Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 39

    "అమ్మ ..... చిరుతపులికి అందులోనూ మేనీటర్ గా మారినడానికి అదా మగా తేడా వుండదునుకుంటాను."
   
    "నిజమే... అది లింగభేదం లేకుండా పైన బడుతుంది."
   
    "అవునమ్మా... అలానే అనిపిస్తుంది."
   
    "అనిపించడమేమిటి...... అది నిజం కూడాను"
   
    "నిజం కాకపోతే ఏ క్షణంలో అయినా చార్జి చేయాలని నెమ్మదిగా ప్రాకుతూ రాదేమో కూడా."
   
    "అవును దాన్ని స్టాకింగ్ అంటారు వేటగాళ్ళు" చెప్పింది దీక్ష ముందుకు నడుస్తూ.
   
    "అమ్మాయిగారూ..... సామాన్యంగా చిరుతపులి ఎంత దూరంలో నుంచి చార్జి చేస్తుందంటారు?"
   
    క్షణం ఆలోచించి అంది "పదిఅడుగుల దూరంలోనుంచి అని ఎక్కడో చదివినట్టుగుర్తు."
   
    క్షణం ఆలోచించి అంది "పది అడుగుల దూరంలోనుంచి దూకేఅవకాశముందేమో గుర్తు చేసుకోండమ్మా."
   
    విసుగ్గా స్వామికేసి చూసింది. "అయినా ఏమిటి నీ సోది"
   
    "సోది కాదమ్మా.... ఇందాకట్నుంఛీ చూస్తున్నాను."
   
    "ఏమిటి?"
   
    "చిరుతపులి"
   
    ఆదరిపడింది. "ఎక్కడ?"
   
    "సరిగ్గా మనకి ఇరవై అడుగుల దూరంలో రెల్లు పొదల మాటున నుంచి ప్రాకుతూ వస్తూంది" ఆ తర్వాత స్వామి అక్కడ లేడు. సినిమా దేవుడిలా చటుక్కున అదృశ్యమైపోయాడు.
   
    వాయువేగంతో పరుగెత్తిన స్వామిని చూడలేదామ.
   
    భయ విహ్వాలంగా రెల్లుపోదల్ని గమనిస్తూ ఎంత అలజడి పడిందీ అంటే ముందు ఖతమే అనుకుంది.
   
    ఇప్పుడు చిరుత తన ఉనికి తెలియచేస్తూ ఆమెకు అభిముఖంగా వచ్చి నిలబడింది.
   
    అదికాదు.... ఇరవై అడుగులదూరంలో వున్న చిరుతపులి కోరలు సాచి పైకి లఘించాలని రెప్పలార్చకుండా చూస్తుందామెకేసి.
   
    భయంతో ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
   
    ఆ చిరుతే రమాకాంత్ ని కడతెర్చిన మేనీటర్ ఆమెకు తెలీదు.
   
    లిప్తులు టెన్షన్ గా నడుస్తున్నాయి.
   
    చిరుతపులి చార్జి చేసేదే! అదిగో అప్పుడు వినిపించింది తుఫాకి పేల్చినా చప్పుడు అ తూటా మోతకి ముందు త్రోటుపడిన చిరుతవెనక్కీ కాక రోషంతో దీక్ష పైకి దుమికింది. శరీరం నిలువునా చీలీపియింవుండేదే! కానీ అంతలో పొదల్లోనుంచి దీక్షని చేరుకున్న చేరుకున్న చైతన్య అమాంతం ఆమెని పొదవి పట్టుకుని ఏటవాలుగా వున్న ప్రదేశంలోకి దోర్లాడు. 'దబ్ మంటూ  నేలపైబడిన చిరుత దృష్టి మళ్ళేంతలోనే చైతన్య తుఫాకీ మరోసారి గర్జించింది వేటగాని ఎక్స్ ప్రెస్ రైఫిల్ ని ఉపయోగించటంలోగానీ అసాధారణ ప్రజ్ఞగల చైతన్య ఆ క్షణంలో ప్రదర్శించిన సమయస్పూర్తి చిరుతని ఎంత కంగారుపెట్టింది అంటే, అదివెంటనే ప్రాణభీతితో పొదల్లోకి పరుగెత్తింది గాండ్రిస్తూ...!
   
