Previous Page Next Page 
ది రైటర్ పేజి 4

    "వేళాకొళామాడుతున్నారా "నమ్మబుద్ధికాదు వై దేయకీ.
   
    "ఎందుచేత ఆశ్చర్యపోతున్నారు"
   
    "మీలాంటి అమ్మాయి......అందులో ఇంత తెలివీ అందంగల ఓ ఆడపిల్ల జైలుకు వెళ్ళడం....." ఆర్దిక్తిలో ఆగిపోయాడు.
   
    "ఏం..... అందమైన అమ్మాయిలూ మగాళ్ళ కౌగిళ్ళలోనే కాని జైళ్ళలోకి వెళ్ళే అవకాశాలు లేవమంటారా" నిరాసక్తంగా వినిపించిందామె కంఠం.
   
    "అది కాదు రోషిణి? అసలు మీరేం నేరం చేసారు."
   
    "మిమ్మల్నిఆరాధించడం"
   
    ఊహించలేని శరాఘాతమిది......
   
    ముందు ఆమె చెప్పింది తను సరిగ్గా వినలేదేమో అనుకున్నాడు.     కాని అమె మరో మారు మరింత స్పష్టంగా చెప్పింది "నిజం వైదేయా? మీ మూలంగానే నేను జైలుకు వెళ్ళాను.
   
    అతడి పిడికిలి రిసీవర్ చుట్టూ బిగుసుకుంది "జోక్ చేయడమా!"
   
    "లేకపోతె .....అసలు ఇంతవరకూ పరిచయంలేనిమీరు నాకోసం జైలుకెల్లడమేమిటి ....." విభ్రంమంగా అడిగాడు అతడికి నమ్మశక్యంగా లేదు......
   
    "మీరునంమినా నమ్మకపోయినా ఇదినిజంగా నిజం" నిజాయితీగా వినిపించింది.
   
    ఎక్కడినుంచో ఫోన్ చేస్తున్న ఆమె మాటల్ని వైదేయ వెంటనే విశ్వసించలేకపోయాడు కాని ఒకవేళ ఎదురుగా నిలబడి గమనించే అవకాశమే వుంటే ఆమె కనురెప్పల అంచున ఏర్పడ్డ నీటిపొర సులభంగా అతడ్ని నమ్మించ గలిగేది......
   
    "ఆ రోజురాత్రి ఎనుమిదిన్నర కావస్తూంది...." ఆమె చెబుతూంది.
   
    "జ్యూలయెలరీ షాపులన్నీ కట్టేస్తున్నారు. సేట్ చమన్ లాల్ షాప్ కి వంద గజాల్లో దూరంలో ఓ యువకుడు మోటార్ సైకిల్ ని ఆ పేరు అంతవరకూ అతడ్ని పెనవేసుకుని వెనక కూర్చున్న ఒక యువతి బండి దిగి చెప్పినంతా అర్దమైంది కదూ అంటూ  తనబోయ్ ప్రెండ్ కో మారు హెచరించి షాపులికి నడిచింది. సాదారంగా ఆహ్వానించాడు చమల్ లాల్ అయిదూ పదినిముషాలల్లో షాపు ను మూసే ప్రయత్నంలో వున్నడతాను" క్షణం ఆగింది రోషిణి.
   
