Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 40

    "మైగాడ్ ..."
   
    సుమారు అరెకరం చదునుగా వున్న నేలపై పెరిగిన గంజాయి తోటని చూస్తూ అంది దీక్ష విభ్రమంగా.
   
    పశ్చిమానికి సాగిపోతున్న సూర్యుడి కిరణాలు నిప్పుల్నీ చెలరేగుతున్నాయి.
   
    దీక్ష ఆ క్షణాన సమీపంలోని అడవిలో పొంచివున్నమేనీటర్ గురించి ఆలోచించడంలేదు. పచ్చని ప్రకృతిలో పెరుగుతూ రూపాతరం చెంది మరో సమాజానికి కేన్సర్ కాగలిగే ఇక్కడి గంజాయి మొక్కల్ని చూసింది కానీ, ఇమ్తదట్టంగా పెరిగిన తోటని కాదు.
   
    అడవి నిశ్సబ్దంగా వుంది.
   
    చుట్టూ ఎత్తయిన వెదురుపొదలు, దక్షణాన గుట్ట, తూర్పునగంజాయి తోట ఉనికి కనిపించనివ్వని అత్తయిన సిందూరచెట్లు.....
   
    పగటిపూటతోట పక్కకి రారో లేక తమని ఎవరన్నా గమనించారోమరి ఒక్కమనిషి అలకిడీ లేదు.
   
    సుమారు నాలుగు మీటర్ల పొడవున్న గంజాయి మొక్కల నడుమ మూడు మీటర్ల కంటె ఎత్తు ఎదగని మరికొన్ని మొక్కలు, నిజానికి ఆ తోటలో ఎక్కువుగా ఉన్నది పొట్టిగా వున్న మొక్కలే.
   
    "ప్రతి చరిత్ర వెనుక అదృశ్యంగా ఆడదాని హస్తం చర్చించుకోవాల్సిన అగత్యం లేదు..." అన్నాడు చైతన్య నెమ్మదిగా.
   
    హాఠాత్తుగా ఈ టాఫిక్ దేనికో ఆమెకు అర్ధంకాలేదు.
   
    "ఇప్పుడు మనం అర్జెంటుగా చరిత్రల గురించి చర్చించుకోవాల్సిన అగత్యం లేదు..." తోటలో కలియ తిరుగుతూ అంది.
   
    "అలా ఖండించకండిదీక్షాదేవీ. చాలా మారణహొమాలక, రక్త పాతాలకీ ఆడదే కారణమంటారు."
   
    కేవలం తనతో చైతన్య ఇలా మాట్లాడతానని తెలీని దీక్ష మూడ్ పాడైపోతుంది. "రామాయణంలో పిడకల వెతలా ఈ టాపిక్కేమిటి?"
   
    "గంజాయిలో కూడా అడ మొక్క అతి ప్రమాదకరమని చెప్పుబోతున్నాను మిస్ దీక్షా " ఆటపట్టింస్తున్నట్టు కాక చాలా సీరియాస్ గా మొక్కలమధ్యకు వచ్చి నిలబడ్డాడు.
   
    "గంజాయి వనంలో తులసి మొక్కలా నిలబడ్డా మీకు నేను చెప్పేది రుచించకపోవచ్చు కాని, ప్రపంచంలో అతి ప్రమాద భూయిష్టమైనానార్కోటిక్స్ తయారీకీ మూలం గంజాయి వనంలోకి ఫిమేల్  ప్లెంట్స్ అంటే ఇవన్నమాట ..."
   
    ఆమె నిర్విణురాలైనా చూస్తుంది పొట్టిగా వున్న గంజాయి మొక్కల్ని.
   
    దోమల్లోలాగే గంజాయి తోటలోని ఈ అడమొక్కలు..."
   
    అలా అడ దోమల గురించి, అడ గంజాయి మొక్కల గురించి అదే పనిగా అతడు రిపీట్ చేయటం నచ్చలేదామేకి. "అడవి మృగాల గురించే అనుకున్నాను... గంజాయి తోటల గురించీ కోదక మీకు బాగా తెలుసునని బోధపడింది."
   