    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
   
    ఉద్విగ్నంగా ప్రత్యర్ధిని అనుసరించాలని పైకి లేవబోతూ సాధ్యం కానట్టు ఆగిపోయాడు.
   
    దీక్ష ఇప్పుడు అతడిపై వుంది.
   
    బోర్లా అతడిపైవాలి, చేతులతో చుట్టేసిన దేక్షాదేవికళ్ళలో భయం కన్నా బిడియం.
   
    అంతకుమించి ముడుచుకున్న ముగ్ధకవితాపంక్తులు చెదిరి పైకి చిమ్మినట్టు అనుచుకుంటున్నయవ్వన ప్రభావ విపంచిక తెలియకుండా శృతి చేయబడి సన్నని స్వరంతో నరనరాలలో రాపిడి సృష్టిస్తున్నట్టుస్థాణువై చూస్తుంది అతడ్నే.
   
    ఆమె లేవాలనిపించేనట్టు.
   
    చైతన్యనే పైకి లేవదీశాడు.
   
    "ఓడిపోయాను" అన్నాడు గోణుకుతున్నట్టుగా.    
   
    ఇంకా తేరుకిలేదామే__ "దేనిలో"
   
    నా వీపున మట్టి అమ్తుకుంటుందిగా" దులుపుకుంటూఅన్నాడు
   
    అర్దహంకాలేదు. "అయితే"
   
    "అంతేగా దీక్షదేవీ! ప్రత్యర్ధివీపు నేలని తాకితే ఒడినట్టేఅని అంతర్జాతీయకుస్తీప్తీలనిబంధనలు తెలియజేస్తున్నాయ" ఇంతసేపూనేలమీద అతడిపైతను పడటాన్ని అలా వ్యక్తం చేస్తుంటే చెంపలు ఎరుపెక్కాయి రోషంగా.
   
    అడవి మనిషి. తను కృతజ్ఞత చెప్పే అవకాశమివ్వకుమ్డా అటపట్టిస్తున్నాడు.
   
    1987 లో పదిహేను కోట్లరూపాయల కాంట్రాబాండ్ హేరాయిన్ని బాంభే ఎయిర్ పోర్ట్ లో స్వాధీనం చేసుకున్న మీ జాతీయస్థాయిగౌరవాన్ని అర్ధంచేసుకుని చిరుతపులి తెలివితక్కువ తనానికి కోపం తెచ్చుకున్న మిమ్మల్ని క్షమించమంతున్నాను."
   
    "దేనికి?"
   
    "మీ అనుమతి లేకుండా మిమ్మల్ని తాకినందుకు ... తెలుగు సినిమా కధనాయుకుడిలా మీతో కలసి జాయింటుగా దొర్లినందుకు"
   
    "వెళదామా...?" అందామె.
   
    రెస్ట్ హౌస్ కేసి కాక గంజాయి తోటలవేపు నడుస్తోంది......
   
    ఆ స్థితిలోనూ ఇంకా కర్తవ్యం గురించే ఆలోచించే ఆమె దీక్షను అభినందించకుండా వుండలేకపోయాడు.
   
    కానీ చేతన్యకి తెలీదు
   
    నిన్నటిదాకా అతడి  ఎదురుపడటానికే  సంశయయించే దీక్ష యిప్పుడు అతడిలో కలసి ఎంత దూరమైనా నడవాలనుకుంటున్నదని.
   
    నీరులేనిశరత్కారాల మేఘంలా బ్రతకడాన్నే నిన్న మిన్నటిదాకా కోరుకున్న ఆమె ఇప్పుడు జడిలో తడిసిన కన్నె అలజడిలా నిదురకళ్ళతో నేలచూపులు చూస్తూ ముందుకీ సాగుతూంది.
   
                   *    *    *    *

 Previous Page Next Page