Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 50

    ఆమె చూస్తూనే వుంది.....
   
    నేలపై స్పృహతప్పి పడిపోయిన స్వామి గుండెల్లో గోళ్ళు గుచ్చబోతుంటే ..... తోచని సందిగ్ధతతోఅనేసింది "మొవ్వా"
   
    ఆగిపోయిన ఫేరల్ చైల్డ్ వెనక్కీ చూశాడు.....
   
    వెంటనే మరో ఆదేశం అందించాలి....... ఎలాగో అమెకి తెలీడం లేదు......
   
    చేతులు సాచింది అమ్మంత అప్యాయతతో......
   
    అతడిలో చలనం లేదు......
   
    రెప్పలార్చకుండా చూస్తున్నాడు.......
   
    అప్పుడు వినిపించింది రేస్ హౌస్ సమీపంలో ఓ పులి గాండ్రింపు __-
   
                      *    *    *    *   
   
    చైతన్య స్థానంలో మరో వ్యక్తి వుంటే ఆ గాండ్రింపు తో కర్మేంద్రియాలన్నీ చచ్చుబడిపోయేవే ......
   
    చార్జి చేయడానికి చెరువుగా వచ్చిన పెద్దపులి మొదట చేసేది గాండ్రించడం...... వేటగాడి ఆలోచనాశక్తిని హరింపచేసే ఆ సైట్ సెకండ్స్ పులి అవకశంగా  తీసుకునేది........
   
    పులిని మించిన వేగంతో పక్కకు దొర్లిన చైతన్య దభ్ మన్న చప్పుడు విన్నాడు.... వెనువెంటనే చీకటిలోని ఆకారాన్ని చూస్తూ గుండెలనే తాకిందో ముందు అర్ధం కాలేదు ......
   
    సమీపంలోని పొదల్లో గుండెలార్చెట్టు అలజడి .....
   
    మరుక్షణం నిశ్శబ్దం.....   
   
    ఊపిరి బిగపెట్టి కళ్ళు చిట్లించి చూస్తున్నాడు చైతన్య.....
   
    అతిప్రమడాభూయిష్టమైన  స్తబ్దత అది......
   
    మేనీటర్ గాయపడిందో లేదో తెలీదు.....కానియా చీకటిలో ఎక్కడో పొంచి తన కడలికని గమనిస్తూందని అర్ధమైపోయింది.   
   
    ప్రత్యర్ధి స్థావరంలో వున్న వేటగాడిక, అందులోనూ నెలపై నిలబడి వున్న వ్యక్తి శక్తిని, సహనాన్ని పరీక్షించే క్షణాలు అవే......
   
    జ్ఞానేంద్రయాలకి   గట్టి పని కల్పించి, అడుగులో అడుగు వేసుకుంటూ వెనకకు నడుస్తున్నాడు చైతన్య.
   
    ముందున్న మేనీటర్  తనపై లఘించే అవకాశ మివ్వకుండా సాధ్యమైనంత  గేఫ్ కోసం ప్రయత్నిస్తున్నా డిప్పుడు .
   
    ఆ సమయంలో కూడా  చైతన్య  ఆ చీకటిలోనే మరో చిరుతపులి సంచారిస్తుందన్న విషయాన్ని మరచిపోలేదు.
   
    నిజానికి అసాధరణమైన కన్నింగ్ నేస్ తో వేటగాడ్ని దెబ్బ తీయగల చిరుత కదలికల్ని వూహించడం ఎంతటి  వేటగాడి మేధస్సుకైనా సాధ్యం నిశ్సబ్దంగా నక్కి రెప్పపాటుతో పైకి లఘించి ప్రాణాలు తీయగలదు....
   
    రెల్లు పాదాలవేసే దృష్టిని సారిస్తూ నేలపై రేఖలా పడుతున్న వెన్నెల కిరణాల్ని అనుసరిస్తూ ఓఅరఫర్లాంగు దూరం నడిచి  ఓ మద్ది చెట్టును సమీపించాడో  లేదో......
   
    గుండెలదిరేట్టు గాండ్రింపు వినబడింది.
   
