ఎలాంటి మొండితనాన్ని ప్రదర్శించే గిరిజనుడి నుంచైనా వాస్తవాన్ని రాబట్టగలచైతన్య ఇక్కడ తన ప్రయత్నాన్ని మిరమించుకున్నదిమృత్యురాజుని చూశాక....
తను అనుమానిస్తున్నట్టుఅక్కడ ఎవరికీ అనుమానం రాకూడదు ముఖ్యంగా మృత్యురాజుకి.....
"సరే......" చుట్టూ చూసాడు... కుడిప్రక్క ఒత్తుగా పెరిగిన మద్దిచెట్లు శవం వున్నపోదకి వందడుగుల దూరంలో దేవదారు వృక్షాలు వున్న గుట్టపై వున్న పెద్దబడరాయిపక్కనే మాటువేయాలనుకున్నాడు..... వీపుని బండరాయికి ఆనించి దిగువుగా వున్న శవాన్ని చూస్తూ శవంకోసంవచ్చే పులి రాకని పసిగట్టుట సమంజస మనిపించడంతో మంచే ఏర్పాటు అక్కర్లేదనుకున్నాడు "శవాన్ని ఎవరూ తాకకండి ..... రేపటిదాకాఇక్కడే వుంచాలి......"
ఓ ఆదేశంలా అనిపించడంతో జోక్యం చేసుకుబోయిన మృత్యురాజు తక్కిన గిరిజనులతో నిశ్సబ్దంగా వెళ్ళిపోయాడు.
క్రమంగా ఎండ తీవ్రమవుతుంటే నిలబడి పరిసరాలనే చూస్తున్నాడు చైతన్య ఇలాంటి చావుని చూడడం తొలిసారి కావడంతో పీలిక లైన కళేబరాన్ని గమనిస్తూనే కంపించిపోయింది స్వామిజితో పాటు అప్పుడే అక్కడికి వచ్చిన దీక్ష ."ఇట్స్ హారిబుల్."
తల తిప్పుకుంది వాంతయ్యేటట్టు అనిపించడంతో......
అది బాధో, తన నిర్లక్షమే మరో మరణానికి దారితీయడానికి కారణమన్న ఆలోచనో__ స్వగతంలా అన్నాడు __ "నిజానికి నేను ఈ అరణ్యంలో అడుగు పెట్టింది ఇలాంటి మరణాలను అపదానికే అయినా అడుగడుగునా ఎదుర్కొంటున్న విచిత్ర పరిస్థితులు, సంఘటనలు నా దృష్టిని మళ్ళించాయి దీక్షా ..... రమాకాంత్ చావు తర్వాతైనా నేను మరింత జాగ్రత్తపడాల్సిందేమో....ఇట్స్ మి..... అయాం ది రియల్ కల్ ప్రిట్ లేకపోతే ఇది జరిగేది కాదు...."
విచిత్రంగా చూసింది అతన్ని....
మొత్తం తనపైకే నెట్టుకుంటూ చాలా కలవరపడిపోతున్నాడు.......
జరిగిన ప్రతి సంఘటనకీ మరో వ్యక్తినో, ఇంకో కారణాన్నో వెదికే వ్యక్తులనే చూసిన. అమె ఇక్కడ అంతటికీ తనే కారణమన్న ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని దర్శినమిస్తూంది......
"పాసాస్ ది బుక్' బ్యూరో క్రసీ గురించి మాత్రమె తెలిసిన దీక్ష కర్తవ్యాన్ని మనసుకు తీసుకుని మధనపడుతున్న మరో వ్యక్తిని చూడగలుగుతూంది.
"వైడూ యూ టేక్ సో సీరియస్" అంది అతడ్ని పరిశీలనగా చూస్తూ...
"గిరిజనుల ప్రణాలైనా కాని పోయాక తిరిగి రావనే దీక్షా.... ఇక్కడున్న సమస్యల్ని చేధించడానికి నా శక్తి చాలదని అనిపిస్తున్నా, ఈ క్షణం నుంచి వున్న శక్తిస్వయంగా ఖర్చుచేయాలనుకుంటున్నాను"
నొచ్చుకుంటున్నట్టు మాట్లాడుతున్నా చైతన్య కళ్ళలో ఎరుపు జీరలు...