    మౌనంగా వింటున్న వైదేయ ఏదో గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
   
    "ఎలాంటి మగాడినైనా మంత్ర ముగ్దుడ్ని చేయగల అందం ఆమెది చమన్ లాల్ మానవాతీకుడెం కాదు అమె ఖరీదైన        వజ్రపు టుంగరాన్ని చూపమంటే మొత్తం షాపునే ఆమె ముందు పరిచాడు. అప్పటికి టైము ఎనిమిదీ నలభై అయిదు....ఆ యువతి సీరియస్ గా ఉంగరాన్నిపరిశీలిస్తుంటే ఆస్ట్రియా డైమెండ్స్ తాలూకు గుణగుణాలను గురించి అతడు వివరిస్తున్నాడు సరిగ్గా అప్పుడే మ్రోగింది ఫోన్...... అనుకొనిఅవాంతరం అతడికి, కానీ ఆ యువతి ఆ క్షణంలో ఎదురుచూస్తున్నది. ఆ ఫోన్ కోసమే. ఇదంతా ఆ యువతి  తన బోయ్ ప్రెండ్ టో కలసి ఆడుతున్న నాటకమనిగ్రహించని చమన్ లాల్ కాస్త దూరంలో స్థంభానికి అవలివేపు వున్న ఫోన్ అందుకోవాలని వెళ్ళాడు..... సుమారు ఓ మర్లేవరూ షాపులో లేకపోవడంతో ఆమె తన పధకం ప్రకారం ఖరీదైన ఒక వజ్రపుటుంగరాన్ని తన గుండెలమధ్య దాచి మళ్ళీ అంతే వేగంగా తన దగ్గరున్న ఓ నకిలీ ఉంగరాన్ని దాని స్థానంలో వుంచింది..... ఆ తర్వాత...." కొన్ని సెకండ్లపాటు ఆమె నుంచి ఎటువంటి రెస్పానసూలేదు....." 

    ఈ పాటికే వైదేయ పూర్తిగా వూహించగలిగాడు ఆమె చెబుతున్నదేమిటో.
   
    ఆ తర్వాత మోడల్స్ ఏమీ నచ్చలేదని ఆ యువతి బయటకి వచ్చేసింది. షాపుమూసే హడావుడిలో వున్న చమన్ లాల్ ఆ క్షణంలో ఆ చిన్న మార్చబడిన గమనించకపోవడం అప్పటికి ఆమె అదృష్టం" రోషణి చెప్పింది.
   
    "ఇది నా 'వజ్రాల దొంగ' నవలలోని సంఘటన కదూ" అడిగాడు.
   
    "గూడ్ బాగానే గుర్తుపెట్టారు..... పేజీ నంబరు అరవై ఎడు రేండోపేరాగ్రాఫ్ లో మీరు రాసిన సన్నివేశం...."
   
    "ఇదంతా ఎందుకు చెబుతున్నారు " సాలోచనగా అడిగాడు.
   
    "మట్టిబుర్ర : ఇంకా అర్డంకాలేదా " నేలపై రత్నాలు రువ్వినట్టుగా నవ్వు వినిపించింది.
   
    "యూమీన్" సరిగ్గా అప్పుడు తోచింది వై దేయకి "అంటే..... మీరు అలా దొంగతనం" తడబడ్డాడు అబ్బురంగా.
   
    "యస్ .....ఎగ్జాక్టీలీ ..... అలాగే చేసాను. కాని చిత్రమేమిటంటే ...... మీకధలోని నాయికులా తప్పించుకోలేదు..... దొరికిపోయాను."
   
    "ఏం __ ఎందుకని "
   
    "జీవితం కధ కాదు కాబట్టి"
   
    "ఈ సత్యం మీకు ముందే తెలివుంటే......"
   
    "ఆ దొంగతనం  చేసేటప్పటి థ్రిల్ కాని జైలు జీవితంలోని రిక్రియేషన్ కాని బోధపడేవి కావు"
   
    కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత "అసలు...." సంచాలనాన్ని నిగ్రహించుకుంటూ 'మీరిందాక జ్యూవలరీ షాపు నుంచి దొంగతనం చేసి తప్పించుకు వెళ్ళాలని చెప్పారుగా" అడిగాడు.

 

     అఫ్ కోర్స్ తప్పించుకుని బయటకువెళ్ళి నా పతకం అమలు జరగటానికి సహకరించిన కిరణ్ కి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మోటార్ బైక్ నెక్కాను ఉత్సాహంగా...... కాని.......   

 Previous Page Next Page