Previous Page Next Page 
ది రైటర్ పేజి 6

    "అయామ్ సారీ...... మీరే వైదేయ అనుకొని తొందరపడ్డాను."
   
    ఇలా తొందరపడేమీరు జైలుకి వెళ్ళింది. "వైదేయ స్థిరంగా అన్నాడు. అమెనిజంగా బెదిరిపోతూంది అనుకున్నాడు. అందుకే నవ్వేడు గర్వంగా.
   
    "నవ్వకండి మిస్టర్. తెలివి మీఒక్కరిసొత్తేకాదు...."
   
    అవతలినుండి ఆమె స్వరం వినిపించింది మామూలుగా వైదేయ భ్రుకటి ముడిపడింది అర్ధం కానట్టుగా.
   
    "మీరు వైధేయని నాకు తెలుసు"...... ఇప్పుడు ఖంగుతినడం వైధేయవంతైంది.
   
    "వ్యవధి లేదు! నిర్ణయించుకోండి. ఒక అపూర్వమైన కలయికతో మీ బ్రతుకుని తీర్చి దిద్దుకుంటారో లేక పిరికితనంతో లేక పిరికితనంతో మీ తలుపుతట్టిన అదృష్టాన్ని కాలదన్నుకుంటారో మీ ఇష్టం....."
   
    "ఆగండి" ఫోన్ పెట్టేస్తూందేమోనని తొందరపాటుగా వారించాడు
   
    అదే వైదేయ చేసిన పెద్ద పొరపాటు.
   
    ఒక వేళ ఎగతాళిగా అయినా ఆమెతో సంబంధాన్ని అక్కడత్రుంచి వుంటే ఒక కొత్త చరిత్రకి సృష్టి జరుగేదికాదు
   
    "యస్ ..."తీవ్రంగా వినిపించిందా కంఠం.
   
    "నేను....."

    "వైదేయే అని ఎలా గుర్తు పట్టగాలిగానో చెప్పామంటారా..."
   
    నవ్వింది......పడి  పడి నవ్వింది.
   
    ఆమె కంఠంలో అధికారం నవ్వుతోకూడా శాశించగల ధీమా ఎందుకో ఆ క్షణాన వైధేయలో చిన్న భయంలాంటి కలిగించింది.
   
    "చెబుతాను ..... రండి......"
   
    ఫోన్ పేట్టేసింది అతడి జవాబు కోసం ఎదురుచూడకుండానే వాచీ చూసుకున్నాడు.
   
     అప్పుడు టైము అయిదుగంటల నలభై నిముషాలు.
   
                                  2
   
    "ఒకవేళ తనమీద కోపంతో అటువంటి౦చానన్న ఉక్రోషంగా రావడం మానేసిందా"
   
    అసహనంగా వాచీ చూసుకుంటూ అనుకున్నాడు వైధేయ ___
   
    అప్పుడే టైము ఆరున్నర కావొస్తుంది.
   
    సరిగ్గా అయిదూఏభై అయిదుకి ఆదరాబాదరా ఇందిరా పార్కు చేరుకున్నాడు వైధేయ......
   
    అక్కడకు వచ్చేకగాని  అతడికి గుర్తుకురాలేదు. తను తొందరపాటులోసరిగ్గా అమెఅక్కడ వెయిట్ చేసేదీ కనుక్కోలేదన్న విషయం.
   
    ఇంత పెద్ద పార్కులో ఏమూల వెదకడం.
   
    అతని కళ్ళు జాగ్రత్తగా అక్కడ ప్రపంచాన్ని మరచికబుర్లలో మునిగిపోయి ఉన్నారు.
   
    కొబ్బరిచెట్ల నడుమవున్న పిల్లలు కేరింతలతో సందడిగా ఆడుకుంటున్నారు.....
   
    ఎవరో ఒక ముష్టివాడు తుండగుడ్డ పరచి సమీపంలో నడుచుకు వెళ్ళుతున్న వ్యక్తులకేసి ఆర్తిగా చూస్తున్నాడు.
   
    ఎందుకో వాడ్ని చూస్తుంటే తన పరిస్థితి అలాగే ఉందనిపించింది.
   
    ఉన్న తేడాఅల్లా వాడు దానం చేసే వ్యక్తులకోసం ఎదురుచూస్తుంటే తనేమో రాణి అపరిచితురాలికోసం అన్వేషిస్తున్నారు.
   
    వెధవ ఆలోచనలు....
   
    రచయితన్న వాడికి ఈ డర్టీ అబ్జర్వేషన్స్  ఎక్కువకావడంతో అనవసారమైన సిమిలీస్ మెటుఫార్స్ ఎక్కడికక్కడ బుర్రలో మెదలి మహాటార్చర్ చేస్తుంటాయి.
   
    విస్సుగ్గా ముందుకు నడిచాడు.....
   
    చిరుసవ్వడితో పారుతున్న ఒకనీటిపాయపై అందంగా కర్రలతో నిర్మించబడిన తూమును దాటుతూ అసంకల్పితంగా వాచీ చూసుకున్నాడు మరోమారు.       
   
    ఆరు నలభై ......
   
    క్రమంగా చుట్టూ చీకటి అవరిస్తూంది.
   
    "షిట్"
   
    పరిచయంలేని వ్యక్తికోసం ఈ పడిగావులెంటి____
   
    హెల్ వితిట్
   
    బహుశా ఆకతాయిగా ఎవరన్నా ఫోన్ చేసి వుండొచ్చు.
   
    రెండడుగులు వేశాడు లాన్ వేపు ___
   
    అంతే
   
    నిశ్చేష్టుడిలా నిలబడిపోయాడు.
   
    అక్కడ పచ్చని పచ్చికబయలుపై ఎర్రచీరకట్టుకుని ఓ అమ్మాయి నిలబడివుంది. అప్పుడే వెలిగిన విద్యుదీపాల     కమతిలో ముగ్ధలా మౌనంగా నిలబడ్డ ఆమెను తేరిపారాచూడగానే వైధేయ గుండె లయతప్పినట్టయింది.
   
    చుట్టూ చూసాడోమారు ___
   
    ఫర్వాలేదు __ ఎవరూ లేరు దగ్గరగా ___
   
    సుతిమెత్తగా అడుగులేస్తూ చాలా నెమ్మదిగా ఆమెను సమీపించింది. మరింతనెమ్మదిగా "థర్టీ ఫోర్ ట్వంటీఎయిట్ థర్టీ ఫోర్ " అన్నాడు.
   
    ఆమె చూసింది కాస్త తలతిప్పి ___
   
    వైధేయ పెద్ద అందగాడు కాకపోయినా అనాకారి మాత్రం కాదు. సుమారు అయిదడుగుల పదంగుళాల పోడవుంటే వైధేయ ఎత్తుకు తగ్గట్లు బలిష్టంగా వుంటాడు.
   
    తొలి పరిచయం కాబట్టి తను అందంగా కనిపించాలన్న తాపత్రయంతో ఆ రోజు కాస్త ఎక్కువగానే జాగ్రత్తపడ్డాడు.
   
    ఎదురుగా నిలబడ్డ  యువతి కాస్త కళ్ళు చిట్లించి చూడగానే "నువ్వు చాలా అందగాడివని వూహించానే ఇలా వున్నావేంటి" అని రోషణి అసంతృప్తి చెందుతున్నట్ట్లుగా ఫీలయ్యాడు.
   
    అలా ఎక్కువసేపు చూపులో పరామర్శించుకోవడం అతనికిష్టంలేదు. 

 Previous Page Next Page