"అంటే.... మీరు కావాలని మీ బెడ్ రూమ్ కి కాకా బెడ్ ని వాడు కుంటున్నా నేను అంగీకరించాలా...."
"బెడ్ దాకా అయితే అంగీకరించక తప్పదు"
ఏదో శ్లేష ధ్వనించడంతో రోషంగా చూసింది.
"యూ సీ మిస్ దీక్షా ... మీరేదో హిప్నటైజ్ అవుతున్నట్టు వున్నారు."
ఈ సారి నిజంగానే అందోళన పడిపోయింది. అతడు అలా చదివేయడంటో "ఎందుకిలా అనిపించింది"
"అడవుల్లోక్రూరమృగాలమధ్యాకూడాఓ కమ్యునికేషన్స్ సిస్టం వుంటుంది."
ఆమె జవాబు చెప్పలేదు.
"మగ పులి తను దూరంగా వెళుతూ అల్లదక్కడా బండరాళ్ళపై మూత్ర విసర్జన చేస్తూ వుంటుంది. ఏమ్డుకావుతెలుసా..."
"తెలీదు"
"తన వునికి అడ పులికి తెలియచెప్పాలని... అలా ఘ్రాణనాడులకి పని కల్పించి అడపులిని తన దగ్గరక్లు రప్పించుకుంటుంది."
"ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు" సీరియస్ గా అంది.
"అలాంటి కమ్యునికేషన్స్ నేనింతకాలం టాయిలెట్ ని వాడలేదని తెలియచెప్పడానికి..."
అతడి మాటలు అనుకొనిచోట తగిలాయి.
నేను మీ వెంట పడుతున్నారా అంటూ కలియబడేదే.
"మిస్ దీక్షా....సభ్యతగా తప్పమతాడటం చేతగాని నేను ఏడాది క్రితం మీ పరిచయంలో తెలుసుకున్న దొక్కటే. మీ వేగాన్ని నిరిధించాలీ అంటే మీరు భయపడే మీ అడతాన్నాన్ని రెచ్చ గోడుతూ అల్లరి చేయడం యస్.... అలాగే ఇంతకాలం మీ దాడి నుంచి తప్పించుకున్నాను "
క్షణం ఆగాడు.
"ఇకపోతే మరో విషయం. మీరునా అతిధి మాత్రమె కాడుఒకర్తవ్యంకోసంనాలాగే అడుగు పెట్టిన ఆఫీసరుకూడా కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు కోరితే సహకరిస్తాను. అంతేకాని అంతట నేనుగా మీబాతురూమ్ లోకి గాని,బెడ్ రూమ్ లోకి ఇకాడుగు పెట్టాను."
సీరియస్ గా వాదించి తనకు తోచిన బాషలో ఈ అపార్దాన్ని తొలగించేదే కాని అంతలోనే చైతన్య బయటకు నడవడంటోపాటు స్వామి లోపలి చొచ్చుకొచ్చాడు.
అంతే......
స్వామి ద్రుష్టిలో కుచించుకుపోవడం ఇష్టంలేనట్టు తల విదిలించుకుంది నిర్లక్ష్యంగా.
"స్వామీ....ఇకనుంచి భోజనం కమాన్ డైనింగ్ హల్లోగాక నా గదిలోకి తీసుకోచ్చేయ్"
"అయ్యగారిది కూడానా మేడమ్......" ఇద్దరూ అంతసేపూ చర్చలో ఓ అండర్ స్టేడింగ్ కి వచ్చేసారేమో అనుకున్నాడు. "సరే"
"అగు" ఆమె అంది." "నా ఒక్కదాని భోజనమే ...."
గదిలోని విధ్యుద్దీపపు కాంతిలో స్వామికి ఇప్పుడు దీక్ష అందంగానే కాకచాలా పొగరున్న పోలీస్ ఆఫీసర్ గా కూడా కనిపించింది.
* * * *
అర్దరాత్రి .....
అరణ్యం నిశ్సబ్దంగా వుంది.
మసక వెన్నెల చీకటి గుట్టల్లాంటిగుబురు చెట్లలో చిక్కి అదృశ్యమవుతూంది.
పుట్టల్లోని పాము బుసల్లా గాలి మంద్రంగా వీస్తూంది.
నడుస్తున్నాడు చైతన్యా ఒంటరిగా.
అప్పటికే రెస్ట్ హౌస్ నుంచి ఫర్లాంగు దూరందాకా నడిచాడు.
ఒంటరిగా మేనీటర్స్ తిరిగే అడవుల్లో సంచరించడానికి వెనుకడాని చైతన్య ఇప్పుడు గంజాయి తోటల సమీపంలో మనుష్యుల కోసం మాటుయాలనుకుంటున్నాడు.
ఇది ప్రమాదభూయిష్టమైనదని తెలుసు.
కాని ఒక్క వ్యక్తినైనా నిర్భందిచాలి.
చాలా ప్రశ్నలకి జవాబు దొరకాలీ అంటే అదృశ్యంగా వున్న వలలోని ఒక్క తీగానైనా చేజిక్కించుకోవాలి
గోర్జిని దాటి చీలిన కొండవేపు మలుపు తిరుగుతుండగా వినిపించింది చిన్న చప్పుడు....
ఆగదు చేతిలోని రైఫిల్ కాస్త పైకెత్తి.
మరోసారి ఘల్లుమన్న శబ్దం.
చెవులు రిక్కించాడు.
ఆ చప్పుడు దక్షణ దిశగా వినవస్తూంది.
ఒక నిశ్శబ్దపు చీకటి రాత్రి ఎందరి మరణాలకో అలవాటైన దుర్గ మరాణ్యంలో అలాంటి శబ్దాలు ఎంత గగుర్పాటుని కలిగించేదీ ఆ స్థితిలో వున్న వాళ్ళకి తప్ప అర్ధం కానిది.
ఓ దేవదారు చెట్టుకి అనుకుని నిలబడ్డాడు.
నైట్ విజన్ బైనక్యూలర్ ద్వారా చుట్టూ పరికించాడు.
ముందు ఏమీ కనిపించలేదు.
మరుస్ఖనం దక్షణ దిక్కున పొదల నడుమ ఓ యువతి....
అమెకేవళం నిశిరాత్రిలో మాత్రమె కనిపించే ఆ యువతే....
చూస్తుండగానే ఒంటిపై వున్న ప్వదని, బ్లౌజ్ ని తీసి పొదలపై విసిరింది.
మరుక్షణం జలపాతంలోకి అడుగుపెట్టి సుమసుమ్దరవసంత గీతంలా నగ్న దేహాన్ని తడిపి ఆ నిర్దన ప్రదేశాన మెరిసే హిమసుందర కిరీటంలా ఒడ్డుకు చేరి వేల్లకిల్ల పడుకుంది.
మామూలు ఉత్సుకతే బయలుదేరిన పని మరచిపోయాడు.
రెండు ఫర్లాంగుల దూరంలో వున్న ఆమె అసాధారణ సౌ౦దర్యం అతడ్ని ఎప్పటిలానే ట్రాన్స్ లోకి నెడుతుంటే నెమ్మదిగా కదిలాడు.
వంద అడుగుల నడిచాడతను.
అరణ్యం దద్దరిల్లింది ఓ అర్తనాదంతో.