"హే... ల్లో..." అప్పుడు చూసాడు ద్వారం దాటుకుని లోనికి వస్తున్న లూజాన్ని....
కళ్ళు చేదిర్చే అసాధారణ సౌందర్యవతి అయిన ఇరవై రెండేళ్ళు 'లూజన్' రెండేళ్ళ క్రితం అందాలపోటీ మిస్ పిలిఫ్సీన్స్ గా ఎన్నికైన యువతి.
పిలిఫ్సీ న్స్ లో హంటర్ గా పేరుపొందిన ఆమె తండ్రి అదే విషసర్పాన్ని ఘాట్ లో డ్రగ్స్ కి అలవాటు పడిపోయింది. ప్రారంభ వదిలాడు . తండ్రితో చాలా అనుబంధంగల వ్యక్తిగా మ్నసికంగా దెబ్బతిని ఆ షాక్ లో డ్రగ్స్ అలవాటు పడిపోయింది.
ప్రారంభ దశలో వున్నందునేమో కళ్ళక్రింద కొద్దిపాటి చారలు తప్ప, అణువంతయినా ఆకర్షణ తగగ్లేదు.
"హొ...డూ.... యు..... డూ" పలకరించేడు మృదువుగా
"ఒంటరిగా బెడుతున్నారా" మత్తులో వున్న చేప పిల్లలా కదిలాయి ఆమె నేత్రాలు .... అంతా విన్నానిందాక... నేనూ రానా"
లూజన్ కీ , చైతన్య కీ వున్న పరిచయం కేవలం పదిహేను రోజులే అయినా చాలా ఆత్మీయురాలిపోయింది.
ఆమె ప్రస్థుత మానసికస్థితి తెలసి చనువుగా వుంటున్నాడే తప్ప చనువు తీసుకోలేదు. బహుఉశా అదే ఆమెనీ ఆకట్టుకున్న విషయమేమో తరచూ డ్రగ్స్ మూలంగా కలిగే లైంగిక ఉత్తేజమో ఒంటరిగా ఆమెను కల్సుకున్నప్పుడు చాలాసార్లు ఇలాంటి సన్నివేశాన్ని ఎదుర్కోన్నాడు.
"బాగుందా" వెన్నెల జలతారుపై అద్దిన కాంచనలా కళ్ళు మెరసి పోతున్నాయి.
"ఏ...మి....టి?" తల మరేదో తిప్పుకుని అడిగాడు.
"నేను అడిగేది నా కళ్ళ గురించి కాదు. బారో౦గ్ టాగాలోగ్" స్వచ్చమైన ఇంగ్లీషులో ఆమె వుపయోగించిన చివరి పదం అర్ధం కాలేదు.
"అంటే...."
అదోలా నవ్వింది. "నేను వేసుకున్న ట్రెజరూ, లూజ్ షర్టూ.... అది ట్రాన్స్ పరేంటుగావుండటాన్నిఅంటే మా బట్టల్నీ బారోంగ్ టాగా లోగ్ అంటారిక్కడ.
అప్పుడు చూశాడు ఉల్లిపోరాలాంటి షర్ట్ వెనుక 'బ్రా' లేదు. ఊర్పులతో వేడెక్కిపోతున్న సూర్యనేత్రాల్లా అనిపించి, వెంటనే తల తిప్పుకోబోతుంటే అమాంతం చేతులతో అతడిచెంపల్ని పట్టుకుంది.
"ఏమైంది నీకీరోజు "
చాలా ముఖ్యమైన మిస్ కాకూడదని రోజులా అనిపిస్తుంది చైతన్యా" నాలుకుతో పెదవుల్నీ తడుపుకుంటూ అంది "అసాధరమైన అండగత్తెనంటారు నన్నునిజానికి నాకోసం ఎందరో ప్రయత్నించి ఓడిపోయారు కూడా ఇన్నాళ్ళూ ఏ మగాడు నన్ను మట్టుకున్నా మైలబడి పోతానని ఈ అందాన్ని నలక్కుండా కలకాలం కాపాడుకావాలనుకునే దాన్ని. అందుకే డాడీ పెళ్ళిప్రసక్తి తీసుకొచ్చినా 'నో' అనేదాన్ని ."
ఇదంతా ఈ రోజు ప్రత్యేకించి ఇప్పుడు ఎందుకు చెబుతుందో అర్ధంకావడంలేదు. ఆమె చేతుల్నీ విడిపించుకుని కదలబోయాడు.
"నన్ను మాట్లాడనివ్వండి చైతన్యా....లూజాన్ నా పేరు మాత్రమే కాదు. పిలిఫ్సీన్స్ అస్తవ్యస్తమైన లూజూన్ ని ఇక్కడ సియర్రాయాడ్రీ కొండలు చాల జాగ్రత్తగా కాపాడుతుంటాయి. యస్....నేనూ అలాగే బ్రతికాను. అలాంటి నా బ్రతుకులో తొలి ఉప్పెన డాడీ మరణం.మరో ఉప్పెన నీ పరిచయం."
"లేట్ మీ గో."
వారించింది మరింతసుతారంగా "చైతన్యా ... మీ పేరుఇంగ్లీషులో అర్ధం ఏమిటి? ఓ.కే జవాబు చ్వ్హేప్పెట్టు లేరు. చూడండి చైతన్యా... డాడీ చాలా గొప్ప హంటర్ కదూ...."
"అవును."
"నాకీ ప్రపంచంలో మొన్నటిదాకా వున్నది డాడీయే. అయన అప్పుడప్పుడు ఏమంటారో తెలుసా? చచ్చిపోతే నీ కడుపునా పుడతాను అని" లూజాన్ మోహం క్రమంగా వివర్ణమైపోతూంది. "ఇప్పుడు డాడీకి నేను తల్లిని కావాలనుకుంటున్నాను...."
"పెళ్ళి చేసుకో"
"ఎవర్నీ."
"కోరుకున్న ఏ మగవాడినైనా ..."
"మిమ్మల్ని కోరుకుంటే...."
చేళ్ మందా జవాబు.
"నేను అందంగా వుండనా?"
ఏ మగవాడినైనా తిరస్కరించలేని అందం మీది."
"మరి మీరెందుకు దూరం జరుగుతున్నారు? మీరు ప్రేమించిన అమ్మాయి వుందా?"
ప్రీతి గుర్తుకొచ్చిందేమో అన్యమనస్కంగా తల పకించాడు.
"పిల్లల్నీ కనడానికి పెళ్ళే అనసరం లేదుకదా?" ఓ అడుగు ముందుకేసింది.
"లూజున్ ...ప్లీజ్..."
"ఒక అందమైన అమ్మాయి, మీలా అందమూ, చేవగల మగాడూ శారీరకంగా కలిస్తే ఎలాంటి పిల్లలు పుడుతారు? ఐ థింక్ ... మా డాడీ లాంటివాళ్ళనుకుంటాను."
"లూజూన్ టైమవుతుంది..."
"యస్ చైతన్యా ... నేను భయపడుతున్నదీ అటైం గురించే.... యూ ... ఇన్నాళ్ళూ గుండెల్లో నొక్కిపెట్టిన నాకోర్కెను ఈ రోజుఎందుకు బయట పెట్టానో తెలుసా.... మీరు .,... తిరిగి వస్తారో రారో అన్న భయం ."
ఆ గదిలో గాలి స్తభించిపోయింది కానీ, అమెశరీరం వేడిసేగల్నీ చిమ్ముతుంది.