ప్రమాదం జరిగిన బస్సు జబ్బార్ దా? జేసీదా?
posted on Oct 30, 2013 @ 4:19PM
మహబూబ్ నగర్ వద్ద జరిగినరోడ్డు ప్రమాదానికి సంబంధించి జేసీ ట్రావెల్స్ పేరుకూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు జబ్బార్ ట్రావెల్స్ కు చెందినదని భావిస్తుండగా వోల్వో బస్సు జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్టర్ అయినట్లు సమాచారం.
AP 02 TA 0963 నెంబర్ గల బస్సు దివాకర్ రోడ్డు లైన్ పేరుతో అనంతపురంలో రిజిస్టర్ అయ్యింది. అయితే ఆర్టీఏ రికార్డుల్లో బస్సు స్టేటస్ ఇనాక్టివ్గా ఉంది. జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్ట్రర్ అయిన బస్సు….జబ్బర్ ట్రావెల్స్ పేరుతో ఎందుకు నడుస్తుందనేది అంతుబట్టనిదిగా మారింది. అయితే ప్రమాదానికి గురైన వోల్వో బస్సుతో తమ ట్రావెల్స్కు ఎలాంటి సంబంధం లేదని జేసీ ట్రావెల్స్ యాజమాన్యం స్పష్టం చేసింది.
తాము రెండేళ్ల క్రితమే బస్సును అమ్మివేసినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జబ్బర్ ట్రావెల్స్తో తమకు ఎలాంటి సంబంధం లేదని… అయితే టైటిల్ మార్చకపోవటం వల్లే తమ ట్రావెల్స్ పేరు ఉందన్నారు. ఈ బస్సును 2010 అక్టోబర్లో విక్రయించినట్టుగా ఆర్టీఏ రికార్టులు చెబుతున్నాయి. అయితే ఈ విషాదంలో ఎక్కడ లోపం జరిగిందన్నదానిపై పూర్తి స్థాయి విచారణ జరగవలసి ఉంటుందంటున్నారు.