టీఎస్ పిఎస్ సి కేసు ఈ నెల 28 కి వాయిదా
posted on Apr 24, 2023 @ 2:52PM
టీఎస్ పిఎస్ సి పరీక్షల రద్దు వాయిదాను హైకోర్టు సమర్దించింది. సిట్ దర్యాప్తుపై రాజకీయ ఒత్తిడి ఉందంటూ కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ వేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ చేపట్టిన కోర్టు కీలక వాఖ్యలు చేసింది. సిట్ దర్యాప్తులో ఐటి నిపుణులు ఉన్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఐటి అంశాల దర్యాప్తుకు మళ్లీ ఔట్ సోర్సింగ్ కు వెళ్లారా? అని వ్యాఖ్యానించింది. బిజేపీ కాంగ్రెస్ నేతలను ఎందుకు విచారణకు పిలిచారు. నేతల నుంచి ఏదైనా సమాచారం సేకరించారా? అని కోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై ఈ నెల 28న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది.
అంతకుముందు ఇరు పక్షాలు హైకోర్టులో వాదనలు వినిపించాయి. ప్రభుత్వం తరపున ఏజీ తన వాదనను వినిపిస్తూ విచారణలో భాగంగా ఇప్పటి వరకు సిట్ 40 మంది సాక్షులను ప్రశ్నించిందని హైకోర్టుకు తెలిపింది. 12 కంప్యూటర్లను సీజ్ చేసినట్లు కోర్టు వరకు తీసుకెళ్లారు ఏజీ.
టీఎస్ పిఎస్ సి వ్యవహారం గత రెండు నెలలుగా రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. ఒక వైపు నిరుద్యోగులు, మరోవైపు ప్రజా సంఘాలు , రాజకీయ పార్టీలు టీఎస్ పీఎస్సీ లీకేజీలపై ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సిట్ విచారణ వేసినప్పటికీ ప్రతి పక్షాలు శాంతించలేదు. సీబీఐ జడ్జి విచారణ కోసం డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ కేసు విచారణ 28న వాయిదా వేయడంతో టీఎస్ పీఎస్ సీ లీకేజీ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.