Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 38

    క్షణం చైతన్య కళ్ళలోకి చూసి తత్తరపడినా తను 'ఎస్సిబి ' ఆఫీసరు నని గుర్తుకొచ్చిందేమోవెంటనే సవరించుకుంది "జాతీయ స్థాయిలో డ్రగ్ ట్రాఫి౦గ్ ని కంట్రోల్ చేయాలని "COMBAT ABUSE OF NARCOTIC DRUGS AND PSYCHO TROPIC SUBSTANCES AND ILLICIT TRAFFIC"  అనే సెంట్రల్ గెజిట్ నోటిఫికేషన్ తో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ని 1986 మర్చి 17న ప్రారంభించారు. 1987 మార్చిలో ఎస్ సిబికి ఓ రూపం ఏర్పడింది... రెవెన్యూ ఇంటిలిజెన్స్ డైరెక్టరేట్ నుంచి కస్టమ్స్ డిపార్ట్ మెంట్స్ నుంచే కొందర్ని ఎస్ సిబిలో కోర్ టీమ్ గా ఫారం చేశారు. అలా నేనూ కస్టమ్స్ నుంచి ప్రత్యేకాధికారులకు సౌత్ జొన కి వచ్చిన అఫీసర్నీ ! 1987 లో పదిహేను కోట్లరూపాయల కంట్రాబాండ్  హీరాయిన్ని నేను బాంబే ఎయిర్ పోర్ట్ లో స్వాధీనం చేసుకుని... జాతీయ స్థాయిలో..."
   
    "జోహార్లు..." అర్ధోక్తిగా ఖండించాడు. "నేను మీ జాతీయస్థాయి చరిత్రని అడగలేదు. ఇలా హఠాత్తుగా యిక్కడ ప్రత్యక్షం కావడంతో పొరపాటున ఆశ్చర్యపడ్డాను. డానికి యిలా నిలబెట్టి నన్ను హింసించటం సమంజసం కాదు."   
   
    ఈ మనిషి సంగతి తెలిసి యిలా రెచ్చిపోవటంలో ఎంత పోరాపటు చేసిందో బోధపడిన దీక్ష ఆ తర్వత తన జాతీయస్థాయి ఆలోచనగల నుంచి తేరుకుంది "మీరు పంపిన ఇన్ ఫర్మేషన్ అందగానే నన్నుఇక్కడికి డెప్యూటీ చేసారు. అంటే నేను అఫీషయల్ గానే వచ్చానిక్కడికి __"

   
    "నిజమే అయ్యుంటుంది పర్సనల్ గా నాకోసం మీరోచ్చేటంత చనువు మన మధ్య లేదుగా! ఎస్ నేను  మీ దృష్టిలో   మరోసారి అసమర్ధడ్ని కాలేక గంజాయి మొక్కల పెంపకం సంగతి తెలియజేసాను.... ఇక మీరు చేలరేగిపోవచ్చు!"
   
    ఉక్రోషంగా జవాబివ్వబోయింది. కానీ విడవడని చైతన్య పెదవులపై చిర్నవ్వు ఆమెను మళ్ళీ బోలేడెంత అందోళన పరిచింది. "యు సీమిస్టర్ చైతన్యా... నేను సాధ్యమైనంత త్వరలో విషయం తేల్చేద్దామని ఒంటరిగా వచ్చాను. అంటే ఈ రెస్ట్ హౌస్ లోనే ....."
   
    "వేరే బెడ్ రూమ్ లో వుంటారు."
   
    "ఆఫ్ కోర్స్ ..." ఈ చర్చ చాలా బిడియాన్ని కలగాజేస్తుంది . "ఇక్కడ రెండు బెడ్ రూమ్ లు వుండడం."
   
    "జాతీయ స్థాయిలో మీరు చేసుకున్న అదృష్టం కాబట్టి ఎన్నాళ్ళాయినా యధచ్చేగా ఉండొచ్చు " చైతన్య వెంటనే ఫారెస్ట్ మేఫ్ తీసుకుని గంజాయి తోట ఏ ప్రాంతంలో వున్నదీ వివరించాడు. అంత సమీపంలో నిలబడటం తోలిసారేమోఆమె కనుపాపలు చాలా అలజడిగా కదులుతూన్నాయి "మీరు కాస్త ర్రేస్ట్ తీసుకుంటే భోంజేశాక మనం బయలుదేరవచ్చు."
   