    "ఆ సత్యం అంగీకరించడానికిఅంత బాధపడాల్సిన అగత్యం లేదు,."
   
    జాలీగా అయినా అతి ప్రమాద బూయిష్టామైనా దుర్గమారణ్యంలో నిలబడిమాట్లాడుకుంటున్నారిద్దరూ.
   
    "యూ సీ మిస్ దీక్షా ... విమానంలో ప్రయణం చేయడానికి తార్చో జెట్ ఇంజను కంట్రోల్ బ్యూరోలోని ఇంటెలిజేంస్ అగత్యం లేదు కానీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలోని ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా మీకు ఈ వివరాలు తెలియడం చాలా అవసరం...."
   
    నిజమే. కానీ అంగీకరించడానికి అహం అడ్డుపడింది. "యూ సీ మిస్టర్ చైతన్యా ఏస్. సి.బి అధికారిణిగా నాకు గంజాయి మొక్కలు ఎలా వుంటాయో తెలిస్తే చాలు."
   
    "అలా అంటే క్రిమినాలజీగురించి అవగాహాన లేకుండా క్రిమినల ని సంస్కరించాలనుకోవడం లాంటిది."
   
    మనం పాయింటుకి వచ్చేద్దాం...." స్పష్టంగా అతడి కళ్ళలో కనిపించే చిలిపితనాన్నిటాలరేట్ చేయలేకపొయిందామె.
   
    రైటే... మనం జాయింటుగా పాయింటు కొచ్చేద్దాం" క్షణం ఆగి అన్నాడు. గంజాయి విత్తనాల్ని ముందు మొలకలుగా మారేదాకా మూడు వారాలపాటువిడిగా నర్సరీస్ లో  పెంచుతారు. దీన్ని స్ట్రేటింగ్ అంటారు తర్వాత ఆ మొక్కల్ని ఇలా చదునుగా వున్న నేలపై నాటుతారు. ట్రాన్స్ ప్లాంటేషన్  అంటే ఇదే. ఆరు నెలల కల్లా ఎదిగిన  మొక్కల్ని తీసేయడం జరుగుతుంది. కారణం అవి ఉపయోగం లేదు కాబట్టి. అంటే సృష్టిలో పురుష వ్యవస్థని నిర్లక్ష్యం చేసే.... ఓ.కే.... ఆమె చూపుల వాడికి కొద్దిగా తత్తరపడ్డాడు.
   
    "సో... మళ్ళీ  పాయింట్ కే వచ్చేస్తాను అలా మోగమొక్కల్ని పెరికేసాక మిగిలిన అడ మొక్కలపై పొటాష జల్లుతారు. ఊరికినే వినడం కాదు ఎందుకనిడికితే బెటరు...."
   
    "ఎందుకు" అనడిగింది ఉత్సుకత దాచుకుంటూ.
   
    "గుడ్..... అలా రేస్పాడ్ చేస్తే బాగుంటుంది. పొటాష్ జల్లడం వల్ల అడ మొక్కలకి చెందిన పెద్ద ఆకులూ రాలిపోతాయి. చిన్న ఆకులూ సీజినింగ్ అయినట్టు చిన్న మొగ్గలాంటి గుత్తుల్లా మారతాయి. క్రమంగా. గంజాయిలో చాలా అవసరమైనవీ, కోట్ల ఖరీదుచేసే నార్కోటిక్స్, ముఖ్యంగా హెరాయిన్ తాయారయ్యేది మీటి నుంచే 'చరస్' పొడుంచేయబడినగంజాయి కొమ్మలనుంచీ, ఆకుల మొక్కల నుంఛీ ద్రవించే ఓ లిక్విడ్ తో హాషేవ్ బాగా కిక్కిస్తుందంతారు. సో...."
   
    చాలా విషయాలు నార్కోటిక్స్ బ్యూరోలోతనకు చెప్పని ఎన్నో వాస్తవాలు ఇలా తెలుసుకోగలుగుతున్నందుకు  ఆసక్తిగా వింటోంది దీక్ష.    

 Previous Page Next Page