Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 41

    "అలా ... అందమైన అమ్మాయిల్లాగే అడ గంజాయి మొక్కలు కూడా అసాదారణమైన మత్తుని అందిస్తూ సొసైటీలో సాధ్యమైనంతమరణ హొమాన్నిసృష్టిస్తున్నాయి."
   
    కొన్ని క్షణాలపాటు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
   
    "ఇప్పుడే చేద్దామనుకుంటున్నారు" చైతన్య అడిగాడు.... సాలోచనగా నిలబడ్డ దీక్షని చూస్తూ, "మొక్కల్ని వెంటనే నాశనం చేద్దామంటారా?"
   
    తోటలో నెమ్మదిగా నడుస్తున్న ఆమె ఇప్పుడు అందమైన వయసులో వున్న అమ్మాయిలా లేదు. పరిస్థితుల్నీ అవగాహన చేసుకుంటూ సందర్బోచితమైన మేధని ప్రదర్శించాగల అనుభాగ్నరాలైన పోలీసాఫీసరులా వుంది.
   
    "నో."
   
    చైతన్య భావరహితంగా చూసాడు.
   
    "ఇప్పుడు మన కంట పడింది హత్యాయుధమే  మిస్టర్ చైతన్యా హంతకుడు కాడు."
   
    ఎంత ఎదిగినా ఆడది ఆలోచించేది మనసుతో తప్ప మెదడుతో కాదన్నా చైతన్య వూహలకి బ్రేక్ పడిందక్కడే
   
    "చైతన్యా... ప్రభుత్వ దృష్టికి అందకుండా ఈ మరుమూలా అడవిలో ఇలాంటి ప్రయత్నం జరుగుతుందీ అంటే దీని వెనుక చాలా నెట్ వర్క్ వుండి వుంటు౦దన్నది నా నమ్మకం. ఇప్పుడు సందించాల్సిన అస్రం మూలకారకుడైన వ్యక్తిపై అంటే....
   
    అర్దోక్తిగా  అన్నాడు. "తోటనీలాగే వుంచి ఇక్కడ నుంచి పరిశోధన ప్రారంభించాలంటారు."
   
    "యస్ ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నది వెంటనే పోలీస్ పోర్స్ ని రంగంలోకి దింపడం కాదు. ఇక్కడ ఈ తోటని కాపాడే ఒక వ్యక్తినైనా నిర్భందించి అతడి ద్వారాసలు వ్యక్తినెవరో తెలుసు కోవటం."
   
    "అదంత  సులభమని నే ననుకొను."  
   
    "కావచ్చు. కానీ తప్పదు. ఆలస్యమైనా మౌలికమైన వ్యవస్థని ఎదుర్కోవల్సింది ఇక్కడ నుంచే.
   
    తార్కికంగా చెప్పుకుపొయిందామె.
   
    కేరళలోని మన్నారు పర్వత శ్రేణుల మాటున నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అక్రమంగా పెంచబడుతున్న నాలుగు వందల ఎకరాల పాడీ ఫీల్డ్స్ ని గుర్తించి నాశనం చేసింది ఈ మధ్యనే1983 మార్చి 28 వ తేదీన కొచ్చిన్ రేవు నుంచి బయలుదేరిన "హేట్టీ" అనబడే షిఫ్ నుంచి సూమారు ఇరవై అయిదు కోట్ల రూపాయల ఖరీదు చేసే హాష్ చే యు. ఏస్. కోస్త గార్డ్స్ పట్టుకోగాలిగారు ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న "బ్రెన్ అల్సిన్ మిగేట్" అనే దంపతులు పట్టించారు దాన్ని. అది కేరళా స్మగ్లింగ్   గేంగ్ కి సంబందించిందిగా తర్వాత గుర్తించబడింది. మరో విచిత్రమేమిటంటే ఓ అత్యున్నతఉద్యోగి, మినిస్టర్ దాని భాగస్వాములు. అదే అడవి ప్రాతంలో నార్కోటిక్స్ నిరోధక విభాగం ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ చాలా సార్లు దాడులు నిర్వహించినా పట్టుబడింది అడవి పోలిమేరల్లోవున్న ఓ ఎకరం గంజాయి తోట మాత్రమె. కాని లోపలి చొచ్చుకుపోయాక నలుగు వందల ఎకరాల తోట ప్రభుత్వధికారుల దృష్టిలో పడింది చెప్పోచ్చేదేమిటంటే నేరస్తులైనవ్యక్తులు సుమారు నాలుగైదేళ్ళాపాటు ఎక్సైజ్, కస్టమ్స్ అధికార్లను తప్పుదోవ పట్టించడానికి కావాలని ఓ ఎకరం గంజాయి తోటని అడవిలో పెంచి అక్కడితోనే వారి పరిశోధన ఆగిపోవడానికి అలా అవకాశం తీసుకున్నారు."
   
