రాజ్యాంగంలోనే రాష్ట్ర సమైక్యతను కాపాడగల క్లాజు [ఇ]?!

 

ఎబికె ప్రసాద్


[సీనియర్ సంపాదకులు]

 

 

 

రాజనీతి శాస్త్రాన్ని కాస్తా స్వతంత్రభారతదేశంలో "పదవీరాజకీయ శాస్త్రం''గా మార్చిన 'ఘనులు' కాంగ్రెస్ నాయకులు! అలాంటివాళ్ళు దేశ సమాఖ్య (ఫెడరల్)వ్యవస్థను ప్రజాప్రయోజనాల రక్షణకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాల సుస్థిరతకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు తోడునీడగా ఉండకుండా కేవలం ఎన్నికలలో విజయం సాధించడం కోసం 'పావు'గా వినియోగించుకుంటూ వస్తోంది. అలాంటి తాజాగా చేతివాటంగా అందివచ్చిన 'పావు' - స్వతంత్ర భారతంలో భాషాప్రయుక్త ప్రాతిపదికపై మొట్టమొదటిసారిగా ఏర్పడిన పెద్దరాష్ట్రమైన తెలుగువారి "ఆంధ్రప్రదేశ్''ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో తమ నాయకురాలైన ఇటాలియన్ సోనియా రాజకీయ కుటుంబ ప్రయోజనాలకోసం అశాస్త్రీయంగా నిట్టనిలువునా చీల్చడానికి తీసుకున్న నిర్ణయం! ఆంధ్రప్రదేశ్ లో భాగమైన తెలంగాణా ప్రాంతంలో 15 పార్లమెంటు సీట్లకోసమని వేర్పాటువాదులయిన కొందరు రాజకీయ నిరుద్యోగులతో చేతులు కలిపి కాంగ్రెస్ ఈ పనిచేసి, తెలుగుజాతికి విద్రోహం తలపెట్టి, ఆ విద్రోహాన్ని సమర్థించుకోడానికి మరికొన్ని తప్పులు చేస్తూ పోతోంది. ఇందుకు అది ఆధారపడుతున్నది రాజ్యాంగంలోని 2,3,4 అధికరణలమీద. ఈ మూడింటి సారాంశం - భారత యూనియన్ లో కొత్తరాష్ట్రాలను ఏర్పరచడానికి, ఉన్న రాష్ట్రాలనుంచి భూభాగాలను చీల్చి మరొక రాష్ట్రంలో విలీనం చేయడానికి పార్లమెంటుకు శాసనాధికారం ఉన్నదని చెప్పడం. 3వ అధికరణ ప్రకారం - నూతన రాష్ట్రాలను ఏర్పర్చడమే గాక, ప్రస్తుతమున్న రాష్ట్రాల వైశాల్యాన్ని పెంచడానికి, లేదా కుదించడానికి, లేదా వాటి సరిహద్దుల్ని మార్చడానికి లేదా ఆ రాష్ట్రాల పేర్లను కూడా మార్చడానికి శాసనం రూపొందించే హక్కు పార్లమెంటుకు ఉంది!

 

 

అయితే పాలనాధికారాన్ని చేపట్టే రాజకీయపార్టీలు తమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం తమ "బ్రూట్ మెజారిటీ''ద్వారా తమ ఇష్టానుసారం రాష్ట్రాలను విభజించడానికి ఈ అధికరణవల్ల అవకాశం దొరికింది! రానురానూ ఈ తప్పుడు సంప్రదాయం ఎక్కడికి దారితీస్తోంది? పాలనా పగ్గాలు పట్టుకున్న అధికారపక్షాలు భారత సమాఖ్య వ్యవస్థలోని రాష్ట్రాల ప్రజల మెజారిటీ అభీష్టాన్ని, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్రాల చట్టసభలనూ ఖాతరు చేయకుండా కూడా కొత్తరాష్ట్రాలను స్వార్థప్రయోజనాలకోసం ఏకపక్షంగా ఏర్పర్చచే దుష్ట సంప్రదాయాన్ని నెలకొల్పుతోంది. ఇది పంజాబ్-హర్యానాలుగా పంజాబ్ విభజనతోనే మొదలయింది! పంజాబ్ శాసనసభ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా సభ ఆమోదముద్ర లేకుండానే కేంద్రంలోని కాంగ్రెస్ అధికారపక్షం పంజాబ్ ను విభజించేసింది! రాజకీయ ప్రయోజనాల కోసం పంజాబ్ ఐక్యతను బలిగొన్నది! అదే పద్ధతిని ఇప్పుడు దేశంలోని తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ను బలిగొనజూస్తోంది! ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తనకు తననే ఆంధ్రప్రదేశ్ లో ఆత్మాహుతికి సిద్ధమవుతోంది! కొందరు వేర్పాటువాద నాయకుల వత్తిడికి తలొగ్గిన కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆంధ్రప్రదేశ్ ను 3వ అధికరణ ఆధారంగా విభజించడానికి సిద్ధమయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలైన ఇటాలియన్ సోనియా నాయకత్వంలో హోంమంత్రిత్వశాఖ రాష్ట్ర విబజనకోసం మూడు రకాల ప్రతిపాదనలతో ఒక "నోట్'' (పత్రం) తయారుచేసింది. దాన్ని మంత్రి షిండేకి సమర్పించింది. ఇదో విచిత్రమైన పత్రం! దీనికి పునాది రాజ్యాంగంలోని 3వ అధికరణమే అయినా, హోంశాఖ "నోట్''లో మొదటి అంశం పూర్తిగా ప్రజల పరిశీల దృష్టికి యింకా వచ్చినట్టులేదు!



అది - "పదిజిల్లాలతో ఏర్పడగల తెలంగాణా రాష్ట్రంలో ఆ పదిజిల్లాలతో పాటు తెలంగాణలో ఐచ్చికంగా ఏ ఇతర జిల్లాలయినా సరే వచ్చి చేరదలిస్తే అవన్నీ చరవచ్చు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న పిమ్మట తెలంగాణాగానే ఏర్పడుతుంది'' ["Along with 10 districts, any other disstricts that voluntarily come forward to join in Telangana will be taken into consideration and Telangana will be formed]!



 

ఈ "నోట్''ను ఎవరు తయారుచేశారోగాని సదరు పత్రకారుడు సరసుడే కాదు, ప్రజలను విభజించి-పాలించటం తెలియని అజ్ఞాత సమైక్యవాది అయి ఉండాలి! రాష్ట్ర మెజారిటీ, ప్రజల ఆకాంక్షకు అనువునంగానే ఈ 'నోట్' డ్రాఫ్టింగ్ తయారైనట్టుంది! చివరికి ఏ కేంద్రపాలకపక్షం ఏ "3''వ రాజ్యాంగఅధికరణ ఆధారంగా, ఐక్యంగా ఉన్న తెలుగుజాతిని చీల్చాలని ఉవ్విళ్ళూరుతోందో సరిగ్గా అదే అధికరణలోని "ఇ''క్లాజు కూడా "రాష్ట్రం పేరును మార్చుకోవచ్చు''నని అభ్యంతరం లేదనీ చెప్పింది! అంటే హోంశాఖవారి అద్భుతమైన 'డ్రాఫ్టింగ్' పర్యవసానంగా వెలువడిన ఆ "నోట్'' తెలంగాణాలోని పదిజిల్లాలతో పాటు మరిన్ని జిల్లాలు, ఎన్ని జిల్లాలు వస్తే అన్ని జిల్లాలు 'తెలంగాణా రాష్ట్రం'గా ఏర్పడవచ్చునని బాహాటంగానే ప్రకటించినట్టయింది! ఆ లెక్కన రాష్ట్రంలోని మిగిలిన 13జిల్లాలు కూడా ఆ పదిజిల్లాలతో కలిసిపోతే - అదే హోంశాఖ "నోట్'' ఆశిస్తున్న మొత్తం రాష్ట్రం అంతా నిజంగానే అక్షరాలా "తెలంగాణా'' అవుతుంది గదా!! ఎందుకంటే, ఈ మాట వ్యంగ్యంగా అనటంకాదు, ఎగతాళి కోసం అంటున్న మాట అంతకంటే కాదు. నిజానికి "తెలంగాణం'' అంటే తెలుగులకు (తెలుగువారికి) అణెము, అంటే తెలుగువారు నివశించే చోటు అనీ, ప్రాంతం అనీ, నివాసమనీ వ్యవహారార్థమూ, విశిష్టార్థమూనని గుర్తించాలి! పండితులూ, నిఘంటుకారులూ స్థిరపరిచిన స్థిరనివాసమే తెలుగువారి తెలంగాణం! చరిత్ర తెలియని మన తెలుగు రాజకీయ సన్యాసులకన్నా, గిరీశం భాషలో మన 'వెధవాయిల'కన్నా కోస్తాంధ్ర, సీమాంధ్ర ప్రాంతాలతో పాటు సుమారు 300 ఏళ్ళపాటు దక్కన్ వరకూ ఏలికలుగా ఉన్న మహమ్మదీయ పాలకులు తెలుగు పాలకులకన్నా తెలివిగల వాళ్ళు కాబట్టి తాము పాలిస్తున్న నివసిస్తున్న ప్రాంతమంతా తెలుగువారిది కనుకనే మొత్తం తెలుగుప్రాంతాన్ని 'తెలంగాణం' [15-16 శతాబ్దాల దేశపటాల్లో "తెలంగాణం'' అని లిఖితపూర్వకంగా పేర్కొని] అని పేరుపెట్టుకున్నారని గుర్తించాలి!


 

అందువల్ల "తెలంగాణా రాష్ట్రం'' అంటే మొత్తం తెలుగు ప్రాంతమంతటికీ వర్తిస్తుంది కాబట్టే హోంశాఖ "నోట్'' తెలుగువారి అన్ని జిల్లాలూ వచ్చి చేరమని ("any other districrs that come forward")  ఆహ్వానం పలికి ఉంటుంది! మరో మాటలో చెప్పాలంటే మిగతా 13 సీమాంధ్రజిల్లాలు కూడా వెరసి మొత్తం 23 జిల్లాలతో కూడిందే తెలంగాణం/ఆంధ్రప్రదేశ్ లేదా విశాలాంధ్ర రాష్ట్రం గదా! అందువల్ల ఇప్పుడున్నదంతా 'తెలంగాణం' అదే 'తెలుగునాడు! కాబట్టి రాజ్యాంగంలోని 3వ అధికరణం "ఇ''సెక్షను ప్రకారం "ఆంధ్రప్రదేశ్'' రాష్ట్రాన్ని కృత్రిమంగా విభజించకుండానే పేరును అర్థవంతంగా అమరగల "తెలంగాణా''గా లేదా "తెలుగునాడు''గా మార్చుకోవచ్చు! తద్వారా "విభజన'' అనే పురుగును, లేదా 'కలుపుమొక్క'ను లేదా 'బి.టి.'లాంటి వినాశకర విత్తనాన్ని [టెర్మినేటర్ సీడ్] మనస్సులనుంచి పెకించివేయవచ్చు! తొలుత దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలుగువారి రాష్ట్రం ఏర్పడినప్పుడు, రెండురకాల పరాయి పీడనా పాలనలనుంచి తెలుగుజాతి ఒక్క గొడుగుకిందికి వచ్చినప్పుడు ఆకారాది క్రమం కోసం అటు ఇంగ్లీషు వర్ణమాలకు, ఇటు తెలుగువర్ణమాలకు తొలి అక్షరంతో 'A'/ 'ఆ'/"ఆంధ్రప్రదేశ్" (Andhra Pradesh) ఏర్పడడం శుభదాయకం అనుకున్నారు పెద్దలు. ఆ ఆశతోనే, పేరు తప్పు సమాసం అయినా "ఆంధ్రప్రదేశ్' పేరును ఎంచుకోవటం జరిగింది. కాని, ఆకారాదిక్రమంలో తొలి అక్షరంతో మనం 8వ షెడ్యూల్ లో అగ్రభాగంలో కనిపించినంతమాత్రాన అభివృద్ధికి చిహ్నం కాదు, అలా లేకపోయినంత మాత్రాన ఒక రాష్ట్రం పేరు కడుపంక్తిలో [ఉదా: తమిళనాడు - Tamilnadu ఉందికాబట్టి ప్రగతిపథంలో అది అట్టడుగున ఉందనీ చెప్పలేం!]



 

అందువల్ల, వ్యక్తులకుగానీ, రాష్ట్రంకుగాని వారికి (వాటికి) తగినట్టుగా అర్థవంతంగా ఉండాలేగాని 'పేరు' బలాల్ని బట్టి, 'నక్షత్రబలాల్ని' బతి విలువలూ, గౌరవప్రతిష్టలూ సమకూడవు! ఎందుకంటే అబద్ధాలతో, బూతులతో 'ఉద్యమాలు' నిర్మించేవారంతా చచ్చినా కొమరం భీములూ కాలేరు, దొడ్డి కొమరయ్యలూ కాజాలరు; వినాయక వేషధారులంతా ప్రజానాయకులు కారు; గాంధీ పేరుతొ చెలామణీ కాదలచుకునే వారంతా గాంధీలూ కారు, భగత్ సింగ్ పేరు తగిలించుకునే వారు విప్లవకారులూ కాలేరు; అల్లూరి సీతారామరాజును కొలిచేవారంతా ఆయని పేరు ఉచ్చరించడానికీ తాగారు; రుద్రమ పేరు పెట్టుకున్న వారంతా వీరనారీమణులూ కారు; చిత్తం చెప్పులమీద భక్తి శివుడిమీద నిలిపే వారంతా నిజమైన భక్తులూ కారు; యావదాంధ్ర శ్రమజీవుల ప్రతినిధిగా కష్టజీవులకు బతుకునిచ్చే బతుకమ్మ/అదే దుర్గమ్మ/అదే గౌరమ్మను కాస్తా హైజాక్ చేసి క్షుద్ర రాజేకీయాలకోసం వాడుకో జూసే సంపన్నుల బతుకులు బతుకులూ కావు; ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఆంద్ర (తెలుగు) జాతి చరిత్రకూ దాని వేల సంవత్సరాల సంస్కృతీ విభావానికీ ఐకమత్యానికీ దివిటీలుగా నిలిచినా శాతవాహన, కాకతీయ, విజయనగర ప్రజాహిత పాలనా యుగాలను విస్మరించిన తెలుగుజాతి విచ్చిన్నకులూ, అందుకు దోహదం చేసిన ఆధునిక విద్యోజులయిన రాకీయ దుర్యోధన, దుశ్శాసనలూ మూడు ప్రాంతాల ప్రజాబాహుళ్యం గుండెల్లో శాశ్వత శత్రువులుగా నమోదు కాకుండా తప్పించుకోలేరు; తెలుగువారి మహాయుగాల ఆనవాళ్ళను చేరిపివేయడానికి ప్రయత్నించిన ఆధునిక రాజకీయ 'సామంతులు'గా, చరిత్రహీనులుగా వీళ్ళు మిగిలిపోతారు!


 

ఎందుకంటే, "ప్రజాప్రతిదుల'' వేషంలో దేశ, రాష్ట్రాల వివిధ పాలకపక్షాలు,ముఖ్యంగా దీర్ఘకాలంపాటు దేశాన్ని ఏలుతూ వచ్చిన చెడిపోయిన కాంగ్రెస్ తో కొన్ని ప్రధాన ప్రతిపక్షాలూ ఇన్నేళ్ళుగా భారత రాజ్యాంగ చట్టాన్ని సహితం తమ కుత్సితమైన స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని తప్పుడు సవరణలతో పక్కదారులు పట్టించడానికి సహితం వేనుదీయలేదు. వాటిల్లో కొన్ని - రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి, బ్యూట మెజారిటీ ద్వారా పార్లమెంటును చాటు చేసుకుని నేటి - రేపటి పాలకపక్షాల స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన సవరణలు! ఈ సవరణలేవీ డాక్టర్ అంబేడ్కర్ లేదా తొల్లింటి ముసాయిదా రాజ్యాంగం తలపెట్టినవికావు!  స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పాలకులూ, మతరాజకీయాలను నిరసించిన ఆ రాజ్యాంగ సభ నిర్ణయాలనే అవమానించి ఉల్లంఘిస్తూ వచ్చిన బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలూ, వాటి సంకీర్ణ పాలనా వ్యవస్థలూ రాజ్యాంగాన్ని వక్రమార్గం పట్టిస్తూ రాజ్యాంగం ఫెడరల్ (సమాఖ్య) స్వభావానికీ, దాని ప్రజాహిత స్ఫూర్తికీ బద్ధవిరుద్ధమైన సవరణ చట్టాలు తీసుకొచ్చారు! వాటిలో నేటి రాష్ట్ర సమస్యకు ప్రత్యక్షంగా సంబంధం కలవి రాజ్యాంగంలోని 3వ అధికరణ ఒకటికాగా, ఆ సవరణ కేంద్రం రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణక్కు భాషాప్రయుక్త ప్రాతిపదికపైన ప్రజాహితంగా దేశంలోనే తొలిమెట్టుగా తెలుగుజాతినంతనూ ఒక్క గొడుగుకిందికి తెచ్చేందుకు సాధికార కమీషన్ సిఫారసులు ఆధారంగానే 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది; దానికి తగినట్టుగానే రాష్ట్రంలోని మూడుప్రాంతాల మధ్య కాలక్రమంలో ఉద్యోగ సద్యోగాలలో ప్రాంతాలమధ్య సమతుల్యమైన ఆర్థికాది రంగాలలో సాధ్యమైనంత త్వరగా అభ్యుదయాన్ని సాధించడం కోసం ఏ ఇతర రాష్ట్రానికీ లేని ఒక విశిష్టమైన ప్రత్యేకమైన (స్పెషల్) సవరణ చట్టాన్ని 371 (డి) పేరిట రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది.


 

కాగా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన 3వ అధికరణ భాషాప్రయుక్తంగా ఏర్పడిన రాష్ట్రానికి రాజకీయ ప్రయోజనాలు ఈడేర్చుకోడానికి ఉద్దేశించింది కాదు కనుకనే ప్రత్యేకంగా మన రాష్ట్రం సుస్థిరత కోసం 371 అధికరణకు "డి'' క్లాజుద్వారా రాజ్యాంగానికి సవరణ చట్టం తీసుకువచ్చి, దానికి భాష్యం చెప్పాలన్నా, వ్యతిరేకంగా తీర్పు చెప్పాలన్నా ఒక్క సుప్రీంకోర్టుకు తప్ప, మిగతా ఏ కోర్తుకూ, చివరికి ఉద్యోగాలకు చెందిన మార్పులకూ, ప్రమోషన్లకూ మరే యితర సంబంధిత సమస్యలపైనా తీర్పులుగానీ, వ్యాఖ్యానాలుగాని చేసే హక్కు లేకుండా చేసింది! అంటే, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే హక్కును పార్లమెంటు ద్వారా కేంద్రప్రభుత్వానికి సంక్రమింపజేస్తున్న 3వ అధికరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చడానికి వినియోగించే ముందు 371 (డి) సవరణ చట్టానికి మూడింట రెండువంతుల మెజారిటీ ద్వారానే పార్లమెంటుకు, దానిద్వారా కేంద్ర క్యాబినెట్టుకూ సాధ్యమవుతుంది గాని అడ్డదారుల్లో కాదు! పైగా, హోంశాఖ చూపిస్తున్న "నోట్''లో, నేడు ప్రజావ్యతిరేకులుగా మారి ప్రజలకోసం పదవుల్ని త్యాగం చేయలేని 'దేహభక్తి'కి తప్ప దేశభక్తికి దూరమైనా నాయకులకు తెలియని ఒకటి రెండవ అంశంగా ఉంది. ఆ అంశం నిజానికి రాజ్యాంగంలోని 3వ అధికరణకు సంబంధించి యిచ్చిన "ఒకటవ వివరణ''లోనే ఉంది. ఇది రెండురకాల భాష్యానికి అవకాశమిస్తోంది.


 

ఎలా అంటే, 3వ అధికరణలో 'ఎ'నుంచి 'ఇ'వరకూ ఉన్న క్లాజుల్లో "రాష్ట్రం'' అనే పదంలో కేంద్రపాలిత (యూనియన్ టెరిటరీ - యు.టి.)ప్రాంతం అనే పదం కూడా చేరి ఉంది! అయితే జనాన్ని పాలకపక్షాలు గందరగోళ పరచడం కోసం చేసిన ప్రయత్నం మినహాయింపు "క్లాజు'' పేరిట "రాష్ట్రం'' అనే పదంలో "కేంద్రపాలిత ప్రాంతం'' చేరి ఉండదని అదే "వివరణ (1)''లో విరుద్ధంగా పేర్కొనడమూ! ఇటీవల కొందరు పార్లమెంటు సభ్యులూ, రాష్ట్రప్రజలూ, రాష్ట్రేతర స్థానిక వ్యాపారులూ, ప్రజలూ దశాబ్దాలుగా పెంచి, అభివృద్ధి చేసిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని "కేంద్రపాలితప్రాంతం''గానో (యు.టి) లేదా దేశానికి రెండవ రాజధానిగానో ప్రకటించిన తరువాతనే రాష్ట్ర "విభజన'' గురించి ఆలోచించాలిగాని అంతకుముందు కాదని ప్రతిఆదించడానికి కారణం - 3వ అధికరణంలోని ఈ అయోమయపు "వివరణ 1''! కాబట్టి - మొత్తం తెలుగుజాతి ఉనికినీ, భారతదేశ చరిత్రలో దాని విశిష్టతనూ సంరక్షించి కాపాడుకోడానికిగాను, "ఆంద్ర'' అనే పదా(తెలుగు అనేది తెలియక)నికి అజ్ఞానంతో కొందరు 'ఎలర్జీ' పెంచుకుని తెలుగుజాతి మూలాలనే నరుక్కోబోయే వారిని కూడా కలుపుకుని వచ్చేందుకు వీలుగా రాష్ట్రాన్ని మొత్తంగా 3వ అధికరణలోని "ఇ''క్లాజు ప్రకారం గానీ నామకరణం చేయడానికి ఏ ఆంధ్రుడికీ ఏ తెలుగువాడికీ అభ్యంతరం ఉండదు, మనసారా ఆహ్వానించి తీరుతాడు! సెంటిమెంటును గౌరవించాలనుకునే వారంతా కోస్తా నుంచి దక్కను దాకా తెలుగువారి నివాసప్రాతంగా ''తెలంగాణా'' పేరు హేతుబద్ధమైన పేరు రాష్ట్రానికి చక్కగా అమరుతుంది, అర్థవంతంగా భాసిల్లుతుంది, అరమరికలులేని తెలుగుజాతికి ఆత్మవిశ్వాస సోర్యోదయంగా చిరంజీవిత్వం కల్గిస్తుంది!

జగన్ విపక్ష నేత కావడం కల్ల.. రఘురామకృష్ణం రాజు

తనపై మూడు కేసులున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. తనదైన శైలిలో ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టారు. ఆరోపణలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆ కేసులకు సంబంధించి తాను నిర్దోషిగా బయటకు వస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో తన కార్యాలయంలో    మీడియాతో మాట్లాడిన ఆయన తనపై ఆరోపణలు వస్తున్న కేసులో ఎలాంటి ఛార్జిషీటు దాఖలు చేయలేదన్నారు.   తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన..  11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.    తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న కొందరు వ్యక్తుల గురించి తాను మాట్లాడనని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తన కేసుపై తాను పోరాటం చేస్తానని, ఇందులో ఎవరి మద్దతు అవసరం లేదన్నారు.   తాను ఏ తప్పూ చేయలేలదన్న ఆయన  తనకు పార్టీకి మధ్య గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం  జరుగుతోందని ఆరోపించారు.  అలాగే ఏపీ మాజీ సీఎం తీరుపైనా తీవ్ర విమర్శలు చేశారు.  ఆయన తన తీరు మార్చుకోకుండా ఎప్పటికీ కనీసం ప్రతిపక్ష నేత కూడా కాలేరని అన్నారు.జగన్ తన ప్రవర్తన మార్చుకుంటే.. వచ్చే ఎన్నికలలోనైనా ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలలో గెలుపొంది ప్రతిపక్ష నాయకుడు అవుతారని తాను భావించాననీ, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ అవకాశం లేదనిపిస్తోందన్నా. 2020 నుంచే జగన్ తనపై బురద జల్లుతున్నారనీ, తనను హత్య చేయాలని కూడా చూశారన్న రఘురామకృష్ణం రాజు అయినా తాను భయపడకుండా పోరాడానన్నారు.   

తన హత్యకు కుట్ర.. దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు

వైసీపీ మాజీ నేత దువ్వాడ శ్రీనివాస్ మరో సారి తన మార్క్ రాజకీయ సంచలనం సృష్టించారు.  తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, తనను హత్య చేయడానికి కుట్రపన్నారంటూ శుక్రవారం (డిసెంబర్ 27) అర్ధరాత్రి  నిమ్మాడ హైవేపై ఆయన  హల్‌చల్ చేశారు.  ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికి దువ్వాడ మాధురి ఓ ఆడియో క్లిప్పింగ్ విడుదల చేశారు.  తన ఆరోపణలకు ఆధారాలు అన్నట్లుగా   దువ్వాడ వీడియో విడుదలైన కొద్దిసేపటికే.. దివ్వెల మాధురి ఒక ఆడియో క్లిప్పింగ్‌ను బయటపెట్టారు.   ఆ ఆడియో క్లిప్పింగ్ లోని  దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు   కింజారపు అప్పన్న, దివ్వెల మాధురిల సంభాషణ మేరకు.. రామస్వామి అనే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్‌పై దాడికి ప్రణాళిక రూపొందించాడని కింజారపు అప్పన్న దివ్వెల మాధురితో చెబుతున్నారు.   దువ్వాడ శ్రీనివాస్ విడుదల చేసిన వీడియో, దివ్వెల మాధురి బయటపెట్టిన ఆడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి.  సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని దువ్వాడ చేస్తున్న ఆరోపణలు వైసీపీలో అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతమయ్యాయి. ఇంతకీ తనను హత్య చేసేందుకు కుట్రపన్నుతున్నది వైసీపీ సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ అని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. తాను చావుకు భయపడనన్న దువ్వాడ.. తనపై దాడి చేయడానికి ఎవరోస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. శ్రీకాకుళంలో తాను స్వతంత్రంగానే రాజకీయాలు చేస్తానన్న దువ్వాడ    తనను వైసీపీ నుంచి పూర్తిగా బయటకు పంపిస్తే శ్రీకాకుళం జిల్లాలో ఇండిపెండెంట్ గా నిలబడి తన సత్తా ఏంటో నిరూపిస్తానని సవాల్ విసిరారు. పార్టీలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తనపై హత్యకు కుట్రపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 

ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు!?

  పంచాయతీ ఎన్నికల విజయంతో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. ఇదే జోష్ లో మునిసిపల్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది.  విద్యార్థుల పరీక్షల సీజన్ ప్రారంభం కాకముందే.. అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారం నాటికే మునిసిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది.  వచ్చే ఏడాది  మార్చిలో విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకే ఆ పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది.  ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి  మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని  ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అదలా ఉంటే రాష్ట్రంలోని  120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు 2025 జనవరితోనే గడువు ముగిసింది. అప్పటి నుంచీ ఇవన్నీ ప్రత్యేక అధికారల పాలనలో కొనసాగుతున్నాయి.  ఇక పోతే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్,  ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. దీంతో వీటికి కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే.. పాలకవర్గాల గడువు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉన్న మహబూబ్‌నగర్, నల్గొండ  మున్సిపాలిటీల కు మాత్రం ఇప్పుడు అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు.  ఇలా ఉండగా   హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌  పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసివదే. అలాగే కొన్ని  నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా, మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ సహా మొత్తం 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.   వచ్చే ఏడాది జనవరి రెండో వారానికల్లా  ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.ఇందుకు సబంధించిన కసరత్తు కూడా ప్రారంభమైంది. అలాగే ప్రభుత్వం ఎప్పుడు పచ్చ జెండా ఊపితే అప్పుడు మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్రఎన్నికల కమిషన్  సిద్ధంగా ఉంది.  

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు ఆరామస్తాన్

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన  ఫోన్ ట్యాపింగ్ కేసు  దర్యాప్తులో  భాగంగా సిట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆరా మస్తాన్ ను   విచారించింది. ఆరా పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థా పకుడు ఆరా మస్తాన్‌ను  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో  హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన నూతన సిట్ శుక్రవారం విచారించింది. ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది.    ఆరా మస్తాన్ గత కొన్నేళ్లుగా   రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులతో మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డింగ్స్‌ను సమగ్రంగా పరిశీలించారు. ఈ కాల్ డేటా ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా?  లేదా? ఒక వేళ జరిగితే అందుకు ఎవరు ఆదేశించారు? అన్న అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.  సిట్ విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆరా మస్తాన్ మీడియాతో మాట్లాడారు.  నూతన సిట్   ఆదేశాల మేరకే  తాను విచారణకు హాజరయ్యానన్న ఆరా మస్తాన్.. గతంలో పోలీసులు అడిగన ప్రశ్న లనే మళ్లీ అడిగారని చెప్పారు.  2020 నుంచే తన ఫోన్ ట్యాప్ అవుతోందన్న అనుమానం ఉందనీ, ఇదే విషయాన్ని సిట్ అధికారుల చేప్పానన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన సిట్ పోన్ ట్యాపింగ్ కేసు  దర్యాప్తును వేగవంతం చేసిందన్న ఆరా మస్తాన్..  నూతన సిట్ ఆధ్వర్యంలో ఈ కేసుదర్యాప్తు మరింత సమగ్రంగా జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.   

29 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. ఎన్ని రోజులో తెలుసా?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ విడుదలైంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు  సోమవారం (డిసెంబర్ 29) నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం పదిన్నర గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశం ఉంటుంది. ఈ శీతాకాల సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలన్నది బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయిస్తారు.  బయట అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చాలా వేడిగా సాగనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ  సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.  అలాగే, ఎంపీటీసీ, జెడ్పీటీపీ ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే అంశం కూడా సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇక పోతే.. కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులకు సంబంధించి, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు, వాటికి అంతే ఘాటుగా రేవంత్ ప్రతివిమర్శలు చేయడమే కాకుండా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటూ సవాల్ చేయడం నేపథ్యంలో ఈ శీతాకాల సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యంగా రేవంత్ సవాల్ ను స్వీకరించి మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో బీఆర్ఎస్ పక్ష నేత అయిన కేసీఆర్ సభకు వస్తారా? లేక డుమ్మా కొడతారా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

కేసీఆర్ తెలంగాణ తెచ్చిన మొనగాడు... ఆయన పేరు చెప్పుకుంటా : కేటీఆర్

  మాజీ సీఎం కేసీఆర్ పేరు చెప్పుకుని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అవును మా అయ్య తెలంగాణ తెచ్చిన మగాడు. మొనగాడు..మా నాన్న పేరు కాకుంటే ఇంకెవరు పేరు చెప్పుకుంటారు. బరాబర్ చెబుతా నువ్వు మంచి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు నువ్వు చెడు పనులు చేస్తే నీ మనవడు కూడా నీ పేరు చెప్పడని కేటీఆర్ విమర్శించారు.  కేసీఆర్ నా తండ్రి.. ఆయన్ని అనరాని మాటలు అన్నందుకు ముఖ్యమంత్రిపై నాకు గొంతు వరకు కోపం ఉంది. నేను గుంటూరులో చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రా నుండి అల్లుడిని తెచ్చుకుంటే తప్పు లేదటని ప్రశ్నించారు. ఆంధ్రా నుండి అల్లుడిని తెచ్చుకున్నాడు కాబట్టి చిట్టినాయుడు పేరు భీమవరం బుల్లోడు అని పెడదామని విమర్శలు గుప్పించారు. నేను గుంటూరులో చదువుకుంటే నీకేం ఇబ్బంది..నేను ప్రపంచమంతా చదువుకున్నాఅని కేటీఆర్ తెలిపారు.   జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను వరుసగా రెండుసార్లు గెలిపించిన హైదరాబాద్‌ ప్రజలకు పాదాభివందనం చేసినా తక్కువేనని కేటీఆర్ అన్నారు. నేడు శేరిలింగంపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్బంగా  కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు మేడిగడ్డను కూల్చివేసిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు చెక్‌డ్యామ్‌లను కూడా పేల్చివేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల గురించి ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారని, తిట్ల భాష తమకూ వచ్చినా తాము అలా చేయమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన  హామీలన్నీ ఎగనామం పెట్టారని ఆరోపించారు. పింఛన్లు  ఎప్పటి నుంచి పెంచుతారో చెప్పాలని డిమాండ్ చేశారు

హస్తినకేగిన సీఎం రేవంత్.. ఎందుకో తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సారి హస్తినకు బయలు దేరారు. శుక్రవారం (డిసెంబర్ 26) ఆయన ఢిల్లీకి బయలు దేరారు. ఈ పర్యటన ప్రధాన లక్ష్యం హస్తినలో శనివారం (డిసెంబర్ 27) అక్కడ జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడమే అయినా, ఆ సమావేశం తరువాత రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై ఆయన ఈ భేటీలలో కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఆయన తన ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం (డిసెంబర్ 28)న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.  ఇలా ఉండగా ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, జీహెచ్ఎంసీ విస్తరణ, ఎమ్మెల్యేల అనర్హత అంశాలపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీయడానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుందని అంటున్నారు. వాటికి దీటుగా అధికార కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై గళమెత్తి ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అదే విధంగా ఈ సారి సమావేశాలకైనా కేసీఆర్ హాజరౌతారా లేదా అన్న ఆసక్తి కూడా సర్వత్రా వ్యక్తమౌతోంది.  

కేటీఆర్ పై రేవంత్ విమర్శలు.. జగన్ కూ వర్తిస్తాయంటున్న నెటిజనులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.. రేవంత్ పై చేసిన వ్యాఖ్యలకు రేవంత్ బుధవారం (డిసెంబర్ 24) కోస్గిలో నూతన సంర్పంచ్ ల అభినందన సభలో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ పైనా, అలాగే కేటీఆర్ పైనా విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా కేటీఆర్ గతంలో తనపై చేసిన విమర్శలకు ఓ రేంజ్ లో బదులిచ్చారు.  ఈ సందర్భంగా రేవంత్ కేటీఆర్ , ఆమె సోదరి కల్వకుంట్ల కవిత మధ్య విభేదాలనూ ప్రస్తావించారు. సొంత చెల్లిని పండక్కి పిలిచి చీర కూడా పెట్టలేని వాళ్లు తనను విమర్శిస్తారా అంటూ ఫైర్ అయ్యారు.  ఆస్తిలో   వాటాకు వస్తుందనీ, పార్టీలో ప్రాధాన్యత కోరుతుందనీ..సొంత చెల్లినే  బయటకు పంపించిన వారు నాకు రాజకీయ నీతులు చెపుతున్నారు,   తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఆ విమర్శలపైనే ఇప్పుడు నెటిజనులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.  రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.  రేవంత్ విమర్శలు  అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కూడా జగన్ తన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనీ, పార్టీలో ప్రాధాన్యత కోరుతోందన్న ఉద్దేశంతోనే దూరంపెట్టారని గుర్తు చేస్తున్నారు.  రేవంత్ కేటీఆర్ పై సంధించిన విమర్శనాస్త్రాలను  ఇటు ఏపీ మాజీ సీఎం జగన్ కి కూడా ఆపాదిస్తూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అన్నా చెళ్లెళ్ల వివాదాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయ   ఇటు తెలంగాణలో కేటీఆర్, కవిత, అటు ఆంధ్రప్రదేశ్ లో షర్మిల, జగన్ ల మధ్య విభేదాలు పొలిటికల్ గా బీఆర్ఎస్న, వైసీపీలకు నష్టం చేకూరుస్తున్నాయనడంలో సందేహం లేదు.  తెలంగాణలో కేటీఆర్ లక్ష్యంగా కవిత, ఏపీలో జగన్ లక్ష్యంగా షర్మిల చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు బీఆర్ఎస్, వైసీపీల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతే కాకుండా కేటీఆర్ ను, జగన్ ను సొంత చెల్లెలికి అన్యాయం చేసిన అన్నలుగా ప్రజల ముందు నిలబెడుతున్నాయంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. వీటికి బదులు చెప్పలేక కేటీఆర్, జగన్ లు సతమతమౌతున్నారు. 

చంద్రబాబు.. విజన్ ఎహెడ్.. 2047 అండ్ బియాండ్!

అందరూ రేపటి గురించి ఆలోచిస్తే.. చంద్రబాబు రెండు  దశాబ్దాల ముందు గురించి ఆలోచిస్తారు. అదీ ఆయన విజన్. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ రోజే ప్రణాళికలు రూపొందిస్తారు. అదీ ఆయన దూరదృష్టి. అందుకే రెండు దశాబ్దాలకు ముందు ఆయన విజన్ 2020 అన్నారు. ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులూ కూడా చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ను, దూరదృష్టినీ ప్రశంసిస్తారు. రాజకీయ విభేదాలతో మరుగుల పడేయాలని ప్రయత్నించిన నేతలూ ఉన్నారనుకోండి. వారి ప్రయత్నాలు విఫ లమై వారే మరుగుల పడే పరిస్థితికి రావడం మనం చూస్తున్నాం. సంక్షోభాల నుంచీ అవకాశాల అన్వేషించే అభివృద్ధికాముకుడు చంద్రబాబు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు, సృజన, ఆలోచనలు, సంస్కరణలతో అందరినీ అబ్బుర పరుస్తుంటారు. ప్రభుత్వ కార్యాలయాలలో కంప్యూటర్లు, బయోమెట్రిక్ అటెండన్స్ ఇవన్నీ చంద్రబాబు ముందు చూపునకు నిదర్శనాలే.  వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను, పథకాలను ప్రజలకు అరచేతిలో పెట్టిన ఘనత కూడా చంద్రబాబుదే.  ఇప్పుడు తాజాగా మరింత మెరుగ్గా ప్రజలకు సేవలు అందించేందుకు   స్పీడ్ అఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు చంద్రబాబు.   ఇందు కోసం కార్యాచరణ కార్యాచరణ రూపొందించాలని   ఉన్నతాధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర లక్ష్యాలు, 10 సూత్రాల అమలుపై సచివాలయంలో  సిఎస్ విజయానంద్ పాటు ఆయా  శాఖల ఉన్నతాధికారులతో  బుధవారం (డిసెంబర్ 24) భేటీ అయిన చంద్రబాబు  స్పీడ్ అఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానంపై వారికి దిశా నిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం  ద్వారా పౌరులకు వేగంగా, మెరుగైన సేవలు అందించాలన్న ఆయన ఆ మేరకు కార్యాచరణ రూపొందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సుస్థిర అభివృద్ధి, అదే సమయంలో స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన కోసం తీసుకోవలసిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించిన చంద్రబాబు, ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలని, తక్కువ ఖర్చుతో ఇంధనం, విద్యుత్, రవాణా, నీటి భద్రత వంటి సేవలను అందించడమే లక్ష్యంగా ప్రణాళికల రూపకల్పన తదితర అంశాలపై అధికారులకు స్పష్ట మైన లక్ష్యాలను నిర్దేశించారు.  జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, టెక్నాలజీ వంటి అంశాల ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను ఆదేశించారు.

అట‌ల్, పీవీ.. పోలిక‌లు.. వ్యత్యాసాలు!

ఒకే నెలలో ఇద్ద‌రు దిగ్గ‌జాల జ‌యంతి, వ‌ర్ధంతి. తేడా ఏంటో చూస్తే డిసెంబ‌ర్ 25న వాజ్ పేయి జ‌యంతి. ఈ ఉత్స‌వాలు ఎలా జ‌రుగుతున్నాయి? అదే పీవీ వ‌ర్ధంతి ఎలా జ‌రిగింది? అన్న వ్య‌త్యాసం చూస్తే.. ముందుగా  ఈ ఇద్ద‌రి మధ్యా పోలికలను ఒక సారి గుర్తుచేసుకోవాలి.   అట‌ల్ బీహారీ  వాజ్ పేయి, పీవీన‌ర‌సింహ‌రావు  ఇద్ద‌రిదీ దాదాపు ఒక‌టే వ‌య‌సు అనే కంటే సమకాలీనులు అనడం బెటర్. 1924లో వాజ్ పేయి జన్మించారు.  1921లో పీవీ జన్మించారు. ఇక వీరి రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. వాజ్ పేయి 1957లో బ‌ల‌రాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించి  ఎంపీగా పార్ల‌మెంటులో అడుగు పెట్టారు. అదే ఏడాది పీవీ మంథ‌ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా  గెలిచారు. అట‌ల్ మొద‌టి నుంచి జాతీయ రాజ‌కీయాల్లోనే రాణిస్తూ రాగా.. పీవీ  తొలుత రాష్ట్ర రాజ‌కీయాలలో రాణించి, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. ఆ తరువాతే కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టారు. అట‌ల్, పీవీ ఇద్ద‌రూ  క‌వులే. మంచి వ‌క్త‌లే. అయితే వాజ్ పేయి ప్ర‌సంగాల‌కు వ‌చ్చిన గుర్తింపు పీవీకి రాలేద‌నే  చెప్పాలి. వాజ్ పేయి ఆర్ఎస్ఎస్ నేప‌థ్యం క‌లిగి ఉండ‌టం, అది కూడా ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టంతో .. ఆయ‌న వ‌క్తృత్వ ప్రతిభ ప్రజలను ఆకట్టుకుంది.   అట‌ల్ ప్ర‌సంగిస్తుంటే, అంద‌రూ శ్ర‌ద్ధ‌గా  వినేవారు. కోట్లాది  మంది అట‌ల్ ప్ర‌సంగాలకు అభిమానుల‌య్యారు. ఇక్క‌డ అధికార విప‌క్షాల‌న్న  తేడా  క‌నిపించేది కాదు. పీవీ కాంగ్రెస్ లో ఉన్నందు వ‌ల్లో ఏమో ఇందిర ముందు మ‌రే నాయ‌క‌త్వం ఎద‌గ‌డానికి వీలు లేని ప‌రిస్థితుల మ‌ధ్య 1991 త‌ర్వాత మాత్ర‌మే పీవీ ప్ర‌సంగాలు ఎక్కువ‌గా వెలుగులోకి వ‌చ్చాయి.   ఇక్క‌డ ఈ ఇద్ద‌రికీ  మ‌ధ్య గ‌ల మ‌రో పోలిక ఏంటంటే.. వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా  ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే..   పీవీ  నాన్ గాంధీ  కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి  ఏలి రికార్డు సృష్టించారు. ఈ విషయంలో  ఇద్దరూ కూడా చరిత్ర సృష్టించారు.  వాజ్ పేయిని ఆయ‌న పార్టీ  ఇత‌ర నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఇప్ప‌టికీ త‌మ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అదే పీవీ ప‌రిస్థితి అలా లేదు. ఆయ‌న‌కు పార్టీ ఇచ్చిన  గౌర‌వం అంతంత  మాత్ర‌మే. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే 2018 ఆగస్టు 16న అటల్ బిహారీ వాజపేయి మరణించారు. ఆయనకు ఆయన పార్టీ అంతా ఒక్కటై ఘన నివాళులర్పించింది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా  వాజ్ పేయి అంతిమ యాత్రలో పాల్గొని  4 కిలో మీటర్లు నడిచారు. ఆయన పాడె మోశారు.   ఇక పీవీ విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పీవీ నరసింహారావు మరణించారు.  డిశంబర్ 23, 2004న ఆయన మరణించిన సమయంలో  ఆయన అంతిమ సంస్కారానికి పార్టీ అగ్రనేతలెవరూ హాజరు కాలేదు. ఆయన ఢిల్లీలో మరణించినా, పార్టీ కార్యాలయంలోనికి ఆయన పార్థీవదేహానికి ప్రవేశం లేకుండా పోయింది. ఇక అంత్యక్రియలు కూడా ఢిల్లీలో కాకుండా హైదరాబాద్ లో నిర్వహించారు.   అట‌ల్ బిహారీ వాజ్ పేయి జ‌యంతి సంద‌ర్భంగా ఏపీ అమ‌రావ‌తిలో ఆయ‌న స్మృతివ‌నం ఏర్పాటు చేయ‌డంతో పాటు.. విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్రమాలు నిర్వ‌హిస్తున్నారు.. ఈ కార్య‌క్ర‌మానికి మాధ‌వ్ వంటి బీజేపీ నేత‌ల‌తో పాటు.. ఏపీ  సీఎం చంద్ర‌బాబు  స‌హా ప‌లువురు హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉంటే శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా.. ఇప్ప‌టికే ధ‌ర్మ‌వ‌రం నుంచి ఏలూరు వ‌ర‌కూ ప‌లు ప్రాంతాల్లో అట‌ల్ జీ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లు చేశారు. అట‌ల్- మోడీ సుప‌రిపాల‌నా  యాత్ర సైతం నిర్వ‌హించి అట‌ల్    ప్రేమాభిమానాలు కురిపించారు. కానీ పీవీ విష‌యంలో   ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా  ఖ‌ర్గే చిన్న ట్వీట్ తో స‌రిపెట్టారు. ద‌టీజ్ డిఫ‌రెన్స్ బిట్వీన్ కాగ్రెస్ అండ్  బీజేపీ  అంటూ ప‌లువురు ఈ వ్యత్యాసాల‌ను ఎత్తి చూపుతున్నారు.