ఆమె తల వంచుకుని నడుస్తూంది.
అడవి మనిషినుకున్నవాడు. ఎంత అందంగా మాటాడగలడో కూడా అర్ధమైపొయిందామేకి.
ఇద్దరికీ తెలీదు.
పొదల్లోనుంచి ఓ గిరిజనుడు ఇద్దరినీ పరిశీలనగా చూస్తున్నాడు.
ఎవరికంటా పడలేదనుకున్న ఇద్దరూ ప్రత్యర్ధుల దృష్టిలో పడిపోయారనడానికి సాక్ష్యం అదే.
* * * *
అసుర సంధ్యవేళ......
దుర్గమారణ్యంలోని రెండు మేనీటర్స్ మనిషి రక్తంకోసం అంగలార్చుకుపోతూ సంచరిస్తున్న సమయంలో.....
మరెక్కడోచైతన్య, దీక్షలగురించి ప్రత్యర్ధులు పటిష్టంగా పధకం వేస్తున్న తరుణాన....
రెస్ట్ హౌస్ టబ్ లో స్నానంచేస్తున్నా దీక్ష......
నీళ్ళు చల్లగా వున్నా నగ్నంగా వున్న ఆమె గుండెలపై కదులుతూ చిలిపిగా అల్లరి చేస్తున్నాయి.
ఎత్తయిన స్థనాల్నిచూస్తుంటే 'గంతలు విప్పిన గాంధారీత్వం' అన్న ప్రయోగం హఠాత్తుగా గుర్తుకొచ్చింది.
అలాంటి పదప్రయోగం చేసింది చైతన్య కాదు. నానమ్మ మహాభరతం చదువుతూ చెప్పిందేప్పుడో.
చిత్రంగా చైతన్య గుర్తుకొస్తున్నాడిప్పుడు.
తను నగ్నంగా వున్నప్పుడు చైతన్య స్పురణకి రావటం అసలు ఇష్టంలేదు.
అలా తన వయసు పొంకాన్నితేరిపారచూసుకునే వేళ మనస్సు పడ్డవాడే మరీ మరీ గుర్తుకోస్తాడన్న విషయం ఆమెకు తెలీదు.కాని. ఉదయం తనను చుట్టుకుని నేలపై దొర్లిన చైతన్యే ఇప్పుడు నీళ్ళుగా మరి ఆచ్చాదన లేని ఒంటిపై గుచ్చుకున్నట్ట్లుగా వుంది.
వచ్చిందోకందుకయితే మనసు మరోకందుకా అంటూ ఇంత అల్లరి పేడుతుంటేదే౦టబ్బా!
బామ్మ చెబుతూనే వుంది.
"చదననేర్తువా వ్రాయనేర్తువా అంటే చదవా, వ్రాయనేరనుగాని__ చింపనేర్తునా అందట వెనుకటికెవతో..... ఆడదానికి పోలీసు ఉద్యోగమెంటీ మగరాయుడిలా "
గాభాల్న పైకిలేచింది టబ్ బ్లోంచి.
ఎదురుగా వున్న మిర్రర్లో గంతలు విప్పిన గాంధారిత్వం.....
వేగంగా చూపుల్నీ మరల్చుకుంది.
సిగ్గుతో హరివిల్లులా వంగిన ఆధారాలు.....
ఒరిసిపోయాయా...... వెళ్ళ రాపిడికివడలిపోయాయా..... లేదే..... రిబోస్లేవిన్ టేబ్లేట్సే౦దుతూ.
పెదవులు మృదువుగా మెత్తగా వుండాలని ప్రతిరాత్రి బామ్మ పెదవులకి వెన్న రాసేది...... కుంకుమ వర్ణంతో నేచురల్ షేడ్ లా వుంటే పెదవుల్నీ కామెంట్ చేస్తాడెం!
అదిగో అప్పుడు వినిపించింది బయట అడుగుల చప్పుడు.
అమాంతం రెండు చేతుల్ని గుండెలకి అడ్డంగా పెట్టుకుంది.
ఎవరో ద్వారంలో నుంచి ,మనసు లోతులదాకా చూస్తున్నట్టు ఇదేమి అనుభూతి బామ్మా!
ఇక్కడ బామ్మ రిఫెరెన్స్ దీక్షకే ఉచితంగా అనిపించక వెంటనే ఒంటిని తుడుచుకుని నైతీని వేసుకుంది.
ద్వారం తెరిచిందో లేదో ఉలికిపడింది.
బయట హాల్లో కాదు __ ఆమె బెడ్ రూమ్ లో చైతన్య కూర్చుని వున్నాడు.
చురుక్కుమంది.
కవ్వించాలని అనిపించింది.
ఆదివారం అతడి చూపులు నైతీలోనుమ్చిలోపలికి చోర్చుకుపోయి.....
"మేడమ్ " చాలా కేజువల గా వచ్చిన పనేదో చెప్పాబోయాడు.
ఇక్కడ ఆమె కాస్త సహనాన్ని ప్రదర్శించి వుంటే ఆ రాత్రి తను ఒంటరిగా గంజాయి తోటల్లో మాటువేసివిషయం తెలియచేసేవాడే.
కాని ఆమె అవకాశం ఇవ్వలేదు.
అతడి గురించి తను గోప్యంగా ఆలోచించిన మాట నిజమే కాని అనాలోచితంగా అతడే రూమ్ లోకి రావడం తానెలా అంగీకరిస్తుందని!
"యూ సీ..." ఏదో చెప్పాబోయాడు.
"ఐడోంట్ వాంటూ సీ....." వెంటనే అంది.
"ఏమిటి అని మీరు అడగోచ్చు, మిమ్మల్ని నా బెడ్ రూమ్ లో చూడదలచుకొలేదూ అన్నది నా జవబువుతుంద. అయినా ఇదేమిటి ఇంత అసభ్యంగా....."
ఇదీ చైతన్య వూహించని రియాక్షనే.
లేచి వెళ్ళబోయాడు.
"నేనడిగిన ప్రశ్నకి మీరు జవాబు చెప్పలేదు" అందామె.
"మీరేం ప్రశ్నడగలేదు. మీ అనుమతి లేకుండా మీ బాత్ రూమ్ లో దూరినట్టు ఏకపక్షంగా విశ్లేషణ అండచేసారు"
"ఆఫ్ కోర్స్ " ఈ మాత్రం ఇదికించడమూ ఆమెకి ఆనందంగానే అనిపించింది.
"నేను ఇక్కడ నిలదీయకపొతే రేపు మీరు ఆనందంగానే అనిపించింది.
"నేను ఇక్కడ నిలదీయలేకపోతె రేపు మీరుయా పనే చేసేట్టున్నారు."
నిజంగానే చైతన్యలో ఓర్పు నశించిపోయింది. తన సహజమయిన దూకుడు తప్పనసరి అనుకున్నాడేమో.
`
"చూడండి మిస్ దీక్షా.... నిజం చెప్పాలీ అంటే మీరన్నది నా బెడ్ రూమ్ లో అంటే ఫారెస్ట్ ఆఫీసరుగా నాకు మాత్రమె పరిమితం కావాల్సిన రెస్ట్ హౌస్ లో"
"కాని నేను అఫీశీయాల్ గా వచ్చాను."
"అయినా నా అనుమతి కావాలి."