    ఎక్కడో కాదు.... కొన్ని అంగుళాల దూరంలో......
   
    గభాలున వెనక్కి తిరిగాడు......
   
    అది కాదు...... అంత స్వల్పదూరంలో తప్పించుకోవడం సాధ్యం కాదని తెలిసిన మొండితనంతో ముఖాముఖీ పోరాటానికే సిద్ధపడ్డాడు....
   
    సందర్భోచితమైన  అలాంటి తెగునే అతను ప్రదర్శించనివాడు చైతన్య కధ ఇప్పుడు కాదు పాడేరు లోనే ముగిసిపోయేది.
   
    చిత్రం.... సమీపంలో మేనీటర్ జాడలేదు.....
   
     కాని మరోమారు పులి గాండ్రించిన శబ్దం.....
   
    ఈసారి అది ముందు చెట్టుతోరల్లో వినిపించి వెనువెంటనే చెట్టు కొమ్మలదాకా ప్రాకింది.
   
    అంతే __ అప్రతిభడయ్యాడు.....
   
    ఇంతసేపూ నిజంగా వినిపించింది పులి గాండ్రింపే అయినా అది పులి నుంచిగాక తీగకు వెళ్ళాడుతున్న టేప్ రికార్డ్ ర్ లో నుంచి అన్నది బోధపడింది. కొమ్మల్లో ఓ ఆకారం కదిలింది.....
   
    కేవలం రెండు మేనీటర్స్  మాత్రమే తిరుగుతున్నా దుర్గమారణ్యంలో అన్నిదిక్కులనుంచి ఒకేసారి వినిపించిన పులుల గాండ్రింపులకి అప్పటికి అర్ధం తెలిసిన చైతన్య ప్రత్యర్ధలేవరన్నా కనీ వారి తెగువని, తెలివినీ అభినందించకుండా వుండలేకపోయాడు.
   
    అతను తేరుకునేలోగానే చేట్టుపైనుంచి క్రిందకి దూకిన ఆకారం వేగంగా దక్షణంవేపు పరుగైత్తింది.
   
    వ్యవధి లేదు..... ఇన్ని రోజుల తర్వాత ప్రత్యర్ధుల ఉనికి తెలుసుకోగలిగే ఒకేఒక్క అవకాశం.....
   
    ఇప్పుడు చైతన్య ఏ మూలనో నక్కిన మేనీటర్ గురించి ఆలోచించలేదు.......

    మేనీటర్ ఉనికిని అవకాశంగా వాడుకుని తనను మానసికంగా బలహీనుడ్ని చేయాబోయిన ఆ వ్యక్తిని అదుపు చేయలనుకున్నాడు.
   
    కసి.....క్రోధం.......
   
    వెంటబడ్డాడు.......
   
    పొదల మధ్యగా గోర్జిలా నుంచి గజాలు దూసుకుపోయాడో లేదో పదిగజాల దూరంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే విస్పోటం ......
   
    అడవి గర్జించినట్లు పేలిన హేండ్  గ్రెనేడ్ ......
   
    కళ్ళు భైర్లు కమ్మగా అయిదడుగులు వెనక్కి తూలిన చైతన్య చేష్టలుదిగినట్టు వుండిపోయాడు.
   
    చాలా పటిష్టమైన ఏర్పాట్లుతో తనపై దాడి జరుగుతున్నది.
   
    ఎంత సాహసంగలవాడైనా పొరపోయేదక్కడే......... కానీ చైతన్యలో మొండితనం ఉద్రుతమై పోయిందిఈ సంఘటన తర్వాతనే......
   
    "బాస్టర్స్ "
   
    రిట్టార్టయిన రైఫిల్లా  రెండడుగుల వెనక్కివేసి ప్రత్యర్ధి వూహించని వేగంతో వెనక్కిమరలి మిస్సైల్లా రెల్లుపొదల్లోకి దూసుకుపోయిన చైతన్య కేవలం రెండు నిముషాల వ్యవధిలో వృత్తంలాంటి మార్గంలోకి పరుగెత్తి ప్రత్యర్ధిని అభిముఖంగా వచ్చాడు.......

 Previous Page Next Page