Read more!

వాలెంటైన్స్ డే: ప్రియుడి చేతిలో ప్రియురాలు మృతి

 

 

 

 

బ్లేడ్ రన్నర్ అంటే క్రీడా ప్రపంచంలో తెలియని వారుండరు. రెండు కాళ్లూ లేకున్నా కృత్రిమ కాళ్లతో పరుగెత్తి ట్రాక్ పై అనేక రికార్డులు నెలకొల్పిన దక్షిణాఫ్రికా స్ప్రింటర్ ఆస్కార్ పిస్టోరియస్ తన ప్రేయసిని కాల్చి చంపాడన్నది ఆరోపణ. ఐతే అదేమీ అతను కావాలని చేయలేదు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కావడంతో ప్రియురాలు రీవా స్టీన్‌కాంప్ తన ప్రియుడు పిస్టోరియస్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తడానికి ఓ మాస్కు వేసుకొని వచ్చింది. ఉదయమే ఆమె ప్రియుడి ఇంటికి చేరుకుంది. కానీ, ఆ విషయం తెలియని పిస్టోరియస్ ఆమెను దొంగగా భావించి కాల్చి చంపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. పోలీసులు పిస్టోరియస్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


గతంలో పలుమార్లు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు తన ప్రియురాలిని అనుకోకుండా కాల్చినప్పటికీ అంతకుముందు అతను జైల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. గతంలో ఓ టీనేజ్ అమ్మాయి పైన దాడి చేశాడు. దీనికి 2009లో ఒకరోజు జైలు శిక్ష అనుభవించాడు. పిస్టోరియస్ అందరూ అనుకునేలాంటివాడేమీ కాదని అతని మాజీ ప్రియురాలు ఓ సందర్భంగా చెప్పింది. పిస్టోరియస్ తన ప్రియురాలిని షూట్ చేసినందుకు హత్యానేరం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.