Previous Page Next Page 
ది రైటర్ పేజి 8

    మరోపదినిముషాల పీడించి రాఖడించగా నివదలి పెట్టలేరు హైడ్.
   
    వైధేయ ముభావంగా వుండటాన్ని గమనించిన హైడ్ "ఏదో పాట్లుకోసం వేనుక్కుంటున్నట్టున్నారు .....కెరీ అన్ సర్" అంటూ వెళ్ళి పోయాడతాను.
   
    నిస్రాణగా తూముదాటి పార్కు మరోమూలాకి నడిచాడు ఓ చోట కూచుని అలసట తీర్చుకోవలన్నాట్టుగా___
   
    అతడు మెర్క్యూరీ లైటు స్థంబాన్ని దాటుతుండగా మసక వెలుతురూలో ఓ సన్నజాజి చెట్టుకు అనుకుని ఓ యువతి నిలబడ్డ౦ గమనించాడు.

    అక్కడ యువతి నిలబడ్డం కాదు అతడ్ని ఆకట్టుకున్నది.
   
    ఆ యువతి ఎర్రచీరలో ఎర్రగూలాభీ పెట్టుకుని వుంది.
   
    అంతసేపూ అలుముకున్న విస్స్తేజత చెదిరిపోయింది.
   
    తప్పకుండా రోషిణి అయ్యుండాలి
   
    లేకపోతె అలా ఒంటరిగా ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టు నిలబడాల్సిన అగత్యంలేదు....
       
    అంతే....
   
    వెలుగును దాటి వైధేయకూడా క్రీనీడని చేరుకొని అమెకువేనుకుగా దగ్గరగా నిలబడ్డాడు.....
   
    కొన్ని క్షణాల నిశ్చబ్దం తర్వాత నెమ్మదిగా "థర్టీ ఫోర్ __ ట్వంటీ ఎయిట్ థర్టీ ఫోర్" అన్నాడు.
   
    కిసుక్కున నవ్వు వినిపించింది.
   
    హమ్మయ్య...... రోషణియే...... తాను అన్ని మూలలా గాలిస్తుంటే ఈకోదలో నిలబడి ఆటపట్టిస్తూండన్నమాట......
   
    ఎంత అందంగా నవ్వింది.
   
    మరోమారు"థర్టీ ఫోర్ " అనబోతుండగా  "అంతఖర్లే.... ట్రీ రూసీస్ చాలు" అన్న జవాబు వినిపించింది. ఆమె దగ్గర్నుంచి.......
   
    "నై౦టీసిక్స్ అంటానని త్రీ రూపీస్ అని జవాబుస్తున్నారేమిటి"
   
    కిలకిలా నవ్వు వినిపించింది.
   
    ఒక్కసారి వెనక్కీ మీ సొమ్మేం పోయింది అనుకున్నాడు.
   
    "మాటాడారేం. నై౦టీసిక్స్ అనరూ"
   
    "రాత్రి నైన్ నుంచి తెల్లవారిసిక్స్ వరకూ కలియపెట్టయితే  నై౦టీసిక్స్ మరి..."
   
    "చాల్లెండి ..... వెనక్కీ తిరగండి"
   
    ఆమె తిరిగింది. వెలుగురేఖ ఒకటి ఆమె ముఖంపై పడగానే వైధేయ కళ్ళు తిరిగినట్టనిపిస్తుంటే "నువ్వు" అన్నడు నీళ్ళు నముల్తూ.
   
    "నేనేవరైతే నీ కెందుకు.... రేటేదో మాటాడేసుకుని చకచకా వన్జరిపించుకు పోవాలిగాని......" ఆమె రెండడుగులు ముందుకేసింది చొరవగా......
   
    అప్పటికే వైధేయ చాలా దూరం వచ్చేసాడు.
   
    హాఠాత్తుగా కాళ్ళు అంతటి బలాన్ని ఎలా పుంజుకున్నాయో నడక పోటీలో నడుస్తున్నట్లు వందడుగులు దాటేసాడు.
   
    ఛ ఛ.....ఏంటి ఇవాళింటా ఇలా జరుగుతూంది.
       
    ఎవడిమోహం చూశాను
   
    అంతటా హంసపాదులే......
   
    మరొక్క క్షణం కూడా ఈ పార్కు పరిసరాల్లో వుండకూడదు. ఉంటే అవమానాలు మాత్రమె కాదు నిజంగా మతి చెడేటట్టుంది.
   
    రిషిణి పై ఎంతకోపం వచ్చిందంటే తనమీద ఏదో అధికారమున్నట్లు తనకేదో దద్దరించడానికి అవతారమెత్తినట్టు ఫోన్ లో కబుర్లు చెప్పిన ఆమె కనిపిస్తే అడక్కుండా ఆమె ఇష్టం లేకుండా అరడజను సార్లయినా రేఫ్ చేయాలనిపించింది.
   
    నడుస్తున్న వాడల్లా టక్కున ఆగిపోయిన ఏదో ఆలోచన మెరిసి.  
   
    అసలు రోషిణి అనే శాల్తీ వుందా.
   
    లేక ప్రత్యర్ధులైన రచయితాలెవరైనా తనకున్న ఆడపిల్లలు హీనత కనిపెట్టి ఇలా ఓ అమ్మాయిచేత ఫోన్ చేయించరా.
   
    అది నిజమైతే ఆ బడుద్దాయి లెవరో ఈచుట్టుపక్కల నిలబడి తన యానకి దారుణంగా ఎంజాయ్ చేస్తూ వుండొచ్చు.
   
     ఈ ఆలోచన రాగానే ఇక అగలేదు......
   
    వడివడిగా పార్కుగేటు కేసి నడక మొదలుపెట్టాడు.
   
    మరో అనర్ధం జరక్కముందే వెళ్ళిపోవాలి.
   
    అలా నడుస్తున్న వైధేయ పార్కుగేటు మరో పదిగజాల దూరం ఉందనగా......
   
    ఎవరో బలవంతంగా ఆపినట్టు ఆగిపోయాడు.
   
    ఇందాక......
   
    పార్కుకి రాగానే తను మిశ్రమించిన సిమెంట్ బెంచీపై ఎవరో యువతి కూర్చుని ఉంది.
   
    చిత్రంగా ఎర్రటి షిఫాన్ శారీ కట్టుకుని మరింత విచిత్రంగా సిగలో ఎర్రగూలాభీ తురుముకుని.
   
    ఏమిటి...... ఇది మరో 'కో ఇన్సిడేన్సా'......
   
    అవునని అనుకోలేకపోతున్నాడు ఆమెను చూస్తుంటే.......
   
    పసిమిఛాయాల్నివెదజల్లే సోడియం వేపర్ విద్యుదీపపు కంటిలో తడుస్తున్న వీనీస్ లా__ ఆవిష్కతాగ్నిలా అశ్లీష్టాభిక్తమై అవిర్శవించిన అప్సరశ్శిరోమాణిలా నిరీక్షిత నిరత్యయ భువనైక మోహాన ఖాండగారంలా ఎంతటి సమ్మోహనం ఆ భంగిమలో ......
   
    ఈ అసదృశ లావాజ్యం రిషిణది కాక మ్నరేవరికుంటుంది.
   
    స్వాప్నికావస్త నుంచి తేరుకోవడానికి ఎంత వ్యవధి కావాల్సింది వచ్చిందో అతనికి గుర్తులేదు.

 Previous Page Next Page