"బట్ హే..... "
అది పరిశోధించి తెలుసుకోవలసిన సత్యం దీక్షాదేవీ.... ఇక్కడకి మనం ఎందుకోచ్చినా కాకతాళీకంగా ఆ చెల్ద్ మిమ్మల్ని కలుసుకున్నాడు.... ఇక్కడితో ఆగిపోదు.... అలవాటుపడిన పెట్యాని మల్ ళ మీ దగ్గరకి వస్తూనే వుంటాడు..... సో....తెలివిగా బంధించాగలగాలి......"
"నో....ఐకాంట్ టాలరే టిట్....."
"దీక్షా...."
అది అర్ధింపూ కాదు, శాసింపూ కాదూ కాని అతడి పిలుపు ఆమె గుండె లోతుల్లోకి చొచ్చుకుపోయింది.
"ఏ తల్లి పొత్తిళ్ళ నుంచి జారిపోయాడో, ఏ అమ్మ విదిలించు కున్న స్వప్నంలా ఈ అరణ్యంలో అడుగు పెట్టాడో! తెలీని మృగంలాంటి వాడు కావచ్చు! కాని ఇంకా అమ్మ లాలన కోసం అంగలర్చుకు పోతున్నాడని ఈపాటికే మీకు అర్ధమై వుండాలి. మీరుఅనుమతించకతప్పదూ అని నేను బలవంతం చేయడంలేదు.... అమ్మమనసుతో ఆలోచించమంటున్నాను..... అదుపుచేసి చరిత్రకోసం కాకపోయినా ఆ పసికందుకూ మరో జీవితాన్ని అందించే ప్రయత్నంలోనైనా నాకు సహకరించమంటున్నాను.
వెళ్ళిపోయాడు చైతన్య.
* * * *
ఆ రాత్రి ఇక ఆమెకు నిద్ర పట్టలేదు.
తెలతెలవారుతుండగా స్నానం చేసిన దీక్ష చైతన్య బెడ్ రూమ్ లోకి అడుగు పెట్టింది. (అనుమతి లేకుండా రావద్దని ముందురోజు తనే కట్టడి చేసింది కాబట్టి)
అక్కడ చైతన్య లేడు....
బాత్ రూమ్ లో షవర్ చప్పుడు.....
నిన్న తన బెడ్ రూమ్ లో సన్నివేశం పునరావృత్తం కాబోతుందని బిడియంగా వెనుదిరిగబోతూ ఆగిపోయింది.
ఓ మూల టేబుల్ పై గాలికి కదాలాడుతున్న చైతన్య డైరీ పేజీలు....
సభ్యత కాదని తెలిసినా ఆ వాక్యం చదవకుండా వుండలేకపోయింది.
"ఎవరు నువ్వు.....
చీకటి కంఠానికి ఉరిగా మారాలని వచ్చిన వెండి దరానివా
లేక చంద్రకాంత శిలలే కరిగి నిశిరాత్రిగా మారిన
నిశ్శబ్ద కిన్నెరావా
పగటికి చేతి పేర్చిన నువ్వునే రాయలేని కవితవై
కనిపిస్తావెందుకని
సుషుసిక్తికి స్వప్నానికి నడుమ సన్నని దీక్షవై
వినిపిస్తావెందుకని......"
తన గురించేకదూ.....
దీక్ష చెంపలు అరుణిమను పుంజుకున్నాయి.....
ఇప్పుడిప్పుడే మనసులో అస్పష్టంగా రూపుదిద్దుకుంటున్న భావానికి అతడిచ్చిన అక్షరరూపాలు....
వ్యక్తంచేయని, చేసే అవకాశం లేని కొన్ని అలోచనలు ఒక జీవిత కాలానికి సరిపడే వేదనకి ఎలా కారణం కగాలిగేది అర్ధంకాని దీక్ష అమాయకంగానైనా పోరాబాటు పడిందిక్కడే!
ఇంకా ఆ గదిలోనే నిలబడి ఆ వ్క్య్లని మళ్ళీ మళ్ళీ చదివి పరవశంతో ఎన్ని క్షణాలు గడిపేదో....
అదిగో అప్పుడు వినిపించింది బయట అడుగుల చప్పుడు.
రెండు అంగల్లోద్వారాన్ని చేరుకుంది.
ఉదయం సూర్యుడివెలుగులో గుంపులుగా తరలివచ్చిన గిరిజనుల కాంపౌండ్ వాల్ దగ్గర నిలబడి వున్నారు.
అందులోని కొందరు గుక్క తిప్పుకోకుండా చెబుతున్నారు.
"పెద్దపులి మళ్ళీ గూడెంలోకి ఓ ఆడపిల్లని పొట్టన పెట్టకుందయ్యా..... శవాన్ని ముక్కలు సేసి గుట్టదుగువున...."
ఎప్పుడు విన్నదావుమారి...
చైతన్య వెంటనే బయలుదేరాడు చేతిలో రైఫిల్ తో ......
గోర్జులు, వంకలూ దాటి దక్షణాన వున్న విప్పితోటకితూర్పున వున్న వెదురు పాదాల్ని అధిగమించి గుట్టని చేరుకున్నాడు.
అక్కడ.....
ఓ రెల్లుపోడమాటునపీలికలై వుంది పద్దెనిమిదేళ్ళు యువతి కళేబరం.... నేలపై పగ్ మార్క్స్ బట్టి గుర్తించాడు చంపింది పులిగా...
గుండెలు నుంచి పోత్తడ్కా చీరేయబడిన ఆ స్థితిని చూస్తూ అనుమానంగా అడిగాడు......
"ఈ అమ్మాయికి చెందిన వాళ్ళేవరన్నా వున్నారా."
నీళ్ళు నిండిన కళ్ళతో ఓ వృద్ధుడు ముందుకొచ్చాడు.
"ఏమవుతుంది నీకు."
"నా బిట్టేనయ్యా ."
మరణించిన యువతి మామూలుగా లేదు..... బాగా అలకకరించబడి వుంది....
గిరిజనులకు పెళ్ళిలో తప్ప ముస్తాబు చెయ్యరు. "ఎలా జరిగింది" చెప్పు లేదా వృద్ధుడు.
"పులీ గూడెంలో అడుగు పెట్టిందా."
జవాబు లేదు.
"చెప్పు"
ఇక నిభాయించుకోలేనట్టు అన్నాడు వృద్ధుడు "లేదయ్యా... నా బిడ్డే అడవిలోకి వచ్చింది."
అప్రతిభూడయ్యాడు చైతన్య.... ఎందుకని ..... అర్దరాత్రిని ఇంతగా అలకరించుకుని అడవిలోకి ఎందుకు వచ్చినట్టు?
చెప్పేవాడేమో__ అప్పుడే అక్కడకు చేరిన గూడెం పెద్ద మృత్యురాజుని చూస్తూ ఆగిపోయాడు.