Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 33

    పదిహేను అడుగుల దూరంలో దిగువుగా చదునుగా వున్న నేలపై చిందిన రక్తపు బోట్లు.

    నెమ్మదిగా నడిచాడు.
   
    ఇప్పుడే ఆరిపోయిన ఒక దీపపు చమురులా ఇంకా తడి అరణి ఒక బంధానికి  ఉదాహరణలా అనిపిస్తుంటే ఉత్తర దిక్కున ఇసుకబాటలోఅడుగు పెట్టాడు.
   
    నేలపై పులిపాదాల గుర్తులేకాక దూలి పెనుగులాటలో ఇసుకలోజీరాడిన చేతివెళ్ళ జాడలూ కనిపించాయి. అడుగులో దిగువుగా నడిచాడు.
   
     అసాధారణమైన వినికిడి శక్తిగల పులి ఓ ఎండూటాకు నలిగిన చప్పుడ్ని సునాయాసంగా గుర్తిస్తుంది.
   
    మరో వందగజాల తర్వాత దక్షణాన ఎత్తుగావున్నగుట్ట..... ఉత్తరంవేపు అనంతంగా విస్తరించిన దట్టమైన అడవి.
   
    ట్రాకింగ్ లో ప్రమాదకరమైన చివరిఘట్టానికి  సంకేతంలా ఎదురుగా ముళ్ళకంచేలపై రక్తసికమైన దూళి, చీర పీలికలు కనిపించాయి.
   
    గగుర్పోడిచే నిశ్శబ్దం....
   
    ఇంతలోదూరంగా ఓ కుంజు కేక....
   
    సమీపంలోనే ఎక్కడో పులి దాగివున్నదనడానికి సాక్ష్యం అదే.
   
    అతడి నమ్మకం తప్పుకాదు.
   
    చాలా దగ్గరలో ఎముకులు విరుగుతున్న చప్పుడు.
   
    పక్కనున్న ఓ బండరాయి పైకెక్కి చూసాడు.
   
    అప్పుడు కనిపించింది నూటయాభై గజాల దూరంలో ఓ సాల వృక్ష దుగువున శవం పొట్టలోకి కొరల్ని దించుతూ పులి ఉన్మాదంగా ఆకలి తీర్చుకుంటుంది.
   
    రైఫిల్ రేంజ్ కే చేయడానికి అనుకూలం కాని స్థితిలో అర నిమషంపాటు అలాగే  నిలబడిపోయిన చైతన్య అంతలోనే పులిశవాన్ని ఓ పొదమాటుకు ఈడ్చుకెళ్ళి కొన్ని ఆకుల్ని పంజాతో నేట్టడాన్ని చూశాడు.
   
    తను చంపిన 'ప్రే' కోసం పులి తిరిగి వస్తుందనాదానికి బలమైన సాక్ష్యమీదే.
   
    సాలోచనగా అతడు చూస్తుండగానే పులి అడవిలో అదృశ్యమై పోయింది.
   
    శవం వున్న ప్రదేశానికి కుడిప్రక్కగా రెండు మద్దిచెట్లు కనిపించాయి. మంచే నిర్మించడానికి గానీ, మాటు వేయడానికి కానీ అంతకుమించి ఆధారాలు లేవు.
   
    ఆకాశంలో సూర్యుడు పశ్చిమం వేపు జారిపోతుంటే రెస్ట్ హౌస్ కి తిరిగి వచ్చాడు చైతన్య.
   
    శవాన్ని వెంటనే తరలిస్తామని మొండికేసిన మృత్యురాజుసీ అతడ్ని అనుసరించి వచ్చిన గిరిజనుల్నీ ఒప్పించడానికి చాలా శ్రమపడ్డారు చైతన్య.
   
    ఇదే పట్టుదలని రమాకాంత్ విషయంలో కూడా చైతన్య పాటించి వుంటే మరోలా వుండేదేమో.
   
    తనూ ఆ రాత్రికి చేతన్యతోబాటు వేటకి వస్తానని రమాకాంత్ ఉత్సాహం అర్ధం చేసుకున్నా ముందు యదాలాపంగా కూడదన్నాడు.
   
    ఈ అవకాశం చేజారితే ఇక తిరిగి రాదనుకున్నాడు. తనఆసక్తిని అర్ధం చేసుకున్న చైతన్య మెత్తబడేట్టు మాతాలాలనుకున్నాడు. తెలివిగా డీల్ చేశాడు.
   
    "సర్" చివరి అభ్యర్ధనగా అన్నాడు రమాకాంత్.
   
    "మా తాతగారు చనిపోయిన ఇంట్లోనే మా నాన్నగారు పోయారు.  మ నాన్నగారు పోయిన ఇంట్లోనే మా అమ్మ జబ్బుపడి ప్రాణాలు వదిలింది. కాబట్టి ఇందరు చనిపోయిన ఇంట్లో నేనేరా వుండాలీ అంటూ ఆ ఇంటీని చూసి నన్ను భయపడుమంటారా?"      
   
    చైతన్య అన్న మాటలని చైతన్యకే అప్పజెప్పడంతో ఇక అంగీకరించకుండా వుండలేకపోయాడు.
   
