ఒకటి ... రెండు..... మూడు.... క్షణాలు గడుస్తున్నాయి.
అతడిలో ఇప్పుడు ఇందాకటి అలజడి లేదు ఒక శత్రుస్థావరంలో అడుగు పెట్టిన సాహనంగల సైనికుడిలోని తెగువ తప్ప.
అయితే అయిదు నిముషాల్లో టే౦క్ ని చేరుకున్నాడు.
అరణ్యంలోని తోటల పెంపకం కోసం, టూరిస్టులదాహం తీర్చడం కోసం నిర్మించుకున్న ఆ టే౦క్ ఇప్పుడు ఉపయోగించని బావిలా బయట నాచుపట్టి వుంది.
కళ్ళు చిట్లించి చూశాడు దిగువుగా.
సిమెంటు గోడని అనుకుని చాలా కలుగుతున్నాయి.
ఏ కలుగులో ఏముందో తెలీని స్థితి అది. పదిహేను నిముషాలకు టైమరుకు సెట్ చేసి నెమ్మదిగా ఒక కలుగులోకి జరావిడిచాడు.
ఇప్పుడు టైమర్ చప్పుడు మృత్యువు గుండె చప్పిడిలా వినిపిస్తోంది. స్పష్టంగా.
ఇకా ప్రదేశంలో వుండటం ఎంత ప్రమాదమో గ్రహించిన చైతన్య చాలా వేగంగా దిగువుకి నడిచాడు.
కాలిపోతున్న క్షణాల మధ్య నిశ్శబ్దాన్ని అతడి బూట్ల చప్పుడు భయంగా చేదిర్చిన చైతన్య మొదటి ఘట్టం సజావుగా జరిగిపోయినందుకు సంత్రుప్తిలో రొప్పుతూ యిందాక చూసిన చెట్టుని అనుకుని వుంది పోయాడు చాలాసేపటిదాకా.
ఆయాసంగా వుంది. అయినా మిశ్రమించలేదు. తన ప్రయోగంలో అతి ప్రమాదకరమైన రెండోదిఅంతా సవ్యంగా జరిగితే చివరిదీ అయిన ఘట్టం ప్రారంభం కావడానికి మిగిలింది. నిమిషాలు వ్యవధి మాత్రమే.
మరో రెండు నిముషాలలో చెట్టుపైకి ప్రాకిన చైతన్య గుబురు కొమ్మల మధ్య నక్కి గుట్టపైకే రెప్పలారారకుండా చూస్తున్నాడు.
చేతిలోని 0.500 హైవేలాసిటీ స్వేడిష్ రైఫిల్ పైకెత్తి టెలిస్కోఫ్ లో నుంచి గుట్టని కలియచూశాడు.
గాలిలోకి విసిరిన పొర్సిలిన్ డిస్క్ ని గురితప్పకుండా నూరు శాతం కాల్చగలిగిన జాతీయ స్థాయి మార్క్స్ మేస్ అయిన చైతన్య యిప్పుడు వూపిరి బిగపెట్టి క్షణాలు లెక్కపెడుతున్నాడు.
ఆ నీరస నిశిధిలో చిత్రంగా టైమర్ చప్పుడు తప్ప మరేమీ వినిపించడంలేదు.
అనుకున్న వ్యవధి కావస్తోంది. అతని గుండె చప్పుడు అధికం కాసాగింది.
మరో అరనిముషం గడిచిందో లేదో అప్పుడు వినిపించింది అడవి దద్దరిల్లే విస్పోటనం.
టే౦క్ సిమెంటు గోడలు పగిలి ముక్కల్లా గాలిలోకి లేచాయి.
సముద్రపు ఉప్పెనేలా నీరు పరవళ్ళు తొక్కుతూ ప్రవహించింది.
