పొట్టిగా ఒత్తుగా ఉండే వంకీల జుట్టు క్లిప్పు పెట్టి వదిలేసి, ఎప్పుడూ షార్ట్స్, జీన్స్ టీ షర్ట్స్ లో ఎక్కువగా కనిపించే ప్రఖ్య తో స్నేహాన్ని చాలా గొప్పగా భావిస్తాడు ఆదిత్య.... ఇంతకాలం ఈ అమ్మాయి తన జీవితంలోకి రాకపోవడం పెద్ద లోపం లా అనిపిస్తుంది అతనికి.
ప్రఖ్య కి కూడా అతనితో మాట్లాడేప్పుడు అతనితో కలిసి బైటికి వెళ్ళినప్పుడు పెద్ద ఇబ్బందిగా, చేయని పని చేస్తున్నట్లుగా అనిపించేది కాదు. ఎలాంటి జంకు బొంకు లేని ఆమె స్వభావం చిత్రంగా అనిపిస్తుంది ఆదిత్య కి. అతనికి మాత్రం ఆమె పక్కన ఉంటె ఏదో కొత్త లోకంలో ఉన్నట్లు ఉంటుంది... ఆమె దగ్గర్నించి వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్ళాలి అనుకుంటాడు.
రాత్రి పదిన్నర దాకా కలిసి చదువుకుని పడుకోడానికి తన ప్లాట్ కి వెళ్ళడం ఆదిత్యకి అసలు ఇష్టం లేదు.
కానీ పది కాగానే శిరీష దగ్గర్నుంచి ఫోన్ ...."ఆదిత్యను పంపించు భానూ....పడుకుంటాడు.... లేకపోతె పొద్దున్నే లేవడు...." అంటూ....
ఆమె ఫోన్ రావడం ఆలస్యం భానూ కూడా "చలో ఆదిత్యా ...గో హోమ్ ..." అని పంపిస్తుంది. ప్రఖ్య ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయదు. "ఓ.కె. ఆదిత్యా .....గుడ్ నైట్ ..." అని చెప్పేస్తుంది.
ఆదిత్య ఇక్కడే పడుకోవచ్చు కదా మమ్మీ అని ప్రఖ్య అంటే బాగుండు అనుకుంటాడు.
కానీ అలా ఎప్పుడూ అనలేదు.
అలాగే వాళ్ళిద్దరి ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి.
మధ్య మధ్య ప్రఖ్య క్లాస్ మేట్స్ ఇద్దరు ప్రఖ్య తో చదువుకోడానికి వస్తుంటారు. అలాంటప్పుడు ఆదిత్య వెళ్ళడు.... వాళ్ళ ముందు బిడియంగా సిగ్గుగా ఉంటాడు. ప్రఖ్య వాళ్ళని పరిచయం కూడా చేసింది. కానీ, ఎందుకో ప్రఖ్యతో ఉన్నట్టు వాళ్ళతో ఉండలేక పోయాడు. అంతేకాక ప్రఖ్య మెరిట్ స్టూడెంట్ అవడం చేత ఆ పిల్లతో కలిసి చదువుకోడం వలన ఆదిత్య మార్కుల్లో తేడా వచ్చింది. అది శిరీష కి చాలా సంతోషాన్ని కలిగించింది. ఫర్వాలేదు ప్రఖ్యతో స్నేహం అయాక ఆదిత్య చదువులో కాస్త ప్రోగ్రెస్ అయాడు అనుకుంది శీరీష.
ఇప్పుడు శిరీష, భానుల మధ్య సాన్నిహిత్యం మరింత ఎక్కువైంది. వ్యక్తిగత విషయాలు మాట్లాడుకునే దాకా వచ్చింది.
"నువ్వెందుకు మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు." ఓరోజు అడిగింది శిరీష భాను ప్రియని.
"చేసుకోవచ్చు ...కానీ ప్రఖ్య కొంచెం సెటిల్ అయాక చేసుకుందాం అని ఊరుకున్నాను. ఇప్పుడు చేసుకుంటే తను డిస్టర్బ్ అవుతుందేమో అని నా భయం." అంది భానుప్రియ.
"మరి నువ్వు...." సందేహంగా అడిగింది భాను.
శిరీష నవ్వింది. "నాకెందుకో పెళ్ళి అంటే కమిట్ మెంట్ అనిపిస్తుంది భానూ. పెళ్ళి చేసుకున్నాక మళ్ళీ పిల్లలు.... నాకెందుకో ఇప్పుడు పిల్లల్ని కని, మళ్ళీ వాళ్ళని పెంచి పెద్ద చేయడం అంతా రిస్క్ అనిపిస్తుంది. నాకిలాగే బాగుంది. ఐ లవ్ వివేక్....హి లవ్స్ మి....ఎప్పుడు కావాలంటే అప్పుడు సరదాగా గడిపేస్తాం.."
