మరో ఆక్రందన.
బోధపడి పోయింది. వినిపించింది రెస్ట్ హౌస్ నుంచుని.
ఆమెకు చెప్పకుండా, దీక్షా రక్షణ విషయం అలోచించకుండా అర్దరాత్రి ర్వడం పొరపాటే గ్రహించిన చైతన్య ఆగలేదు.
మిస్సైలా దూసుకు పోతున్నప్పుడు.
కేవలం రెండు నిముషాల వ్యవధిలో రెస్ట్ హౌస్ ని చేరుకున్న చైతన్య గగుర్పాటుగా ఆగిపోయాడు అక్కడిద్రుష్యాన్ని చూసి...
భూతాలుగా మారిన చీకటిలా రెస్ట్ హౌస్ అవరణంలో అయిదారు ఎలుగుబంట్లు నిలబడి వున్నాయి.
అన్నీ ఒకేమారు ఎందుకు తిరుగుతున్నదీ అర్దంకాలేదు......
రెచ్చిపొతే వాటిని ఎదుర్కోవటం సామాన్యం కాదు.....
దీక్ష బెడ్ రూమ్ లో లైటు వెలుగుతోంది తప్ప ఇప్పుడు ఎలాంటి అలికిడీ లేదు.
మనసేదో కీడు శంకిస్తుంటే తుఫాకీని గాలోలోకి పేల్చి వేగంగా ద్వారంలో నుంచి లోపలికి దూసుకుపోయాడు....
వెనక్కీ చూసిన చైతన్యకి అడవిలోకి పరిగెడుతున్న ఎలుగుబంట్లు కనిపించాయి....
వెనువెంటనే దీక్ష గదిలోకి అడుగుపెడుతూ అవాక్కయిపోయాడు.....
ఆరేడేళ్ళుదాటని పసిపిల్లడిలాంటి ఆకారం నేలపై వేల్లకిల్లా పడివున్న దీక్షని చూస్తూ నిలబడి వున్నాడు....
చైతన్య అడుగుల చప్పుడు వినగానే ప్రమదాన్ని పసిగట్టినట్టు ఒక్క అంగలో కిటికీ అంచుపైకి దూకాడు....
అక్కడి నుంచి గోడపైకి.....
ఓ కోతిపిల్లలా చప్పుడు చేస్తూ చీకటిలో అంతర్దానమైపోయాడు.
"మొ..... వ్వా"
ఓ పక్షి అర్తనదంలా వినిపించింది అడవిలో నుంచి......
కొన్ని రాత్రులుగా వినబడే ఆ కేకకి అప్పటికి అర్ధం తెలిసినచైతన్య అప్పుడు చూశాడు. అచ్చానలేని దీక్ష గుండెల వేపు.....
వెంటనే తల తిప్పుకుని ఆమె పైకి ఓ టవల్ విసిరాడు.
ఆమె లేచింది కంపించుపోతూ..... ఎంత ధైత్యమున్న పోలీసాఫీసరైనా స్వతహాగా ఆడపిల్లయినందుకేమో ఆమె బెదురు కళ్ళ నుంచి నీళ్ళు ధారకడుతున్నాయి .
జాలనిపించిందేమో చీకటిలోని చూస్తూ అన్నాడు.
"భయపడాల్సిన పని లేదు మిస్ దీక్షా.... ఎంతసేపు మిమ్మల్నీ కంగారు పెట్టింది జంతువు కాదు."
నిర్వీణ్ణురాలై చూసింది "మరి"
"ఫైరల్ చైల్డ్"
ఉలికి పడిందామె.....గాలి స్థంబించిపోయింది.
నిద్రపోతున్న తన బ్లౌజ్ హుక్స్ పీకితను వారించబోతుండగానే దాని పాలకోసం పెదవులతో స్థనాలను పీల్చింది జంతువులు పెంచిన పసివాడు..... నమ్మలేక పోయింది...... అంతకుమించి జుగుప్పతో కంపించి పోయింది.
"కాని...పెరల్ చైల్దని మీరెలా అనుకుంటూన్నారు."