అపద్రుశ్యమైన పోరాటానికి ఆయత్తమవుతున్నట్టుఒక మరణంతో రగిలిన నిప్పురవ్వ అతి స్వల్పకారంలో జ్వాలగా మారినట్టు మాటాడుతున్నాడు.
"మిస్ దీక్షా..... ఈ దుర్గమారణ్యంలో ఇంకా ఎన్నెన్నో సమస్యలు మరిన్ని విపత్కర పరిస్థితులు నిక్షిప్తంగా దాగివున్న యిప్పుడు నేను వెంటనే ఎదుర్కోవాల్సింది నా ప్రియమైన ప్రత్యర్దిల్నీ ...... ఈ మరణాలకి కారణ మవుతున్న మేనీటర్స్ ఈ సమీప అరణ్యంలో నక్కి వుండొచ్చు. లేదా నన్నుగాని, నాలాంటి మరో మనిషిని గాని వేటాడే ప్రయత్నంలో మరెక్కడో సంచరిస్తూ వుండొచ్చు వాటి విషయం తెల్చేదాకా సమాధిలాంటి ధ్యానంలోకి జారిపోతున్న నన్ను అపార్ధం చేసుకోరని నమ్ముతున్నాను.
మీరు వెంటనే రెస్ట్ హౌస్కి వెళ్ళిపొండి"
ప్రత్యర్ధిని ఉనికిని తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఒంటరిగా అరణ్యంలోకి నడవడం మొదలుపెట్టాడు.
ఈ దేశం గర్వించదగ్గగోప్పవేతగాడిగా చైతన్య కెందుకింత కీర్తి లభించిదో దీక్ష తెలుసుకాగలిగిన తొలి క్షణమిది.....
ఆకాశంలో సూర్యుడి వేడిమి రగిలిన ఓ యజ్ఞానికి సంకేతంలా అనిపిస్తూంది.
* * * *
"నో..."
అడవి పోలిమేరలకి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో మరో యజ్ఞం ప్రారంభమైనట్టు మండుతున్న శులభంలా పరుగేడుతుంది విజయ.
అర్ద నగ్నంగా ఉన్న ఓ యువకుడు అమె శరీరంపై ఆచ్చాదన తొలగించాలని ప్రయత్నిస్తున్నాడు.
అయినా నిస్రాణగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందామె..... రోజుల తరబడి నిస్సత్తువతో ఆమె చాలా శుష్కించిపోయింది. అయినా అమె అకర్షణ తగ్గలేదు.....
కళ్ళకింద నల్లని చారలు ఏర్పడ్డాయి తప్ప కళ్ళలో యింకా క్షీణించని కాంతి.....
అరెకరం నేల చదును చేయబడిన ప్రాంతమిది....
చుట్టూ సాయుధలైన వ్యక్తులు.......
మధ్య గోదాలో పైనబడుతున్న వ్యక్ల్తినుంచి తప్పించుకోవడానికి లేడిలా విఫల ప్రయత్నం చేస్తూంది..,..
గొంతు పిడచకట్టుపోతుంటే నేలపై వెల్లకిలా జారిపడింది. నాలికతో పెదవుల్ని తడుపుకోవడం చూసిన ఓ గిరిజన యువతి ఆమెకు గ్లాసుతో నీళ్ళు పట్టింది.
ఆ నీళ్ళతో డ్రగ్ కలవరపడిందని అమెకి తెలీదు.....
తాగింది దాహం తీరేదాకా .......
అర నిమషంలోనే కళ్ళు భారంగా వాలిపోయాయి......
ఏదో జరుగుతూందని అర్దమైనా అమె దాహంతో పైకి చేరుతున్న వ్యక్తిని చూస్తూ మరోమారు తప్పించుకోబోయింది.