అర క్షణంలో అన్నివేపులా గండి పడినట్టు వేల క్యూసెక్కుల నీళ్ళు గుట్టని తడిపేస్తూ కొన్ని వందల గజాల దూరందాకా వేగంగా ప్రవహించాయి.
ప్రళయ ఝుంఝామారుతంలా ఆ భీభత్సం కొన్ని సెకండ్లదాకా కొనసాగి గుట్ట దిగువున వున్న చాలా పొదల్నీ మోదళ్ళతో పెకిలించింది.
అప్పుడు చూశాడు అసాధారణమైన దృశ్యాన్ని.
కలుగుల్లోకి నీరు చొచ్చుకుక్పోవడంతో ఉక్కిరి బిక్కిరి అయిన కింగ్ కోబ్రా బుసకొడుతూ బండరాళ్ళు మధ్యకి వచ్చింది. జడివానలో తడిసిన రాబందులా రోషంతో కళ్ళని కషోష్టరు ధిరాంచితాలుగా మార్చుకుని ఉద్రేకంతో దిగువకి దూసుకొస్తూంది.
కొన్ని సేకండ్ల దాకా అవాక్కయ్యాడు.
గగుర్పాటు కలిగించే అసాధారణ దృశ్యం అది.
అంతటి పరిమాణం గల సర్పాన్ని చూడడంగాని, అంత వేగంతో కదలడాన్ని గాని వూహించని చైతన్య వెంటనే రైఫిల్ గురిపెట్టాడు.
చేటలా వున్న పడగ గురికి అనుకూలంగా వున్నా అది స్థిరంగా ఒకచోట వుండడం లేదు.
మెరుపువేగంతో అటూ ఇటూ కదిలిస్తూ పరిస్థితిని భీతావాహంగా మార్పుతోంది.
అప్పుడు వినిపించింది__
"చైతన్యా"
అక్కడి పరిస్థితి తెలీని లూజూన్ ఎప్పుడోచ్చిందో అక్కడికి.... బురదలో కారాపి నెమ్మదిగా నడుచుకు వస్తూంది.
"లూజూన్ ... స్టాఫ్ దేర్ " అరిచాడు చైతన్య .
"ఏమైందీ .... అసలు ఎక్కాడున్నావ్?"
వెనక్కీ తిరిగి చీకటిలోకి చూస్తున్న లూజన్ గమనించలేదు.__ వేగంగా తనవేపే ప్రాకుతున్న కింగ్ కొబ్రాని.
"లూ... జా... న్ "
చైతన్య కేకతో అడవి మరోసారి ప్రతిధ్వనించింది.
అప్పటికి కొబ్రాకి, లూజాన్ కి మధ్యవున్న దూరంకేవలం యాభైఅడుగులు నొక్కాడు అసకంల్పితంగా.
యాదృచ్చికంగా బుల్లెట్ ఒక బండరాయికి తలగడమూ అది చప్పుడు చేస్తూ ఏటవాలుగా వున్న ప్రదేశం పైనుంచిక్రిందకి దొర్లడమూ రెప్పపాటులో జరిగిపోయింది.
ఇక్కడ లూజాన్ క్షనకాలమైన చేసుకున్న అదృష్టం వేగంగా కదిలిన బండరాయి కింగ్ కోబ్రా తోకని తాకుతూ సాగిపోవడమే!
అంతే.... తోక తొక్కిన త్రాచులా కోబ్రా చివాలున వెనక్కీ తిరిగింది. ఇది వూహించని పరిమాణంలా పక్కనే ఆగిపోయాడు చైతన్య.
అప్పటికి కొబ్రాకి చాలా చెరువుగా వెళ్ళిపోయిన చైతన్య మేఘంలా మీదికోస్తున్నా పడగని చూశాకగానీ గ్రహించలేదు తను ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నదీ.....
క్షణం రక్తప్రసరణ స్తంభించింది మరుక్షణం హైవేలాసిటీ రైఫీల్ తూతాని కక్కింది.......