గర్భం తో తైక్వాండో.. బంగారు విజయం...
posted on Apr 10, 2021 @ 11:19AM
కొంత మంది పుట్టామా.. పెరిగామా... బతికినామా.. చచ్చిపోయామా అన్నట్లు ఉంటారు. మరో కొందరు అయితే వాళ్ళ పుట్టుక ఒక చరిత్ర కాకపోయినా.. చాచేలోపు చరిత్ర సృష్టించాలనుకుంటారు. చరిత్ర పుటల్లో వారికంటూ కొన్ని పేజీలు ఉండాలనుకుంటారు. అందరూ సాహసం చేయాలనుకుంటారు. కానీ కొందరు ప్రయత్నం మాత్రమే చేస్తారు. మరికొందరైతే ప్రాణాలకు కూడా తెగిస్తారు. అలా సాహసం కోసం ప్రాణాలు తెగించిన వారిలో ఒక లేడీ ఉంటే..? ఆ లేడీ గాజులు వేసుకునే అమ్మాయి కాకుండా, గర్జించే పులి అయితే ..? ఆ లేడీ పులి ఎలా ఉంటుందో మీరే చూడండి.
ఆమె వయసు 26 సంవత్సరాలు. పెళ్లి అయింది. క్రీడాలు అంటే ప్రాణం. ఎనిమిది నెలల గర్భం కూడా. ఆ గర్భం తో క్రీడలో పోటీపడడమే అరుదు అనుకుంటే.. అందులోనూ పతకం కొల్లగొట్టడమంటే అసాధారణం! ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది నైజీరియాకు చెందిన క్రీడాకారిణి. తైక్వాండో ప్లేయరైన అమితాస్ ఇద్రిస్ ఎనిమిది నెలల గర్భవతి. స్థానిక స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించిన తైక్వాండో పోటీల్లో మిక్స్‌డ్ పూమ్సే కేటగిరిలో అమితాస్ స్వర్ణ పతకం సాధించింది. అంతేకాదు.. మరో మూడు విభాగాల్లోనూ పతకాలు సాధించి ఔరా అనిపించింది.