    "అంటే ... ఇదే అడవిలో మరెక్కడో అలాగే అలా అలోచించాలని పీస్తూంది."
   
    సరిగ్గా ఇక్కడ దీక్ష విషయంలో తొలిసారి ఓ తిరుగులేని అభిప్రాయం ఏర్పడిపోయింద.
   
    పెరిగిన వాతావరణం మూలంగానో లేకా అ౦తర్లీనంగా తను ఎంతపెద్ద అఫీసరైనా ఓ ఆడది మాత్రమే అన్న భావంతోనే అలా కనిపిస్తుందిదేమోకాని దీక్ష చాలా గట్స్ గల అమ్మాయి.
   
    చూస్తున్నాడు దీక్షని అదోలాంటి భావంతో.
   
    అదే క్షణంలో దీక్ష చూపులు అతడి చూపిల్నీ కలుపుకోవడం యాదృచ్చకమే.
   
    వెంటనే తత్తరపడింది. మామూలు ఆడపిల్లలా.
   
    అంతకు మించి వేగంతో ఎటో చూస్తూగోళ్ళు కొరుక్కుంటుంది.
   
    "టోటల్ ఎక్స్ ప్టేన్స్ అక్కర్లేదు" అన్నాడు ఠక్కున.
   
    "అదేమీటీ" అంది మరింత కంగారుగా.
   
    "నా ఉనికిని మీరు పూర్తిగా అంగీకరించే టోటల్ ఎక్స్ప్టేన్స్ కాకపోయినా ఫర్వాలేదు. రెండు విభాగానికి చెందిన ఆఫీసర్లుగారైనా కండిషనల్ ఎక్స్ ప్టేన్స్ బేటరంటున్నారు." తన సామీప్యాన్నీ అపార్ధం చేసుకోవద్దని చిలిపితనాన్నిమర్మంగా వ్యక్తం చేశాడు.
   
    "మీరు మాతాడుతున్న దేమిటో నాకు అర్ధం కావటంలేదు."
   
    "అందమైన అమ్మాయి ఇమ్తరిగావు మగాడి ముండుభాయన్నిఎలా వ్యక్తం చేసేదీ చెప్పాడు పాల హాక్."
   
    "భయమేమీటీ?"
   
    "అలా గోళ్ళు కొరుక్కోవడం..."
   
    గభాలున వెనక్కీ తీసుకుంది. "అదేం లేదు..."
   
    "లేదూ అంటే చాలదు. ఇప్పుడు మీరుబి _12 రిబోప్లేవిన టేబ్లేట్స్ వాడాలి"
   
    "అవేందుకు ...."
   
    "మీ చేతివెళ్ళు రాపిడికే కందినట్టు ఇరిసి పోయాయి కాబట్టి."
   
    "ఏమిటీ?"
   
    "అందమైన మీ పెదవులు..."

    అది నుంచీ  ఆమెని ఇలాగే డీల్చేయడం అలవాటైన చైతన్య ఇప్పుడన్న వాక్యాలతోఆమె గుండె కనుమలపై ఎంత రాపిడిని సృష్టించిందీ వూహించలేదు.

 Previous Page Next Page