    "లేదు" చైతన్య చెప్పిన ప్రతిడానికి తలవూపడం చాలా అవమాన మనిపించింది "నేను వెంటనే స్పాట్ కి వెళ్ళాలి"
   
    "ఓ.కే ... తోడు రానా?"
   
    "అక్కర్లేదు . నేను ఐపియస్  ఆఫీసర్ని ."
   
    "ఆ విషయం వాటికీ తెలీదుగా?"
   
    "వాటికీ అంటే.....
   
    "ఇక్కడ తురుగుతున్న మేనీటర్స్ కి."
   
    "కాని వాటి నుంచి తప్పించుకోవడం నాకు తెలుసు" ఉక్రోషంగా జవాబు చెప్పి స్వామి కోసం చూసింది "నీకు అభ్యంతరం లేకపోతె... నాతోరా"
   
    స్వామి చైతన్య ముఖం కేసి చూశాడు..
   
    నిట్టూరుస్తూ భుజాలు ఎగరవేశాడు చైతన్య.
   
                    *    *    *    *   
   
    మధ్యహ్నం పన్నెండు గంటలు కావస్తుంది.
   
    యూనిఫాములో కాక చీర కట్టుకుని పచ్చని చెట్లమధ్య నడుస్తుంటే చాలా ఆహ్లాదంగా  వుంది దీక్షకి.
   
    స్వామి వెంట అప్పటికే నలుగు కిలోమీటర్ల దూరాన్ని అయాసంగా నడిచిందామె.
   
    ఈశాన్య దిశలో చీలిన గుట్ట అక్కడ నేల పైకి తుళ్ళుతున్న సెలయేరు వాయువ్య ఎత్తుగా ఎదిగిన దేవదారు చెట్లు, విశాలమైన పచ్చిక బయళ్ళు దాటాక సన్నని కాలిబాట, ఇరుపక్కలా రెల్లుపొదలు.
   
    మరో రెండు ఫర్లాంగులు నడిచాక ఒత్తుగా పెరిగిన విప్పతోట.
   
    ఏటవాలుగా వున్న నేలపై నుంచి తోటకి అనుకువున్న పొదల పక్కన నడుస్తున్నారిప్పుడు.
   
    హఠాత్తుగా ఎక్కడినుంచో ఓ కణుసుకేక వినిపించింది.
   
    మరో మూలనుంచి లంగూర్ ఆర్తనాదం.
   
    స్వామి దిగులుగా దిక్కులు చూస్తున్నాడు.
   
    "భయపడ్తున్నావనుకుంటాను" గర్వంగా నవ్వుకుంది స్వామిని గమనిస్తూ.
   
    స్వామి జవాబు చెప్పలేదు.
   
    వెదురు పొదల్లోనుంచి దృష్టి మరల్చి వేలితురు అంతగాలేని విప్పతోటలోకి చూస్తున్నాడు.
   
    "అడవిలో ఈ కేకలు సహజంగా వినిపిస్తుంటాయి " స్వామి మోహం చూస్తుంటే ఇప్పుడు ఆమెకి అందోళనగా వుంది.

    స్వామి నుదురుపై చెమట తుడుచుకుంటూ అన్నాడు. "అమ్మాయి గారూ... పులి పుట్రా సంగతి తమరికి బాగా తెలుసానుకుంటాను."
   
    "మరేం"
   
    "పెద్దపులికీ, చిరుతపులికీ తేడా కూడా బాగా తెలిసి వుంటుంది."
   
    "అవును చిరుత పులి చాలా కన్నింగ్ ఎనిమిల్ అంటారు."
   
    "అంతేకాకుండా ..."స్వామి గొంతు తడారిపోతూంది. "చాలా వేగంగా పరిగెడుతుంది కూడా."
   
    "యా.... అందుకే నేలమీద చిరుతపులి బారినుంచి పరుగెత్తి తప్పించుకోవడం కష్టంమంటారు."

 Previous Page Next Page