"ఆదికి తెలుసా ఈ విషయం...."
"ఏమో! వాడూ పెద్ద వాడవుతున్నాడు. తెలుసుకుంటాడు. నేనేదో పెద్ద విశేషం లా చెప్పాలను కొడం లేదు."
"వాడికిష్టం లేకపోతె మీ బంధం."
"వాడు మగపిల్లాడు భానూ! ఇంజనీరింగ్ లో సీటోస్తే వేరే ఊరు పంపిస్తాను. హాస్టల్ లో ఉంటాడు. ఆ తరువాత జాబ్ ఎక్కడో వస్తుంది. వాడి దారిన వాడు వెళ్తాడు. నా జీవితం మీద వాడి ఇష్టా ఇష్హ్తాల ప్రసక్తి కి అవకాశం ఏం ఉంటుంది?"
భాను కూడా శిరీష చెప్పింది సబబుగానే తోచింది.
కాకపోతే పిల్లల చదువు విషయంలో మాత్రం ఇద్దరూ ఒకటే విధంగా ఆలోచిస్తారు. వాళ్ళు ఇంజనీర్స్ అవాలి అంతే!
ఆరోజు కూడా ఆదిత్య, ప్రఖ్యా ఐ.ఐ.టి. కి ప్రిపేర్ అవుతున్నారు.
ప్రఖ్య రూమ్ చాలా బాగుంటుంది. దోమ తెరతో ఉన్న ఖరీదైన మంచం.... మంచం మీద రకరకాల టెడ్డీ బెర్స్.... మంచం వెనక గోడకి ప్రఖ్య, వాళ్ళమ్మ తీయించుకున్న ఫోటోలు.... పక్కనే చిన్న టేబిల్....దాని మీద టేబిల్ ల్యాంప్ ...ఆని కాలాల్లోనూ మంద్రంగా తిరిగే ఏ.సి ప్రఖ్య వాళ్ళ ఆ ప్లాట్ అద్దెకి తీసుకోడం విచిత్రంగా అనిపిస్తుంది ఆదిత్యకి. తమకన్నా వాళ్ళే రిచ్. మరెందుకు అద్దెకి తీసుకున్నారు. స్వంత ప్లాట్ ఎందుకు లేదు.
అదే అడిగాడు ఆరోజు ప్రఖ్య ని.
"మీకు ఒన్ హౌస్ లేదా ప్రఖ్యా...."
"లేకేం, ఉంది అక్కడి నుంచే మేము ఇక్కడికి షిప్ట్ అయ్యాం."
"అదేంటి సొంత ఇంటి నుంచి ఎవరన్నా అద్దెకి మారతారా?"
"మారారు ....కానీ మమ్మీకి అక్కడ ఉండడం ఇష్టం లేదు.... పైగా మమ్మీ ఆఫీసుకి ఇది బాగా దగ్గర మా ఇల్లు తార్నాక లో ఉంది. అది రెంట్ కి ఇచ్చి ఇక్కడి కి షిప్ట్ అయాం...." అంది.
"ఓ... సరే గానీ నాకు చదివి,చదివి బోర్ గా ఉంది. నీకు లేదా" అని అడిగాడు. నిజంగానే అతనికి చదువు అంటే చిరాకేస్తుంది. నిద్ర లేచిన దగ్గర్నించీ పుస్తకాల తోటే జీవితం అనిపిస్తోంది. ఒక రిక్రియేషన్ లేదు, పాడు లేదు. ఏదన్నా మూవీకి వెళ్ళచ్చు కదా అనిపించింది.
"ఏం చేద్దాం" అడిగింది ప్రఖ్య....ఆమె టేబిల్ మీదకు కొంచెం ఒంగి నోట్స్ రాస్తోంది.
అలా రాస్తే చదివినవన్నీ బాగా గుర్తుంటాయని ప్రఖ్య అలా రాస్తుంది. ఆదిత్య చేత బాగా రాయిస్తుంది.
అలా ఒంగినప్పుడు అస్పష్టంగా కనిపిస్తున్న ఆమె కంఠం కింది భాగం మొదటిసారి చూశాడు ఆదిత్య. ఒళ్ళంతా జివ్వుమన్నట్లు అయింది. అలా చూడాలని ఇంకా ఏదో కనుక్కోవాలని అతను ఆమెకి మరింత చేరువగా జరిగి నోట్సు చూస్తున్న నెపంతో టీ షర్టు లోపలికి తొంగి చూడసాగాడు. తెల్లగా, వెన్న ముద్దల్లా కనిపిస్తున్న ఆమె నవ యవ్వన సౌందర్యం అతడిని కాస్సేపు విచలితుడిని చేసింది. టీ షర్టు వేసుకుంటే ప్రఖ్య చాలా బాగుంటుంది.... చాలామంది అమ్మాయిలూ టీ షర్ట్స్ లో కనిపిస్తూనే ఉంటారు.... కానీ, ప్రఖ్య ని చూసినట్లు వాళ్ళను ఎన్నడూ చూడలేదు. ఈరోజు దగ్గరగా కనిపిస్తున్న ప్రఖ్య అతడికి వింతగా, గమ్మత్తుగా ఉంది. ఎంత ప్రయత్నించినా చూపు తిప్పుకోలేక పోతున్నాడు.