    మరోఊహించని అధ్యానానికి కారణమైందదే.
   
                                                        *    *    *    *
   
    శిధిల నిశీధి కక్కిన నీరవత నిండిన అర్దరాత్రి......
   
    అపరాత్రి దాటిన దుర్గ మారణ్యం కత్తివాటుకి తెగిన స్వరపెటికలా నిశ్సబ్దంగా వుంది.
   
    రాత్రి గుండెలపై తేలిన మంటల్లా మిణుగురులు కదులుతున్నాయి. ఆకాశంలో వెన్నెల చెట్లకొమ్మల్నిదాటి రాలేక పొడల్లా నేలకి జరుతూంది.
   
    రాత్రి పక్షుల చప్పుడు సైతం వినిపించని స్తబ్ధతలో......
   
    నేలకి పదిహేను అడుగుల ఎత్తున మద్దిచెట్టుకొమ్మల్లో కూర్చున్న చైతన్య సుమారు తొంభై అడుగుల దూరంలోకి దూలి శవాన్నే తదేకంగా చూస్తున్నాడు.
   
    అప్పటికి అలా కూర్చుని ఆరుగంటలు కావడంతో కాళ్ళు తిమ్మిరెక్కిపోతున్నాయి అయినా ఓ తపస్సు లాంటి ఏకాగ్రత.
   
    ప్రక్కనే రమాకాంత్ చేతిలో తార్చితో, ఇప్పుడు వెలిగించాల్సిందీ చెబుతానన్న చైతన్య ఆదేశం కోసం నిరీక్షిస్తున్నాడు.
   
    క్షణాలు గడుస్తున్నాయి ఉత్కంఠంగా.
   
    ఒకవేళ పులి తాము మాటేయడం గమనించే శవం దగ్గరకీ రాలేదేమో అన్న అనుమానం చైతన్యని కలవర పరుస్తున్నా ఇంకా సహనంగా నేలపై పోదల్నే గమనిస్తున్నాడు.
   
    ఎక్కడో నిద్రలో తూగే నాగరిక జీవినానికి దూరంగా ఇలా ఒక నిశ్శబ్దపు చీకటిరాత్రిక్రిఇరమృగాల స్థావరంలో ప్రమాదాన్ని ఆహ్వానిస్తూ కూర్చోవడం ఏ వ్యక్తీ సహజంగా కోరుకొనిదైనా చైతన్య ఈ కలశాన్లోనూ అలా అలోచించడంలేదు
   
    బహుశా అదే అతడికింత ఖ్యాతిని పట్టిందేమో కూడా.
   
    వేనువెంటనే దభీమంటూ నేల పడినచప్పుడు హాఠాత్తుగా అడవినిభయానకంగా  మార్చింది.
   
    మోకాళ్ళు నొప్పి పెడుతుంటే కదలబోయి విభాయించుకున్న రమాకాంత్ ఉలికిపడ్డాడు ఆకాశంలోని  తీతపు కేకతో.....
   
    అదికాదు .
   
    ఉన్నట్టుండి అరణ్యంలో సందడి మొదలయింది.
   
    సమీపంలో ఓ కణుసు కేక.....
   
    పులి ఏమూలంనుంచో కదలి వస్తూందని గ్రహించిన చైతన్య రైఫిల్ ని నెమ్మదిగా పైకెత్తి చిక్కటి చీకటిలోకి కళ్ళు చిట్లించి  చూస్తున్నాడు.
   
    విష పురుగులతో, వన్యమృగాలతో నిండిన  అరణ్యంలో ఏక్షణం ఎలాంటి ఉవద్రవాన్ని తీసుకువచ్చేదీ చైతన్య  సైతం ఊహించలేని విషయమే.
   
    అసలు మేనీటర్ గా మారిన మరో చిరుతపులి అడవిలో సంచరిస్తుదని చైతన్యకీ అంతవరకు తెలీదు.
   
    అప్పటికే వెనుకవున్న మర్రిచెట్టు పైకేక్కిన  చిరుత చప్పుడు చేయకుండా ఇద్దర్నీ చూస్తుంది అదను కొసమన్నట్టుగా.
   
    సుమారు పదిహేను అడుగుల నిడివిని సైతం దూకగల చిరుత పులికి తోమ్మిదడుగుల దూరం కష్టం కాలేదు.
   
    ముందు అడవి దద్దరిల్లేటట్టు  గాండ్రించింది.
   
     ఏం జరుగుతూందో గ్రహించేలోగానే ఇద్దరు ప్రత్యర్ధులున్న కొమ్మలపైకి లఘించింది.
   
    అంతే......
   
    ముందు ఆర్తనాదం .....
   
    కడ్రాటలా బిగుసుకుపోయాడు చైతన్య.
   
    అతడు చూస్తూనే వున్నాడు.
   
    చిరుత పంజా దెబ్బకి నేలపైకి జారిన రమాకాంత్ తనను తాను రక్షింకోబోతుండగానే చిరుత కోరలు అతడి కంఠంతో గుచ్చుకున్నాయి.

 Previous Page Next Page