"వాడు... ఆ డామ్ పూల్ .... నాకోసం ఏమన్నా చేస్తానని ఎన్నోఎన్నోకబుర్లు ఆ సన్నాఫ్ బీచ్ సరాసరి పోలీస్ స్టేషనుకు తీసుకువెళ్ళి నన్నప్ప చెప్పాడు."
"వ్వాట్...."
"సరిగ్గా మీలాగే నేనూ ఆశ్చర్యపోయానప్పుడు" కొద్దిపాటి విరామం తర్వాత "ఇప్పటికైనా అంగీకరిసతారా నేను జైలుకు వెళ్ళడానికి ముఖ్య కారణం పరోక్షంగామి సాహిత్యమేనని..... ఐమీన్ మీరేనని......"
అతను మాటడలేదు సన్నగా ప్రకంపన మొదలైంది అతడి శరీరంలో ___
"ఆర్టిస్టు ఘోష అతడ్ని చుట్టూ ముడుతుంటే ___
రోహితాస్వుడు సారీసృపమై సర్యాంగీణద్యుతికి సిద్దపడినట్టు సురలిమ్నగ కలుషాంభోదియై హేయహేరామికి ఆయత్తమైనట్టు రోమిహర్షితమై రోదావళితమై చూస్తూ ఉండిపోయాడు..... అతని మొహమంతా స్వేదనంటో నిండిపోయింది.
"తుడుచుకోండి" మృదువైన నవ్వు వినిపించింది.
అసంకల్పితంగా కర్చీఫ్ తో ముఖం తుడుచుకుని "అయాం సారీ" అన్నాడు.
మరోమారు ఆమె నవ్వు వినిపించింది. "ఏం రచయితలూ మీరు మహాశయా..... ఇన్ని క్రైం నవల్సు రాసి ఇంతటి కీర్తిని సంపాదించిన మీరు ఈ మాత్రం దానికే వణికిపోతున్నారేమిటి....."
జీవితం కధ కాదు కాబట్టి" ఆమె మాటని ఆమెకే అప్పజెప్పాడు .
"నిజమైన ధైర్యమంటే ఓటమిలో అధైర్యపడకపోవడం"
"దెబ్బ తిన్నాక కూడా ఇలా మాటాతున్నారే __"
"ఓటమిలో నుంచి గెలుపును సాధించిన క్లీయోపాత్రా మీకు తెలుసుగా __"
"కాని చివరకి ఓడిందిగా "
"గెలిచాకేగా"
"ఎంతటి నమ్మకం మీకు __"
"నన్ను చూస్తేనా అందాన్ని ప్రత్యక్ష్యంగాగమనిస్తే మీకు అనమ్మకం ఏర్పడుతుంది."
తేరుకున్నాడు __ అతనిలో అలజడి తగ్గింది __ఈ మొండి ఆడదాన్ని అమె అంతగా గర్వపడుతున్న అందాన్ని చూడాలన్న తమకం మొదలైంది __ అదే వైదేయలో వున్న పెద్ద బలహీనత.
కాని అదే సమయంలో అంతర్లీనంగా ఏదో అనుమానం ___
అలా అలోచించడం వైదేయ తప్పుకాదు.
ఇంతవరకు ఒక రకం ఆడవాళ్ళనే చూసాడు. ఇలాంటి తెగువైన ఆడపిల్ల పరిచయం గావడం ఇదే తొలిసారి.
"సరే..... ఎక్కడ కలుద్దాం...." ఉత్సుకతని చంపుకోలేకపోయాడు .
"మీరేం చెప్పండి."
"ఇందిరాపార్కు......"
"మరీ అంత బహిరంగంగానా __"
"అక్కడ కలుసుకుంటున్నది కేవలం తొలిపరిచయం కోసమేగా" క్రింది పెదవి పంటితో నొక్కి ఆలోచిస్తున్నాడు.
"సరే ఇప్పుడు అయిదున్నర కావొస్తుంది.సరిగ్గా మరో అరగంట తర్వాత మాటే అరుగంటలకి మీరు సులభంగా గుర్తుపటేట్టు ఎర్ర చీరకట్టుకుని ఎర్రగూలబి పెట్టుకుని మీకోసం వెయిట్ చేస్తుంటాను ___"
"ఎర్రచీరా ..... ఆ రంగు ప్రమాదానికి గుర్తుగా __"
"ఆ మాత్రం రిస్క్టు తీసుకోకపోతే ఇంతటి అందం మీ సొంతమేలా అవుతుంది."
ఆ క్షణంలో సొంతం __ అంటూ ఆమె ప్రయోగించినమాట వైదేయంలో ఎంతటి సంచాలానాన్ని రేసిందంటే ఓంటిలోని నరాలన్నీ జివ్వుమనిలాగి విచిత్రమైన మట్టులోకి నేట్టేసాయి.
"ఒక వేళమరేవరైనా మీలాగే ఆలంకంరించుకువస్తే __"
"అయ్యో వైధేయ, వస్తే మాత్రం అందరూ నాకింత అందంగా వుంటారని ఎలా అనుకుంటూన్నారు." మంజుల నిక్వాణాల్లాంటి ఒడిపిలో నవ్వింది "పక్కకువచ్చి థర్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్ థర్టీ పోర్ అనండి __ నేను వెంటనే నై౦టీ సిక్స్ అంటాను."
ఆమె కొలతలని కూడితే వచ్చిన మొత్తమది.
"నెంబరు బాగోలేదు"
"ఏం......"
"తొంభై ఆరులో తొమ్మిది ఆరు ఎడమొహం పెడమోహంగా వుంటాయిగా."
"ఆదిలో అలాగే వుంటే అనక కలయికకి గుర్తుగా మీరు ఆరు నేను తొమ్మిది అంటే అరవైతొమ్మిదిగా మరిపోదాం....."
ఆమె నవ్వులో శృతికలుపుతూ "సరే" అంటూంటే "ఒక్క విషయం" అంది .... "మరోమారు అవారపత్రికకి ఫోన్ చేసే అవసరం కల్గించకండి."
"ఏం"
"మీ అడ్రసు అవసరమొచ్చి వారానత్రిక్కి ఫోన్ చేస్తే ఆ ఎడిటర్ గాడు పోనేత్తి మీరెవరు. వైదేయతో పనేంటి అంటూ వెధవ ప్రశ్నల పరంపరతో నన్ను చవగొట్టాడు.... ఇంతకీ ఎవరా ఎడిటరు."
"నేనే"
"అంటే...... ఆమె కంఠంలో గగుర్పాటులాంటిది వినిపించింది. మీరు వైధేయ కాదు."