ఎదురు చూసిన క్షణం రానేవచ్చింది..... ఇక నిబ్బరాన్ని ప్రదర్శించి ఓ అనాగరిక జంతువులాంటి ప్రాణితో బాంధవ్యం పెంచుకోవడంగానీ, ప్రమాదంలోకి చిక్కుకోవడం గానీ జరిగేది కొన్ని క్షణాలలోనే .....
అవగాహన లేని సన్నివేశంలో అర్ధంకాని పరిమాణల్ని బెరీజు వేసుకుంటూ స్పూర్తి ని ప్రదర్శించడం ఎంత గగుర్పాటును కలిగించే విషయమో ఆ స్థితిలో వున్న వాళ్ళకిగాని అర్ధం కాని విషయం.....
చిన్న బుసలాంటి చప్పుడుతో చేతులు ముడుచుకుని ఎలుగుబంతిల ముందుకు ఒరిగి నడుస్తున్నాడు.
అమె గుండె వేగంగా కొట్టుకూంటూ౦ది.
చందమామలా అందమైన రూపమే కాని జడలు కట్టిన జుట్టు భూతంలా మొహాన్ని కప్పుతుంటే....
నెమ్మదిగా __చాలా నెమ్మదిగా ఎగిసిపడే పిల్లకెరటంలా నడుస్తూ ఆమెకు నాలుగు అడుగుల దూరానికి వచ్చి నిలబడ్డాడు.
ఒంటిపై ఆచ్చాదన లేని మకిలిపట్టిన కంచు విగ్రంహంలా కనిపిస్తూ అది కోపమో, దగ్గరకు రావాలన్న ఉబాలాటమో పెదవుల్ని మృదువుగా తెరిచాడు ముందు.....
పైకి లఘించే మృగం చేస్తున్నా ప్రయత్నంలా అనిపిస్తుంటే.... భీతిగా చేతులతో గుండెల్ని కప్పుకుంది.
అక్కడ గాలి స్తంభించిపోయింది......
ఎంతటి ధైర్యవంతులనైనా అందోళన పరచగల క్షణాలవి.....
"మొ.....వ్వా....."
అడుగు ముందుకేస్తూ అన్నాడు.....
బిగుసుపోతూ తనూ అంది నెమ్మదిగా "మొ...వ్వా"
""మొ....వ్వా...."
బెడ్ అంచుదాకా వచ్చాడు.
ఏదో కమ్యునికేట్ చేస్తున్నాడు...... అర్ధం కావడం లేదు......
వణుకుతున్న చేతులతో నెమ్మదిగా బ్లౌజ్ హుక్స్ లాక్కుంది.....
తల వంచి విభ్రమంగా చూశాడు.....
వెనుకనున్న పాలసీసాల్నీ కనిపించనివ్వలేదామే.......
చైతన్య చెప్పినది యథాతథంగా అమలుచేస్తూ నెమ్మదిగా చేతుల్ని సాచింది.
అరక్షణం నిశ్శబ్దం!
అంతే __ చెంగున పైకి దుమికాడు.....
కెవ్వుమనబోయిన ఆమె కేక గొంతులోనే సమాధికాగా ఊపిరిని బిగపట్టుకుంటూ పళ్ళతో స్థనాలను కోరకబోయిన అతడి నోటికి ట్యూబ్ అంచువున్నపలసీనాఅందేట్టు చేసింది.....
అతడి చేతులు ఆమె చుట్టూ బిగిసుకున్నాయి.
లేగదూడ అవు పొదుగును కుమ్ముకున్నట్టు రొప్పుతూ పాలని పీల్చుకున్నాడు.....
ఆమె కన్నెపిల్లే..... కానీ ఆ క్షణంలో అమ్మగా మారింది.....
భరింపశక్యంకాని దుర్గంధం......
అయినా చైతన్య స్పూర్తితో అ సమయాన అమ్మ మనసుతో ఆలోచిస్తూ అతడ్ని మెత్తగా స్పృశిస్తూంది......
ఆ స్పర్శలోని అనుభూతిని చవిచూడగలిగాడో క్షణం తల పైకెత్తి "మొ.....వ్వా..... అన్నాడు.
మనసు ద్రవించింది......
ఆ పిలిపు ఇప్పుడు భయం కలిగించడం లేదు.......
దేవుడిచ్చినబిడ్డ 'అమ్మా' అని పిలిచినట్టు అర్ధంగా చూసింది.
ఈ సారి కుడిపక్క స్తనం కోసం అవకాశం కలిగించింది.
ఎన్ని యుగాల ఎడబాటో కలవరబరచిన కసుగాయలా పాలను తాగుతున్నాడు....
పెరిగిన గోళ్ళతో ఆమె ఒంటిని స్పృశిస్తూ..... తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.....
ఇదో చిత్రమైన అనుభవం.....
బహుశా ఏ ఆడదీ వూహించనిది......
ఆమె లేబబోయింది..... ఇప్పుదామేభాయపడుతున్నది బాటిల్ లో అయిపోతున్న పాలను గురించి ....
పాలు రాకపోతే పసికందు ఎలా రియాక్ట్ వుతాడో అన్న అందోళన..... లాలనగా వెనక్కీ నేట్టాలనుకుంటూ౦ది..... కాని అవకాశ మివ్వడం లేదు.....
ఆ క్షణంలో బెడ్ రూమ్ కిటికీ దగ్గరకు స్వామి రావడం యాదృచ్చకం కాదు.....
చైతన్య గురించి మాటాడాలనుకుని ద్వారం పకక్నున్న విండోని చేరుకున్నాడు......
ఇంతలో ఈ దృశ్యం కంబడింది......
ముందు కలేమో ఆడుకున్నాడు.
ఒంటిని గిల్లుకుని చూసుకున్నాడు కూడా!
రెండు బాటిల్స్ పాలు కావాలని గుడెంకి తనని పంపడం గుర్తుంది. కాని __ ఇది వూహించని సన్నివేశం.
అక్కడెక్కడో చైతన్య, ఇక్కడ యిలా దీక్ష ఎంత అందోళనకి గురిచేశారూ అంటే...... అసకల్పితంగా అన్నాడు.....
"అమ్మగారూ"
అంతే....
ఓ ధ్యానం భగ్నమైనట్టు గభాలున తల పైకెత్తాడు ఫేరల్ చైల్డ్ __
అదికాదు!
అమె సైతం వూహించినంత వేగంతో పైకి లేచి ఒక్క వూపులో కోతిలాకిటికీ అంచున చేరుకున్నాడు....
గోళ్ళతో స్వామి కళ్ళు పొడిచేవాడే......
గభాలున వెనక్కీ జరిగాడు స్వామి....
మరింత రెచ్చిపోయిన చైల్డ్ అంతే వేగంతో కిటికీ ఆవలికి చేరుకున్నాడు.....
ఎలా చెప్పి అపాలో, ఎలా కమ్యునికేట్ చేయాలో తెలీని దీక్షకి ఇప్పుడేం జరగబోయేదీ వూహా కందడంలేదు.