అందుకే మృదువుగానవ్వి మరోమారు కోడ్వర్డ్స్ ఉపయోగించాడు
అతని మాటలింకా పూర్తికాకముందేబదులుగా ఓచెయ్యి వైధేయ మేడల్లా అబ్లాంగేటాను తాకింది.
అంతే......
బోర్లాపడ్డాడు రచయిత లాగానే రేజిలర్ గా అనిపించే వైదేయ....
ఊహించని ఈ పరిణామానికి బిత్తరపోయిన వైధేయ ఎంత వేగంగా నేలను కరుచుకుపోయాడో అమాంతం కాలారందుకుని పైకిలేపాడు......
చిన్న గెడ్డంతోరక్తపు జీర నిండిన కళ్ళతో హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ కౌర్ సింగ్ లా కనిపించిన వ్యక్తినిచూసి వైధేయ ఆ సమయంలో ఎంత అదిరిపడ్డాడంటే ఒంటిలోని ప్రతిస్పేర్ పోర్టోపీకి పొట్లంకట్టి చేతికి అప్పచెపుతాడేమో అనిపించింది.
నిజానికి ఆ క్షణాన వైధేయ ఇబ్బంది పడుతున్నది తినబోతున్న దెబ్బలగురించి కాదు. రచ్చకెక్కుతున్న తన పేరు ప్రఖ్యాతలగురించి __
"వారం రోజులుగా అది ఆఫీసు కేళుతుంటే శతాయిస్తున్నావాట.... పైగా ఇవాళ పార్కుక్కూడా రమ్మన్నావట......"
కౌర్ సింగ్ పిడికిలి రివ్వున గాలిలోకి లేచింది.
ఒకవేళ ఆ దెబ్బేగాని తగిలితే వైధేయ నామం మాటెలావున్నా రూపం మాత్రం పూర్తిగా మారిపోతూంది.
అందుకే అమాంతం చేతిని పట్టుకుని "సర్..... నేను ఇదే మొదటి రోజు..... నా ఫ్రెండునుకుని..... ఎర్రచీర.... కోడ్ నెంబర్....." కాగితాలపై సునాయాసంగా అందమయిన వాక్యాలను కూర్చగల అతడు భయంతో మాటల్ని మింగేస్తూ త్రోటుపడుతుంటే అతడెవరో తెలీని ఆమె "వదిలేయండి పాపం" అంది.
"వదిలేయడమా.... వారంరోజులుగా...." మరోమారు ముష్టిఘాతంతో బాక్సింగ్ కిట్ పై ప్రాక్టీసు కు సిద్దపడుతున్నట్టు కుడిచేతిని పైకి లేవగానే "ఇతను కాదండి! " అంది అడ్డం పడి "వాడు వేరే...... మిమ్మల్ని చూసి ఎక్కడో నక్కేసుంటాడు."
కౌర్ సింగ్ ఆగిపోయాడు.
బిక్కచచ్చిపోయిన వైధేయనోమారు తీక్షణంగా చూసిన ఆ బాహుబలం సంపన్నుడు మరుక్షణం తన బాహువుల మధ్య భార్యను ఇరికించుకుని పార్కు గేటువైపుగా నడిచాడు.
సరిగ్గా అప్పుడే వెనుకగా చూశాడు వైధేయ.....
ఆమె ఎర్రచీర కట్టుకుందేమోగాని సిగలో ఎర్ర గులాటి లేదు......
చిన్న పొరపాటుకి ఎంత మూల్యం చెల్లించాల్సింది. వస్తుందో చాలా ప్రాక్టికల్ గా తెలుసుకున్నాడు. పార్కు గేతువైపుగా నడిచాడు.
సరిగ్గా అప్పుడే వేనుకుగా చూశాడు వైధేయా.....
ఆమె పొరపాటుకి ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో చాలా ప్రాక్టికల్ గా తెలుసుకున్నాడు వైధేయ.
ఇదేమిటి.....
వాడేవాడికోసమో వలపన్నితే దురదృష్టవశాత్తుతను ఇరుకున్నాడు.
చాలాసేపటివరకూ తేరుకోలేకపోయిన వైధేయ పైజమాకి అంటుకున్న గడ్డి దుబ్బుల్ని దులుపుకుంటూ రెండడుగుల ముందుకు నడిచాడో లేదో "హల్లో" అంటూ ఎవరో పలకరించారు.
గిరుక్కున వెనక్కు తిరిగాడు.
ఎదురుగా హైడ్ .
ఆ క్షణంలో అతడ్ని కలం పేరుతో సంచలన వార్తా పత్రికలకేక్కించే జర్నలిస్టు అతడు. అసలు పేరేమిటో వైధేయకి సైతం తెలీదు.
చాలస్వల్ప పరిచయం వారిది.
రహస్యంగా వివరాల్ని సేకరిచడం ధైర్యంతో సత్రికాముఖంగా ప్రజలకి తెలియజెప్పడంలో నిష్టాతుడను.
ప్రమాదభూయిష్టమయిన జీవితమతడిది . అయినా నిబ్బరంగా హుషారుగా వుంటాడు.
ఇద్దరిమధ్యా కొన్ని సెకండ్ల నిశ్శబ్దం.
"చూశాను"
అదే హైడ్ అన్న మొదటి పదం .
వైధేయకి ఛేళ్ మనిపించినట్టు "ఏ..... ఏంటి..... చూశారూ..." అన్నాడు నీళ్ళు నముల్తూ.
ముప్ఫై ఏళ్ళయినా నిండవి హైడ్ ముక్కు పైనుంచి జారిన కళ్ళ ద్దాల్ని పైకేగదోసుకుంటూ "మీరిక్కడడు౦డడాన్ని.... అందుకే ఒక జర్నలిస్టుగా కాక మీ అభిమానిగా మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చాను" అన్నాడు.
తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు వైధేయ....
నయం జరిగినదంతా చూళ్ళేదు......
"చెప్పండి" అన్నాడు వైధేయ... వీలైనంత త్వరగా అతడ్ని వదిలించకోవాలనుకుంది.
"ఈ వారం "మారణహొమం" సీరియల్ ఇందాకే చదివాను.... అద్భుతంగా వుంది. ధనుంజయ్ చేత చాలా యుక్తిగా భార్యను చంపించారు.... అనుకుని మలుపు సుమండీ..... ఎంతమంది మగాళ్ళు లేరు అలా అనుమానంతో భార్యను అంతం చేసిన వాళ్ళు..... ఎనీవే...... చాలా మంచి సమాధి చేసేశాక అత్తామామలచేత పోలీసు కంప్లయింట్ చ్చేట్టు చేశారు..... పాపం మళ్ళీ ధనుంజయ ఇరుక్కుపోతాడేమో కదూ"
అవునన్నట్టుగా తలూపాడు వైధేయ.
దాని తర్వాత ఇష్యూయే ఇందాక వైధేయా వారపత్రిక ఆఫీసులో కూర్చుని రాసింది.....
ఇన్ స్టాల్ మెంట్స్ పద్దతిలోవార పత్రికలకి సేరియన్స్ రాసే ప్రముఖ రచయితా వైధేయ.....