"నా కేక్కడో స్వంత శ్మశానము వుందని చెప్పడం నా అభిమతం కాదు. అయినా చెప్పాలిగా.... చూడూ ... మొండికేసిన వాళ్ళని,నాకు ఎదురుతిరిగిన వాళ్ళని, నా వ్యాపారంలో జోక్యం చేసుకావాలనుకునే నారక్ టిక్స్ రెవిన్యూ ఇమ్టాలిజేంస్ ఫారెస్ట్ విభాగానికి చెందిన వాళ్ళని అక్కడ సమాధి చేస్తుంటారు..... అంటే పులీ ఏకవీప్ట్ గా వున్నానన్నమాట.... ఇకపొతే నువ్వో విషయం అడగొచ్చు.... ఏన్నాళ్ళూ నీనిర్వాకం... ఏ చైతన్యలా హీరో అయినా,లేకమరావు దీక్షాదేవిలాంటి నార్కు టిక్స్ విభాగానికి చెందిన అఫీసరైనా ఇక్కడ అడుగు పెట్టలేరు. లంకలోని సీత కోసంనువ్వు అనొచ్చు..... రాలేరూ, రారూ అని చెప్పాగలిగేచివరి దృశ్యం ఇప్పుడు నీకు సోదాహరణంగా చూపించ బోతున్నాను... కమాన్...."
హఠాత్తుగా అతడి మొహంలోకి రంగులు మారగా విజయ చేయిపట్టుకుని ఈడ్చుకుపోయి గౌడన్స్ మలుపుదగ్గర విడచి పెట్టాడు...
అంతే...
అక్కడ కనిపించిన దృశ్యానికి ఆమెకు స్పృహా తప్పేంత భీతికి లోనైపోయింది.
స్తేబుల్స్ లాంటి షేడ్స్ లో పులులూ, చిరుతులలూ వున్నాయి.
అదికాదు ఆమెను అంతగా అందోళన పరిచింది....
దుర్గంధ భూయిష్టంగా వున్న అక్కడి పులులుతమ ముందున్న శవాల్ని చాలా ప్రీతిగా భోంచేస్తున్నాయి.
"ఇవీ నా సేనావాహీనిలో సహకరించే క్రూర మృగాలు విజయా. వీతినిలా పట్టి ముందు బందిస్తాను.... తర్వాత వాటి హేండ్ పార్ట్ పై తుఫాకీలతో కాల్చిగాయపరుస్తాను.... తిండి పెట్టకుండా చాలా రోజులు హింసించి వాటి అవసరం తీరిన గిరిజన యువతులనీ, నమ్మకద్రోహం చేసిన నా మనుషులనీ శవాలు అందచేసి మనిషి రక్తం రుచి చూపిస్తాను __ అంటే మనిషిని రక్షించే డ్రగ్స్ తోపాటు మేనీటర్స్ ని ఇలా ఉత్పత్తి చేసి ఈ అరణ్యం సరిహద్దుల్లోవిడిచి పెడతా నన్నమాట.... ఇంకేముంది... ఏ చైతన్య కధ అయినా ప్రభుత్వం తాలూకు ఏ ప్రయత్నమైనా ఆ పోలిమేరల్లోనే ముగిసిపోతుంది. చాల బాగుంది కదూ..." క్షణం ఆగాడు. "సో... నౌ... యూ డిసైడ్.. సక్కరింస్తావో, చస్తావావు నీ యిష్టం... తొందరలేదు... నీ అవసరం నాకుంది కాబట్టి వెంటనే చంపెయను.... కావాలంటే కొన్ని రోజులు గడువు తీసుకో!"
నవ్వాడు తోడేలులూ!
విభ్రమంతో నిలబడిపోయినవిజయ కిదంతా కలలా వుంది....ఇంత తెలుసుకున్నా విజయకి పాణి పలుకుబడి ఏంటదాకా విస్తరించిందో అసలు తెలీదు!
అడవిలోగంజయివానాన్ని చూసిన చైతన్య రాజధానికి ఒక నివేదికపంపింది యిరవై నాలుగు గంటల క్రితమే....
