేవాదాయశాఖమంత్రి రామచంద్రయ్య త్వరలో మనకు చిరంజీవి ముఖ్యమంత్రికాబోతున్నారు అని మరొక అసమ్మదీయ ప్రయత్నానికి తెరలేపారు. మేధోమధనం జరపాల్సిందే అంటూ విహనుమంతరావు తన నిరసనను మౌనదీక్షద్వారా గాంధీభవన్‌లో సంచలనం చేశారు. కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపాలంటే వారితో మీటింగులు జరపాల్సిందే అని దీని ద్వారా కాంగ్రెస్‌పార్టీలో ఉన్న జగన్ కోవర్టులను తొలగించాలని ఆయన డిమాండ్‌చేశారు.
సీనియర్లు కె కేశవరావు, డియల్ రవీంద్ర వంటి వారు ఆయనకు మద్దతు తెలిపారు. విహెచ్ మౌనదీక్ష పార్టీకి కీడు చేస్తుందని ముఖ్యమంత్రి అనునాయులు అధిష్టానికి ఆఘమేఘాల మీద లేఖలు పంపారు.అధిష్టానం ఆదేశంతో ఉపముఖ్యమంత్రి రాజనర్శింహ విహెచ్చ్‌నుబుజ్జగించి మౌనదీక్షనుండి విరమింప చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు ఒక సినిమా పేరు గుర్తుకొస్తుంది కదా అదే ఎవడి గోల వాడిది కదా