Previous Page Next Page 
ది రైటర్ పేజి 3

    "మీరు"
   
    "వైదేయ వున్నాడా అని అడుగుతున్నాను" ఆమె గొంతులోఅదే శాసింపు ......
   
    "చెబుతాను ముందుమీరేవరో చెప్పండి."
   
    "థర్టీ పోర...... ట్వంటిఎయిట్ .......థర్టీపోర్" కిన్నెర సాని కిలకిలలు ఆమె గొంతులో ......
   
    "నేను అడుగుతున్నదీ మీ కొలతలు కాదు"
   
    "రోషణి"
   
    "రోహీణి!"
   
    "కాదు రో......షి......ణి"
   
    "రోషిణి.......వెరీ నావెల్ అండ్ స్వీట్ నేమ్....."
   
    "థెంక్సూఎలాట్ ...... వై దేయక్కడ "
   
    "అతనితో మీకేం పని"
   
    "నేను అయన అభిమానిని"
   
    "మానీని నేనే వై యని" అనాలనుకున్నాడు అటపట్టించాలని "నేనే" అన్నాడు చిరునవ్వుతో.
   
    "వ్వాట్....." ఆమె గొంతులో కలవరపాటో పరవశమో కొన్ని క్షణాలు జవాబివ్వలేకపోయింది.
   
    "ఏం మాటడాడు...."
   
    "ఓహ్.....మై స్వీట్...... వైథేయ...... ఎన్నేళ్ళతపస్సు  నాది..... అయ్యో...... ఎన్నెన్ని మాటడాలని తపించిపోయాను..... ఇదేమిటి మూగదాన్నయి పోతున్నాను" ఆమె కంఠంలో నిజాయితీతోకూడిన త్రోటుపాటు అతడ్ని పారవశ్యంలో ముంచింది.
   
    చాలా సేపటివరకూ తనూ తేరుకోలేకపోయాను "చెప్పండి "

    "ప్లీజ్..... ఫోన్లోకాదు. మిమ్మల్ని కలుసుకోవాలి " అర్డంగా అంది.
   
    "తప్పదా"
   
    "ఏం అభ్యంతరమూ"
   
    "లేదు....." అతడు ఆలోచిస్తున్నాడు వేగంగా ......
   
    "మరి"
   
    "నేను దుర్మర్గుడ్నంటారు" తనను అరాదించే ఆడపిల్ల తనంటే మరింత మక్కువ చూసేట్టు చేసుకునే లాజిక్ ఆమెపై ఇప్పుడు ప్రయోగిస్తున్నాడు.
   
    "ఎందుకట...... ఏమైనా చేస్తారనా"
   
    "ఏమీ చేయనని" మరో అస్రం.....
   
    కిసుక్కున నవ్వినట్టుగా వినిపించింది.
   
    "ఏం రాతల్లోనే కాని చేతుల్లోఅసమర్డులని ఏ ఆడపిల్ల యినా ఎగతాళి చేసిందా"
   
    'విచిత్రం.... తననే ముగ్గులోకి దించెట్టు మాట్లాడుతూంది రోషిణి"
   
    "మాటాడరేం"రెట్టించింది  అవతలి నుంచి . "వలుకే బంగారమా "నవ్వుకున్నాడు వైదేయ.

    "నవ్వుకుంటూన్నారు కదూ"
   
    "చూస్తున్నట్టు చెప్పగలుగుతున్నారే"
   
    "మీచేత చెప్పించాలని చూస్తున్నాను"   
   
     "ఏమిటి...."
   
    "అందమైన ఆడపిల్ల దొరికితే మీరు అందరి మగాళ్ళను మించి ఆకట్టుకోగలరని....."
   
    "ఏం.....మీరు అంత అందంగా వుంటారా "   

    "చెప్పమంటారా ...."
   
    "ఊ....."   

    "రాసిపోయిన గూలాభీల లేతదనంతో  చెక్కుచెదరని సంపెంగా సౌకుసూర్యంతో ఉత్తుంగ హిమాలయాలలోని మంచును ముద్దగా చేసి విశ్వకర్మ పోతపోసిన విగ్రంహంలా వుంటాను" చిలిపిగా జవాబుచ్చింది.
   
    "ఓహ్?చూడాల్సిందే...." మునిపంట పెదవిని నొక్కి ఆమె అందాన్ని అంచనా వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. "అయినా ఇంతటి అభిమానికీ కారణం."
   
    "మీరు నా అభిమాన రచయిత కావడం"
   
    "చిత్రంగా వుంది..."

    "ఎందుకు....."
   
    "పిచ్చి వ్యామోహంతో నా రచనలు చదివే మగాళ్ళు సైతం చదివేమని చెప్పుకోవడానికి సంకోచిస్తుంటే ఓ అందమైన ఆడపిల్ల నిర్భయంగా నా అభిమానిని చెప్పుకుంటున్నందుకు ?" సెక్సు క్రీం అనే మసాలాల్నిదట్టించి ప్రస్తుతం మంచి రచియతల కోవలోకి చేరిపోయిన వ్యక్తి వైధేయ.
   
    కలుసుకోవాలనే ఉత్సాహంతో "మీరుండే దెక్కడ" అన్నాడు.
   
    ఆమె బదులివ్వలేదు......
   
    ఈ వూరు కాదేమో అనుకున్నాడు "ఎక్కడ నుండి వచ్చారు"
   
    కేజువల్ గా అడిగేడు.
   
    "జైలు నుంచి"
   
    "జైలునుంచా " వైధేయ భ్రుకుటి ముడిపడింది.
   
    "అవును"
   
    "ఏం అక్కడ మీరు పని చేస్తున్నారా"
   
    ఆమె నగ్నంగా నవ్వింది "కాదు"
   
    "పోనీ .....అక్కడ మీ వాళ్ళెవర్నయినా కలుసుకోవాలని...."
   
    "కాదు కాదు కాదు...."
   
    "మరి" కొన్ని లిప్తల పాటు ఇద్దరి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది.
   
    "నేను రెండేళ్ళుపాటు జైల్లో గడిపి ఈ రోజే బయటకు వచ్చాను" పక్కలో డైనమేట్ పేలినట్టు అదిరిపడ్డాడు.  

 Previous Page Next Page