ఆ నివేదిక వివరాలు నారక్టిక్స్ కంట్రోల్ బ్యూరో సౌత్ జోన్ డిప్యూటీ చీఫ్ కన్సర్వేటర్ అందించింది. వెంటనే ఇంటల్లిజెన్స్ ఆఫీసరు దీక్షాదేవీని పరిసోదానార్ధం పంపాలని నిర్ణయించబడిందీ కొన్ని గంటల క్రితమే.
అయినా అదంతా పాణి తెలుసుకోగలిగాడు.....
అతడికున్న'సంబందాలు' అంత పటిష్టమైనవి__
* * * *
"అయ్యా..... " స్వామి పిలుపులో తల పైకెత్తి చూసాడు రైఫీల్ క్లీన్ చేస్తున్నా చైతన్య.
"ఈ రెస్ట్ హావుస్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ దే కదయ్యా....."
ఇన్నాళ్ళ తరువాత ఈ సందేహమేమిటో అర్ధం కాలేదు చైతన్యకి .
ఏ విషయాన్నీ సూటిగా చెప్పడం అలవాటు లేని స్వామి చివరగా మధ్యాహ్నం కావస్తుంది భోజనానికి రండీ లాంటి ప్రయోగాలతో చర్చముగిస్తాడని తెలిసి అన్నాడు చైతన్య...."ఎస్! మన డిపార్ట్ మెంట్ దే...."
"అవును కదయ్యా.... మరి అలాంటి రెస్ట్ హౌస్ లో వేరే డిపార్ట్ మెంట్ వాళ్ళు వుండోచ్చా..."
"అవసరాన్ని బట్టి..."
ఆడవాళ్ళయినా సరేనా అయ్యా..."
చికాకనిపించింది చైతన్యకి "నువ్వాడగాలనుకుంటున్నదేమిటి...?"
"ఇది అడవి కదయ్యా... అందులోనూ పులులు తిరిగే క్రూర మృగాల మధ్య వున్న గెస్ట్ హౌస్ య్యా... అందులో అడవాళ్ళుండటం సమ౦జసమా అని....?"
"ఇప్పుడెవరున్నారని...?"
"ఇప్పటిదాకా ఎవరూ లేకపోయినా ఇక ముందు వుంటే ఎలాగా అని..."
సహాసం నశించి పోయింది. "సోది మాని సూటిగా పాయింట్ కిరరాదూ..."
"ఈ రెస్ట్ హౌస్ లో వున్న రెండు బెడ్ రూమ్స్ లో ఇన్నాళ్ళూ ఓ బెడ్ రూమ్ ఖాళీగానే వుందయ్యా... ఇప్పుడు దానికీ పాణి పడింది."
"స్వామీ"
"కోపగించుకండయ్యా.... అందులో ఓ అడ ఆఫీసరు అడుగు పెట్టిందయ్యా..."
నొసలు చిట్లించాడు చైతన్య "ఎవరూ..."
"దీక్షా దేవిగారయ్యా."
మెదడు మేద్దుబారినట్టు క్షణం నిలబడిపోయిన చైతన్య అప్పటికి విషయం అర్ధం కావడంతో వెంటనే గది దాటి బయటకి వచ్చాడు.
కారిడార్ ని అనుకుని బెడ్ రూమ్ నుంచి హాల్లోకి వెళుతూ ఆగింది దీక్ష.
"హల్లో" విష్ చేసాడు చైతన్య ముందుగా.
బ్లూకలర్ షిఫాన్ శారీలో చాలా అందంగా కనిపించింది. "ఇట్స్ సర్ ప్రయిజ్!"
మామూలుగా అయితే చాల దూరం నుంచి వచ్చిన దీక్ష సరాసరి చైతన్యలో మాట్లాడిగానీ తనకు కేటాయించిన బెడ్ రూమ్ లో అడుగు పెట్టిక పోయేది కానీ చైతన్య విషయంలో చాలా జంకుగా వుంటుంది. అయినా ఆలంటీదేమి లేదన్నంత నిర్మోహమాటాన్ని ప్రదర్శించాలనుకుంటూనే దొరికిపోతూవుంటుంది.