జగన్‌కు దూరమవుతున్న ఎస్సీ,ఎస్టీలు
posted on Jul 30, 2012 @ 2:05PM
ఒకవైపు అన్నిపార్టీల నుండి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్‌లోకి నాయకులు వలసలు పోతున్నారు. మరో వైపు ఇలా వస్తున్న నాటకుల వల్ల వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి కొత్త సమస్యలు ఎదుకవుతున్నాయి. కొత్తగా వస్తున్న నాయకలతో తమకు గుర్తింపు క్రమంగా తగ్గుతోందని ఈ పార్టీకి చెందిన పాత నాయకులు వాపోతున్నారు. ఇతర పార్టీలనుండి వచ్చే అగ్రకులాలవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని మొదటనుండి పార్టీలోవుండి పార్టీని బలోపేతం చేసిన వారిని పట్టించుకోవడంలేదదంటున్నారు. నిన్న మొన్న వచ్చిన వారికి పార్టీలో పదవులు ఇస్తూ యస్‌సి, యస్‌టి వారికి తొలగిస్తున్నారని వాపోతున్నారు.
ప్రధానంగా పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో ఇదే జరిగిందని గుర్తుచేస్తున్నారు.గిరిజనులు ఎక్కువ కలిగిన ఈ నియోజక వర్గాల్లో ఖమ్మంజిల్లా కన్వీనర్‌గా పనిచేస్తున్నచందా లింగస్వామిని మార్చి ఆయన స్ధానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ ని నియమించారు. ఖమ్మంజిల్లాలో పది నియోజక వర్గాలుండగా అందులో 5 ఎస్టీ, 2 ఎస్సీ నియోజక వర్గాలని అక్కడనుండి గిరిజన వర్గాలకు చెందిన లింగస్వామిని తొలగించడం వల్ల ప్రజల్లో ఈ పార్టీలో కూడా బలహీన వర్గాలకు తావులేకుండా పోయిందనే తప్పుడు సంకేతాలు ప్రజల్లో కి వెళతాయని కార్యకర్తలు చెబుతున్నారు. అలాగే పశ్చిమగోదావరిలో జిల్లా కన్వీనర్‌గా పని చేస్తున్న మోషేన్‌రాజుని తొలగించి తోట గోపిని కన్వీనర్‌గా చేయటంవల్ల వైసిపి పార్టీలో కమ్మ, కాపు లాంటిఅగ్రకులాలకే పట్టంకట్టడం జరుగుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే పద్దతికి కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీ జెండా పట్టుకునేవారే కరువవు తారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వాళ్లకు అనుకూలమైన వారిని నియమిస్తూ ప్రచారంలో మాత్రం దళితులకు పెద్దపదవులు ఇస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారని చెబుతున్నారు. యూత్‌కాంగ్రెస్‌లో కూడా అదే పద్దతి నెలకొందని బాధితులు వాపోతున్నారు. కేంద్రకమిటీలో కూడా ఇదే పరిస్థితులు పరిణమించాయని జంబో కమిటీలను నియమిస్తున్నారని ఇందులోకూడా పెత్తనం పెద్దకులాలవారిదే అని కనీసం మర్యాదపూర్వకంగా కూడా ఏ విషయాలు చర్చించరని పాత నాయకులు వాపోతున్నారు. ఇతే పద్దతి కొనసాగితే 2014 కు దళిత, మైనార్టీలు పార్టీకి దూరమవుతారని వైసిపి పార్టీలోని పాత నాయకులు చెబుతున్నారు.