వైధేయ విష్ చేసాడు గొంతు తడారిపోతుంటే.
అతడ్ని పట్టించుకోని కిరణ్ "పెళ్ళి చేసుకున్నవా" అసహస్యం చేస్తున్నట్లుగా రోషణి వేపు చూస్తూ అడిగాడు.
"ఆహా! పిల్లల్నీ కనాలనుకుంతున్నాను....నిజమ్మిస్తర్ కిరణ్. ఇష్టమైనంతకాలం ఇష్టమైంది ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకుంటూ కలసి బ్రతకడంతో వున్న అనందం పెళ్ళనే బధంతోనే సాధ్యమయ్యేదంటే నేనమ్మను."
కిరణ్ బదులివ్వకుండా ఆవేశంగా రెస్టారెంట్ లోకి నడిచ్క్యాడు.
అయితే అతడు వెళ్తూ వైధేయని అదోరకంగా చూసిన చూపు వైదేయలోఎంతటి సంచలనాన్ని రేపిందంటే.....
* * * *
"నన్నెందుకు పరిచయం చేసావు" నిలదీసాడు రోషణ్నిఇంటికి చేరగానే....... నా మానాన్న నేను బ్రతికేవాడ్ని... అసలు అసలు నువ్వు నా జీవితంలో ఎందుకు ప్రవేశించావు......ఇదంతా యేమిటి. నేనేపై పోతున్నాను...."
ఆపాదమస్తకం ఉద్వేగంతో వూగిపోతున్నాడు వైధేయ.
కొన్నిక్షణాల వరకూ అతడ్నే తేరిపార చూస్తూ వుండిపోయింది.
"అంటే నా మూలంగా నువ్వు చాలా నష్టపోతున్నావా వైధేయా" సూటిగా ప్రశ్నించింది. "అంత ఇష్టంలేనివాడివి దూరంగా జరిగిపొమ్మని ఒక్కమాటంటే సరిపోతుందిగా"
"అదికాదు రోషణి! నాకు...నాకేదో భయంగా
"మిస్టర్ వైధేయా! ఈ ఆలోచన నీకు ఆదిలో కలగాల్సింది"
"కలిగింది కాబట్టే ఆదిలో కాదన్నాను......"
"అన్నావే కాని ఆచరణలో ఎందుకు పెట్టలేకపోయావు" నిర్నేమేషంగా చూసింది. "నేను నీకు కావలనిపించింది. అందుకే నీకిష్టంలేకపోయినా ఒక సాహాసానికి సిద్దపడ్డావు.....కదా"
రెండుచేతులతో తల పట్టుక్కూర్చున్నాడతను.....
"మిస్టర్ వైధేయా? ఎకానమీ ఈజ్ టూ లేట్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ది నర్స్"
చివాలున తల పైకెత్తాడు.
"అవును వైధేయా.నేను ఇప్పుడు నీకు స్నేహితురాలినైనా నిన్నటి నేరస్థురాలని. కాబట్టే నీకు దూరంగా వెళ్ళడమే మంచిది." కొంచెం ఆగింది. నిట్టూర్చుతూ "కిరణ్ కి నిన్ను నిజానికి పరిచయం చేసింది కేవలం అతడ్ని రెచ్చగొట్టాలని ఆ విధంగా క్షణం పాటైనా నేను తృప్తి పడాలని మాత్రమె...... ఆసమయంలోంతకన్నా నేను ఎక్కువ అలోచించలేక పోయాను..... పొరపాటే వైధేయా ..... ఇప్పుడు పోలీసువాళ్ళ దృష్టిని నీమిదకి మళ్లించిన నా తప్పిదానికి మన్నించు.... శలవ్."
అమే వేళ్ళాటానికి ఉద్యుక్తురాలైంది.
కొన్ని లిప్తలపాటు అలాగే కూర్చున్న వైధేయ తర్వాత ఏమనుకున్నడో "రోషణి" అంటూ ద్వారాన్నిచేరి ఆమెకడ్డంగా నిలబడ్డాడు.
"నో....."ఆమె చేతులు పట్టుకున్నాడు.....
అలా ఎన్ని క్షణాలు నిలబడ్డారో వారికి గుర్తులేదు......
ఓ పసిపిల్లవాడిలా చాలా సామాన్యంగా కనిపిస్తున్న వైధేయనిచూస్తూ హాఠాత్తుగా నవ్వేసింది....... "ఏంటది వైదేయా...."
అతడు మాట్లాడలేదు......కాడుమన్సులోని భావానికి మాటలు కూర్చలేక మధనపడుతున్నాడు.
"ట్రాన్స్ కార్శియల్ ఎఫాసియా....."
"అంటే...." ఉడుకుమోత్తనంగా అడిగాడు.
"తర్వాత చెబుతాను......"
"ఇప్పుడే చెప్పాలి......"మొండికేసాడు.
"తప్పదా...." మృదువుగా అతడి చెంపల్ని తాకుతూ మరింత దగ్గరగా జరిగింది.
"ఏ విషయాన్నయినా అందంగానే కాకుండా స్పష్టంగా చెప్పగలిగే వారు రచయిత మాత్రమె..... మనసులో నన్ను వదులుకోకూడనిపిస్తుంది నీకు.....మెదడు నన్ను బయటకి తరిమేయమంటూ౦ది...... ఈ రెండు సందిగ్డావస్థలకి ఒకేమారు నలగిపోతున్న నువ్వు ఏ భావాన్ని ముందు వ్యక్తం చేయాలో తెలీక కమ్యూనికేషన్ గేఫ్ క్రియేటమవుతుంది....."
"ఇప్పుడు నువ్వు చెప్పిన దానికీ ఇందాక నువ్వు అన్నదానికీ సంభంధంమేమిటి"
"అదే వైధేయా....ట్రాన్స్ కర్శియల్ ఎఫోసియా అంటే......"
మెత్తని ఆమె గుండెల్లో ప్రశాంతిని వెదుక్కు౦టున్నట్టు అతడి మోహం నెమ్మదిగా కదులుతూంది.
అతడిలోని ప్రకంపన ఆ స్పర్శతోనే రోషణికి అర్దమౌతుంటే వేళ్ళతో జుట్టును సవరిస్తూ "వెళ్ళిపోయమంటావా వైధేయా ...... " లాలనగా అడిగింది......
మోకాళ్ళపై కూచున్నా వైధేయ మరింత తమకంతో ఆమెను హత్తుక్కూంటూ "నో...... వద్దు" తడబడుతున్నాడు"
"ఇక్కడేనా...." అయిష్టంగానే నేలపైకి ఒరిగింది.
"చెప్పు రోషణి.ఇప్పుడేం జరగబోతూంది...." త్రోటుపాటుతో అడిగాడు.