ఇదేం స్నేహంరా బాబోయ్... ప్రేమ కోసం ఎంత పని చేస్తారా?
posted on Dec 22, 2025 @ 8:01PM
మంచి స్నేహితులు సన్మార్గంలో నడిపించడమే కాకుండా కష్టసుఖాల్లో తోడుగా ఉంటారని... అదే చెడు సహవాసం చేస్తే అది ఎప్పటికైనా మనల్ని అంతం చేస్తుందని పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. ఇది అక్షర సత్యం... చాలాచోట్ల స్నేహితులే మరో స్నేహి తుడిని దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి... ఇలా వరుస హత్యలు జరుగుతూ ఉండడంతో పాతబస్తీ పరిధిలోని బాలాపూర్, పహాడీ షరీఫ్, చాంద్రాయణ గుట్ట తదితర ప్రాంతాల్లో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే.. అయినా కూడా ఈరోజు తెల్లవారుజామున బాలాపూర్ లో ఓ యువ కుడు స్నేహితుల చేతిలో దారుణంగా గాయపడ్డాడు... రిహాన్ (17), శానవాజ్, మోహిజ్ ఈ ముగ్గురు స్నేహితులు కలిసి వట్టేపల్లి నుండి ఫంక్షన్ కని ఎర్ర కుంటకు కలిసి బయలు దేరారు...
బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట లో అర్ధరాత్రి సమయంలో ఈ ముగ్గురి మధ్య వాగ్వివాదం చెలరేగింది... పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగడంతో శానవాజ్, మోహిజ్ ఈ ఇద్దరు స్నేహితులు ఆగ్రహంతో ఊగిపోతూ స్నేహితుడు రిహాన్ పై ఒక్కసారిగా కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుండి పారిపోయారు... రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న రిహాన్ ను చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రిహాన్ను ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. రిహన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడిం చారు.
అమ్మాయితో ప్రేమ వ్యవహారమే ఈ హత్య యత్నానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కారణంగా స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు... ఇప్పటికే వరుస నేరాలు, హత్యలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో రాచకొండ సిపి ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి బాలాపూర్, పాతబస్తీ, పహడి షరీఫ్, చాంద్రా యణగుట్ట పరిసర ప్రాంతా ల్లో అర్ధరాత్రి సమయాల్లో తనిఖీలు నిర్వహిస్తూ పోకిరిలపై కొరడా ఝళిపిస్తున్న కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు బయటికి రావాలంటేనే భయంతో వణికి పోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను ఆధారంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు