ఆప్ కు కోలుకోలేని దెబ్బ.. మూకుమ్మడి రాజీనామా..
posted on Sep 6, 2016 @ 4:27PM
ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. పంజాబ్ లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 80 శాతం మంది ఆప్ నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇంతమంది రాజీనామా చేసి ఏ పార్టీలోకి చేరుతున్నారనే కదా డౌట్.. ఇంకేం పార్టీ బీజేపీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టిన నవజ్యోత్ సింగ్ పార్టీలోకి చేరేందుకే ఆప్ పార్టీని వీడినట్టు తెలుస్తోంది. బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన సిద్దూ ఆతరువాత ఆప్ పార్టీలోకి చేరుతారని వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే వాటన్నింటికీ తెర దించుతూ సిద్దూ ఇంకా ఇతర నేతలు కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. 'ఆవాజ్ ఇ పంజాబ్'లో పేరుతో ఏర్పాటు చేసిన ఈ పార్టీ ఈనెల 9 వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజే వీరంతా ఈ కొత్తపార్టీలోకి చేరుతారు అన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు ఈ సందర్బంగా అమృతసర్ ఇన్ చార్జ్ గురిందర్ సింగ్ బజ్వా మాట్లాడుతూ.. ఇంకా చాలా మంది ఆప్ లో కొనసాగుతున్న వారు.. తమ వెనుక రానున్నారని తెలిపారు. మొత్తానికి సిద్దూ పార్టీ..ఆప్ పార్టీకి భారీ షాకే ఇచ్చింది.