"ఇక్కడో పసిపిల్లాడి రూపంలో భూతం తిరుగుతున్నట్టు ఫారెస్ట్ రికార్డ్స్ లో మెన్షన్ చేయబడింది" ఇందాక కొన్ని క్షణాలపాటైనా తన ముండుకదలిన ఆ రూపాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. నాగిరికుల ఊహాకందని అరణ్యవాసాల గురించి చూసి చదివి అనుభవం ద్వారా తెలుసుకొని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏర్పరుచుకున్న వ్యక్తిగా అన్నాడు... "ఈ విషయంలో నేను పొరపాటు పడుతున్నాననుకోవడం లేదు మిస్ దీక్షా.... దుర్గమారణ్యంలలోని బాధితుల గురించి, బాధాకరమైన జీవితాల గురించి చాలావరకు తెలుసుకోవాడానికి ఇది చిత్రమైన అనుభవమే కాని వాస్తవమే.
అనంతందాకా విస్తరించిన చీకటిలోని చూస్తూ అన్నాడు.... నాగరిక వ్యవస్థ నమ్మినా నమ్మకపోయినా తోడేళ్ళు కాని, ఎలుగుబంట్లు కాని అరణ్యంలో మనిషి పెంచడం కొత్తకాదు.... పాట చరిత్రే రోము నగరాన్ని కనుగొన్న రోములాస్ రేమాస్ లని తోడేలు పాలిచ్చి పెంచిందన్నది ఒక చరిత్రయితే క్రీస్తుశకం 1661లో విదులేని యస్ అడవుల్లో ఎలుగుబంట్లు మనవాకారంలో వున్న ఇద్దరు పిల్లని పెంచడం చూసి ఆరోగ్యంగా వున్న ఓ పసివాడ్ని వార్సాకి తీసుకొచ్చారు. 1920 లో మన దేశంలోకి బెంగాలు అడవుల్లో తోడేళ్ళు పెంచి పెద్ద చేసిన ఇద్దరు అమ్మాయిల్ని నగరానికి తీసుకొచ్చి తమ దంపతులు పోషించినట్టు రేవరెన్స్ జేసింగ్ 'ఉల్స్' అండ్ ఫైరల్ మెన్ ' గ్రంధంలో స్పష్టం చేశాడు. 1940 లో తోడేళ్ళు వంచిన ఓ యువతి క్రూరమృగంలా ప్రవర్తిస్తూ మేనీటర్ లాగే మనుషులపై పడి చంపి తినేయడం మాత్రమే కాక అసాధారణమైన సంచలనం సృష్టించనిమజీద్ ఖాన్ అనబడే ఓ వేటగాడి మూలంగా ప్రాణాలు కోల్పోయింది . 1972 వ సంవత్సరంలో లక్నో దగ్గర నారాయణపురం గ్రామానికి చెందిన నరసింగ్ తోడేళ్ళు పెంచుతున్న పిల్లవాడ్ని అడవి నుంచి బంధించి తీసుకొచ్చాడు. 'షిమోడియా' అని పేరు పేట్టి చాల రోజుల పెంచాడు కూడా. ఆరేడేళ్ళు వయస్సులోనే ఎంత బలాన్ని ప్రదర్శించే వాడంటే అతడ్ని గొలుసులతో బంధించి వుండాల్సి వచ్చేది.... సో...." క్షణం ఆగాడు. "యాదృచ్చకంగా అలాంటి పసివాడ్నేమీరు కలసుకోగలిగారు......"
అప్పటికే ఆమె శరీరం స్వేదంతో తడ్సిపోయింది.
"కలుసుకోవడం కాదు చైతన్యా...... ఏం చేసిందీ మీరు ఊహించలేరు..... పాలకోసం..." బిడియంగా వున్నా టెలిగ్రాఫిక్ కోడ్ లా జరిగింది చెప్పేసింది "పైకి నెడుతున్నా అస్సలు పట్టు విడవనిదె....."
"అపార్ధం చేసుకోకండి దీక్షా దేవీ.... కన్నెపిల్లలికి పాలురావని, లేక్టేషన్ అన్నది ప్రసవం అయ్యాకనే సాధ్యమని తెలీనివాడు కాబట్టి అలా హడావిడి చేసి వుంటాడు....కాని ఇక్కడ మరో విషయం మ్నాకు అర్ధమవుతూంది."
నిశ్సబ్దంగా వింటూందామె.
స్థన్యం గురించి అవగాహన గల చైల్డ్ అంటే బహుశా అమ్మ గురించి, అమ్మ పాల గురించి తర్వాతనే ఈ పసికందు తల్లికి దూరమయ్యంటాడు....."