ఏదో సాధించాలని వచ్చి ఏమీ సాదించలేని స్తితిలోఇప్పటికే చాలా రోజులు గడిపేసాడు......
అదీకాదు....
ఒక జీవిత కాలానికి సరిపడ్డ గాయంలా తనతో నమ్మి వచ్చిన రమాకాంత్ చాలా దారుణంగా కడతేరిపోయాడు......
అదీ తన కళ్ళముందే......
రెండు మేనీటర్స్ ఒకేసారి తిరుగుతున్న వాస్తవం తెలీకనే తను ఆ రోజు రమాకాంత్ ని కోల్పోయినా ..... ఇదిగో .... ఇప్పుడు తాను సిద్ధపడే వచ్చాడు......
నిర్దిష్టమైన నియమాలతో ఆలోచనలతో ఎదుర్కోలేని రెండు క్రూరమృగాల స్థావరంలోకి తనే కోరి వచ్చాడు.
చావు సంజెల నెత్తుటి చారలతో ఇంకోపోయిన స్మృతులు, చిరిగి పోయిన గొంతుల ఆర్తనాదాలలో పెంచుకున్న నిన్న మొన్నటి పాడేరు అడవులలోని అనుచరులు ఇక్కడ పూనారావృత్తం కాకూడదు. గెలుపు కానీ ఓటమి కానీ స్వల్ప కాలంలో నిర్ణయించబడాలి.
అతడి అలోచనలింకా పూర్తికానేలేదు.
దూరంగా ఓ లంగూర్ కేక వినవచ్చింది పులిలాంటి జంతువు కదలిక సూచనగా.
తూర్పుదిక్కు నుంచి మరో కణుసు ఆర్తనాదం.
క్రమంగా అరణ్యంలో స్థబ్ధత చెదిరిపోయింది.
ఆ తర్వాత అయిదు నిమిషాలపాటు భరించశక్యం కాని నిశ్శబ్దం.
ఉన్నట్టుండి రెండు నిమిషంలో మరో పక్క నుంచి వినిపించింది.
నిర్వణ్ణుడైపోయాడు.
ఇప్పుడు మూడో దిక్కు నుంచి.....
వేటలో చాలా అనుభవమున్న చైతన్యకిది భోధపడడంలేదు.
క్రూరమృగాల కంఠ ధ్వనిని అతడు సునాయాసంగా గుర్తించగలడు.
అంతకుమించి మృగాల కదలిక వేగాన్ని అంచనా వేయగడు.
ఇప్పుడు అతడు ఆశ్చర్యపోతున్నది ఒక్క విషయంలోనే.
అరణ్యంలో సంచారిస్తున్నది ఒకటే పులి అయినా సెకండ్ల వ్యవధిలో మూడు దిక్కుల నుంచి అదీ సుమారు కిలోమీటరు దూరంలో వినిపించింది.
పైకి లేచాడు. ఇంతసేపూ తను విన్నది ఒక్క పులి గొంతా! లేక మరికొన్ని పులుసు అరణ్యంలో అడుగు పెట్టాయా తోచడంలేదు.
నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వాయువ్య దిశ కేసిబయలుదేరాడు.
తను ఎలాంటి రిస్క్ తీసుకుంటున్నదీ అలోచించలేదు చైతన్య.
ఇంతకాలం సాహసం ఊపిరిగా చాలా సాదించాడు.
ప్రతి అనుభవాన్ని గెలుపుకి అన్వయించుకోగల చైతన్య ఇక్కడ మరో అర్ధంకానిప్రం,ఆడకరమైన వలయంలో చిక్కుకున్నాడనడానికి ఉదాహరణ ఇప్పటి అతడి పరిస్థిలే.
శవాన్ని దాటి వందగజాల దూరం నడిచిన చైతన్యకిప్పుడు నలుగు దిక్కులా నుంచి పులుల గ్రాండ్రింపులు వినబడుతున్నాయి.
ఎటు పక్క వెళ్ళాల్సిందీ తెలీని సందిగ్ధంతో నిలబడిపోయాడు.
తప్పించుకోవడం సాధ్యం కాదనిపించెంత ఉధృతంగా గర్జనలు ఎక్కువవుతున్నాయి.
అరణ్యం దద్దరిల్లిపోతూంది.
ఇలాంటి అనుభవం చైతన్యకి తొలిసారే
చాలా పదిలంగా వున్న ప్రదేశం నుంచి పొదల మధ్యకి వచ్చి నిలబడ్డ చైతన్య చూడలేదు.
ఓ రెల్లు పొదలో నుంచి అడుగు వేసుకుంటూ మేనీటర్ అతడి వెనుకగా కదులుతూంది.
దూరం నుంచి ఇంకా పులుల గ్రాండ్రింపులు వినిపిస్తూనే వున్నాయి.
వేటాడిడానికి కానీ, వేటాడబడటానికి గానీ మిగిలిన గడుపు పది సెకండ్ల మాత్రమె.
సరిగ్గా అదే సమయంలో ......
ఫారెస్టు రెస్ట్ హేస్ లో ని దీక్ష పడక కిటికీ చెప్పుడై౦దీ.
ఉలిక్కిపడింది దీక్ష .
నిజానికి ఆమె నిద్రపోవడం లేదు. కేవలం చైతన్య అభ్యర్త్దనపైజంతువుల మధ్య పెరుగుతున్న ఫేరల్ చైల్డ్ ఆగమనం కోసం ఎదురు చూస్తూంది.
నిజానీకది నిరీక్షణ కాదు... ఏ ప్రమాదం ముంచుకోస్తుందో తెలియకుండా చీకటి దుర్గమారణ్యం కేసి భయవిహ్వాలంగా చూస్తూ కూర్చున్న యువతిలోని అందోళన.
బడలిక....... థితి....
కొన్నిక్షణాల క్రితం వినిపించిన పులి గాండ్రింపులు ఆమెను ఎంత దారుణంగా కలవరపరిచాయీ అంటే మృత్యుగాహ్వారం లాంటి నిశీధిలో చైతన్య సాగిస్తున్న ఒంటరి పోరాటం ఏ దశకి చేరుకుందో తెలీని సందిగ్ధత.....
చైతన్యది దీక్ష కాదు..... తన నెత్తుటి బోట్లతో చీకటి కోనల్లో జ్యోతిని వెలిగించాలనుకుంటున్న మొండి పట్టుదల...... నిశీధి యుద్ధం.....
గదిలోకి చెంగున దూకిందో ఆకారం.
కట్రాటలా బిగుసుకుపోయాక చూసింది....
బెడ్ లైటు కాంతిలో నిలబడివున్నాడు ఫేరల్ చైల్డ్.... ఆ పసికందు నేత్రాలు మిణుగురుల్లామెరుస్తున్నాయి.