"మాట్లాడవేం? ఏం చూస్తున్నావు?" అంటూ తలెత్తిన ప్రఖ్య ఆదిత్య దృష్టి గమనించింది. చిరుకోపంతో "ఏయ్ బాడ్ బోయ్ ఎంటి చూస్తున్నావు" అంటూ చేతులు రెండూ వెనక్కి పెట్టి టీ షర్టు వెనక్కి లాక్కుంది. ఆదిత్య కంగారు పడ్డాడు.
"సారీ" అన్నాడు.
"ఇట్స్ ఒకే . చెప్పు బోర్ కొడుతోంది అన్నావు కదా ఏం చేద్దాం కాస్సేపు క్యారమ్స్ ఆడదామా?" నాక్కూడా బోర్ గా ఉంది."
"ఒద్దు ....ఏదన్నా మూవీ కి వెడదాం." అన్నాడు.
"మూవీనా? ఇప్పుడా? మమ్మీ చంపేస్తుంది. అంటీ కూడా . ఓ పని చేద్దాం నా దగ్గర డివిడీ లు ఉన్నాయి. ప్లే చేస్తా ఓ.కె. మమ్మీ రాగానే అప్ చేయచ్చు."
"ఓ.కె. ... ఏం సినిమాలున్నాయి." హుషారుగా అంగీకరించాడు.
"చూద్దాం రా"..... అంటూ టేబిల్ ముందు నుంచి లేచి హాల్లోకి నడిచింది. షా కేసులో ఉన్న డివీడి ఫోల్డర్ తీసి డీవిడీ లు అన్నీ చూస్తూ, బొబ్బిలి రాజు, గంగ- మంగ, కృష్ణవేణి, అంటూ ఒక్కో డివిడి తీసి పేర్లు చదువుతుంటే "ఇది చూద్దాం." అంటూ చిత్రం సినిమా డివిడి తీశాడు ఆదిత్య.
"యా....గుడ్ మూవీ ఇదే చూద్దాం...." అంటూ ఫోల్డర్ మూసేసి డివిడి తీసుకుని ప్లేయర్ దగ్గరకు వెళ్ళి డివిడి పెట్టి అన్ చేసింది. సోఫాలో సెటిల్ అయ్యాడు ఆదిత్య. రా అన్నాడు ఆమెకి తన పక్కన చోటు చూపిస్తూ.
"వెయిట్....తింటానికి ఏమన్నా తెస్తా." అంటూ కిచెన్ లోకి వెళ్ళి ఒక బౌల్ నిండా జంతికలు తీసుకొచ్చింది. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని జంతికలు తింటూ సినిమా చూడ్డం లో మునిగిపోయారు.
కాస్సేపు చూసేటప్పటికీ ఆదిత్య ఒళ్ళంతా వేడి ఆవిర్లు వస్తున్నట్లు అయింది. నరాలన్నీ తిమ్మిరి పట్టినట్లు అయాయి. ఓరగా ప్రఖ్య గుండెల్లోకి తొంగి చూడ్డానికి ప్రయత్నిస్తూ అటూ, ఇటూ కదులుతుంటే అతని చేతులు, తోడ ఆమెకి తగులుతూ ఆమెలో కూడా చిత్రవిచిత్రమైన అనుభూతి కలగసాగింది. కావాలని అతనికి కొంచెం దగ్గరగా జరిగింది. ఆ అవకాశం అదిత్యలో హుషారుని , సాహసాన్ని కలగచేసింది. నెమ్మదిగా ఆమె చేతి మీద చేయి వేశాడు.
"ఊ...." అంటూ చేయి తోసేసింది ప్రఖ్య.
ఆదిత్య కి కొంచెం భయం వేసింది. కొంచెం ఎడంగా జరిగాడు.
అతని చేయి తన చేతి మీద పడగానే ప్రఖ్య కి ఒళ్ళంతా జివ్వుమంది. గుండెల్లో చిన్న చిన్న మువ్వలు కుప్పగా పోసినట్లు అనిపించింది. ఆ స్పర్శ తీయగా, హాయిగా ఉంది. వెచ్చని ఆవిర్లు కమ్మసాగాయి. అయితే ఆడపిల్లలో సహజంగా ఉండే బిదియంతో అతనిచేయి తోసేసింది కానీ అతను ఎడం జరగడంతో నిరుత్సాహంగా అనిపించింది. ఓరగా అతని కేసి చూసింది హార్ట్ అయినట్టు మొహం ఎర్రగా చేసుకుని కూర్చున్నాడు.