"అవును చైతన్యా! యూ అరె రేర్ కేరెక్టర్ ఎవరో చెబితే కొంత తెలిసింది.మన స్వల్ప పరిచయంలో అది నిజమే అనిపించింది. ఐ లవ్ యూ చైతన్యా! జీవితాన్ని ప్రేమించడమే అలవాటైన నేను జీవితంకన్నా జీవించడాన్ని ప్రేమించే మిమ్మల్ని చూసి ఎంత ఇన్ స్పైరయ్యానూ అంటే, ఒక్క అనుభవంతో మీ పిల్లాడికి తల్లి కావాలనుకుంటున్నాను. బహుశా మీ సంప్రాదాయాలు ఇలాంటి కోరికను అంగీకరించవేమో? బట్ ఐ వాంట్ ఇట్. అది చాలు మిగిలిన కాలం హాయిగా బతకటానికి .... కమాన్."
ఆమె వివస్రగా మారిపోతుంది. అది కాదు ..... తలకెక్కినకాంక్షతో మీద కలియబడేటట్టుంది.
"సారీ లూజాన్ " గుండెల్ని మండించే ఆమె పొంకాన్ని చూడలేకపోతున్నాడు.
"ఒక్కసారి..."
"నో..."
"చాలా ఎమోషనల్ గా వున్నాను. కలేసేది ఒక్కసారైనా డేఫీ నెట్ గా తల్లినవుతణనుకుంటున్నాను....."
నుదుట పుట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ వేగంగా రైఫిల్ ని అందుకున్నాడు. మరో చేత్తో బ్రీఫ్ కేసు అందుకుని భావరహితంగా నిలబడిపోయింది.
అప్పుడు రాత్రి పడకుందున్నర కవోస్తోంది.
* * * *
ఇరుకుగా వున్న కాలిబాటపై పన్నెండు కిలోమీటర్ల ప్రయాణం చేసిన చైతన్య జీపుని ఆపి నెమ్మదిగా క్రిందకి దిగాడు.
నిశీధిలో ఎదురుగా వున్న గుట్ట నిద్రపోతున్న పాముపుట్టని స్పురింపచేస్తూంది. ఉండుండీ వీచేగాలి అలలు అదృశ్యంగావున్న సర్పాలు వాళ్ళా అతడి ఓడలు తాకుతున్నాయి.
ఇప్పుడు తాను అడుగుపెట్టింది ఎంత ప్రమాద భూయిష్టమైనా ప్రదేశమోతలంపుకు రావడంతోఅంత చలిలోనూ పలభాగంపైస్వేదం పేరుకుంటో౦ది.
పదిహేడు రోజుల తమ ప్రయత్నంలో ఇంచుమించు ప్రతిరోజూ ఈ గుత్తకు వచ్చాడు. కాకపొతే ఇలాంటి నిశిరాత్రులు కాదు. పట్టాపగలే శ్మశాన స్థబ్ధతని గుర్తుచేసే ఈ ప్రాతంలోనే తనకన్నా ఎంతో అనుభవంమున్న హంటర్స్ నురుగులు కక్కుకుంటూ ప్రాణాలు వదులుతుంటే ప్రత్యక్ష సాక్షిలా వుండిపోయాడు.
ఒకసారిమసక వెలుతురులో కదులుతున్న ఓ చెట్టు మానులాంటి విషసర్పాన్ని దూరంగా చెట్టుపై మాటేసి చూశాడు. కానీ, ఘాట్ చేయాలని అనుకుంటుండగానే అదృశ్యమైపోయింది.
సహజంగా ధైర్యవంతుడైన చైతన్య వెన్నులో సన్నగా చలి మొదలవుతుంటే భ్రీఫ్ కేస్ తెరచి 'టైమర్' వున్న బాంబును తీశాడు.
కీచురాళ్ళు రోదవింటూ తను మాటేయడానికి అవసరమైనాఎత్తయిన చెట్టు ఎన్నుకున్నాడు.
అలజడిగా వుంది.
ఇది కూడా సహసమని తెలుసు. అయినా, వెనుకడుగు వేయలేకపోతున్నాడు. వేటన్నది ప్రమాదంతో కూడిన వ్యవహారమైనా, తను ఎదుర్కో౦టున్నది ఒక క్రూరమృగంకాదు ఏ క్షణంలో ఎక్కడ ప్రత్యక్షమవుతుందో తెలియని అసాదారణమైన పరిమాణంగల విషసర్పం.
చూపు మాత్రంగానే శక్తి సన్నగిల్లేట్టు నియత్రించే వేగంగల కింగ్ కోబ్రా.
నెమ్మదిగా గుట్టను సమీపించాడు.
పైన వున్న నీటి టాంక్ వైపు రెప్పలాల్చకుండా చూశాడు. క్షణం పాటు. తన వేటలో మొదటి అంశం__ టాంక్ దిగువున ఒక కలుగులో టైం బాంబుని అమర్చగలగడం.
చీకటి చిట్టడివిలో చిక్కుకున్న కొత్త బాటసారిలా చప్పుడు చెయ్యకుండా పైకి నడుస్తున్నాడు శక్తిని కూడగట్టుకుంటూ.
అస్తవ్యస్తంగా పడివున్న బండరాళ్ళు రాత్రిలో నిదురించే వల్లకాటి పేతల్లా అందోళన పుట్టిస్తుంటే మెత్తగా కదులుతున్నాడు.
ఏభై అడుగులు పైకిచేరాక రొప్పుతూ ఆగాడు.
ఇక్కడినుంచే అసలు ప్రమాదం మొదలయ్యేది. గుట్ట చుట్టూ కలుగులు పేరుకుని వున్నది ఈ ఎత్తునుంచే మృత్యువుతోముఖాముఖి పోరాటానికి సిద్దం కావలసింది ఈ ప్రాతంలోనే. ప్రతి అనువు ప్రమాడానికి సంకేతం.
ఓ బండరాతిని అనుకుని రైఫిల్ సేప్టీ క్యాచ్ ముందుకు జరిపాడు. ఆ చిరుచప్పుడు అక్కడ నిశ్శబ్దాన్ని చేదిర్చింది.
గుండెలుగ్గపట్టుకుని చూస్తున్నాడు చీకట్లో కళ్ళను చిట్లించి.
శిలాక్షణాలు మొదలయ్యాయి.
ఏదో కదిలిన అలికిడి.
అది క్రమంగా తనని సమీపిస్తున్న అనుభూతి.
క్షణాలు టెన్షన్ గా గడుస్తున్నాయి.
కేవ్వుమనుబోయాడు పాదం వెనక ఏదో ప్రాకడంతో.
అప్పుడు చూశాడు దిగువుగా పరుగెడుతున్న ఓ ముంగినని.
రొప్పుతూ కణతలునొక్కుకున్నాడు.
పైకి చూసాడు__ మేఘాల మాటునుంచి కదిలిన చంద్రకాంతి ఉగ్రనేత్రాల విష జ్వలల్లా టే౦కు అంచుపై పడుతూంది.
వ్యవధి లేదు. ఆలస్యం చేస్తే టైమర్ లోని కాలం గడువు తీరిపోతుంది.
అరక్షణం పాటు ఓ ధ్యానంలా కళ్ళు మూసుకున్నాడు.
వ్యక్తావ్యక్త చైతన్యాన్ని తనలో నింపుకోవాలని అరుదుగా అతడు చేసే __ అతడికి మాత్రమే పరిమితమైన ఓ భావ సమాధి అది!
అంతే....
జ్ఞానేంద్రియాలని ఉత్తేజపరచుకుంటూ పైకి నడుస్తున్నాడు.