"ర...మా....కాం....." చైతన్య ఆక్రందన గొంతులోనే సమాధి అయిపోయింది.
పట్టుతప్పి కొమ్మల్లోనుంచి క్రిందకి పడిపోతున్న రమాకాంత్ ఆసరాగా చైతన్య రైఫీల్ మజిల్ ను పట్టుకోవడం, రైఫిల్ అతడితోపాటు తుప్పుల్లో విసిరేయబడమూ చైతన్యని ఎంత నిస్సహాయుడిగా మార్చిందీ అంటే ఏం చేయాలో వెంటనే పాలపోలేదు.
వ్యవధిలేదు..... ఒక స్నేహితుడి కధ నికృష్టంగా తన కళ్ళముందే ముగిసిపోతూంది.
బడలిక, నిస్రాణ, చైతన్యని కుదిపేస్తుంటే గభాలున తనూ క్రిందకి దూకాలనుకున్నాడు....
అదిగో అప్పుడు చూశాడు.
నోటచిక్కిన రమాకాంత్ తో పొదల్లోకి దూసుకుపోతున్న చిరుతని మాత్రమె కాదు.
ఎక్కడనుంచి వచ్చిందో పెద్దపులి ఇప్పుడు నేలపై నిలబడి చైతన్యనే చూస్తూ మరో గెలుపు కొసమన్నట్టు గుర్రు పేడుతూంది.
ఉండుండీ భీకరంగా గాండ్రించిన పులి అమాంతం కొండపైకి చార్జి చేసింది.
పైకోమ్మను పట్టుకున్న చైతన్య గభాలున మీదకి ప్రాకాడు.
దబ్ మని నేలపై పడిన మేనీటర్ సహనం నశించిపోతుంటే ఉరుములా మరోమారు గాండ్రించింది.
నిశిరాత్రి అడవి దద్దరిల్లిపోతూంది.
చెట్లపై నిశ్రమించిన పక్షులు గూళ్ళని వదలి కాకావికలౌతున్నాయి.
మేనీటర్ ఆగలేదు.
పదిన్నర అడుగుల పొడవున్న పులి పన్నెండు అడుగుల రెడియాస్ గా పంజాను చాపుతూ ఇంకా ప్రయత్నిస్తూనే వుంది.
ఎగిసిపడే సప్తజిహ్వాని శత వాల్కల్లా చెవులు హొరేత్తించేకంచు నగరాలా అలసిపోకుండా సాగిన పూరి విశృంఖల విహారం మరో నిముషం తర్వాత చప్పున ఆగిపోయింది.
పగబట్టిన కళింగనాగులా ప్రత్యర్దివేపు క్షణం చూసిన పెద్ద పులి, మరోమారు కలుసుకుందామన్నట్టు చివరిగా గాండ్రించి అంతలోనే'దూళి' శవంతో చీకటిలోకి పరుగెత్తింది.
తడారిన గొంతులో నిర్లిప్తంగా వుండిపోయాడు చైతన్య.
ఏమూల నక్కిందో తెలీని పులి ఎక్కడ ఆహారంగా మారిన రమాకాంత్ __ నేలపై తుప్పుల్లో జారిన రైఫిల్ ....
గుండెలపై శూలంగా గుచ్చుకుంటున్న శబ్దం.....
ఓటమికి కాదు అతడు కలత చెందుతున్నదీ పోరాటానికీ సిద్దపడ్డ ఇద్దరు ప్రత్యర్దులూ కోరేది గెలిపే అయినా అందులో ఒకరు ఓడటం తప్పనిసరి. అయినా ఇంత నిస్సహాయంగా తను తల వంచాల్ని వస్తుందని వూహించకలేకపోయాడు.
కసి, క్రోధం. అతడ్ని పిచ్చివాడ్ని చేస్తుంటే ఓ కాళరాత్రిలా గడిపాడు తెల్లవార్లూ....
ఏ ప్రమదాన్నో పసిగట్టిన స్వామి గిరిజనుల అండతో తెల తెల వారుతుండగా వచ్చాడక్కక్కడికి.
విశ్వాసం కలిగించలేని ఓ నగరికుడిలా గిరిజనుల కళ్ళలోకి చూడలేని చైతన్య.
సూర్యుడి లేత కిరణాలు శూలల్లా ఒంటికి గుచ్చుకుంటు౦టే కలలోలా తూర్పు దిక్కుకి నడిచాడు.
జరిగింది భోధపడిన స్వామి మౌనంగా అనుసరించాడు తప్పమాటడలేకపోయాడు.
దేశంలో పేరెన్నిక గన్న ఒక ప్రముఖ వేటగాడైన చైతన్యనిలా చూడడం, చూడాల్సి రావడం దురదృష్టమే.....
ఓదార్పు కందని స్థితిలో జ్ఞానంలా జ్ఞేయంలా జ్ఞానగమ్యంలా సాగిన చైతన్య ఆగాడు ఓచోట......
అదిగో అప్పుడు కనిపించింది రెల్లుపొదల మాటున రమాకాంత్ శవం.....
నేలపై నడిన ప్రేవుల్ని మేలిపేట్టేబాధని కలిగిస్తుంటే ఎంతసేపు దాగానమ్మా అంటూ ఓ నీటిబొట్టు చైతన్య కనుకిలకుల్లోకి ఉబికింది.
తెరచుకునివున్న రమాకాంత్ కనుపాపలు, చిరుతకోరలు కడుపులో గుచ్చుకున్నప్పటికి బాధను వ్యక్తం చేయడం లేదు.
ఇంత మూల్యం చెల్లించినా ఓ చిన్న అనుభవాన్ని దక్కించు కున్నప్రశాంతతోనే వర్షిస్తున్నాయి. ....
ఎంత స్వల్ప పరిచయమది..... అయినా లోతుగా మనసు పోరల్లోకి చొచ్చుకుపోయాడే.
ఇదేమిటి...ఎంతో నమ్మి తనతో వస్తే ఇంత నిస్సహాయంగా చేజార్చుకుపోడే౦....
నెమ్మదిగా శవాన్ని సమీపించి తలనిచేతుల్లోకి తీసుకున్నాడు.
"రేపు కధగా చెప్పుకోవడానికి వేటలో చిన్న అనుభవన్నయినా దక్కించుకొనివ్వరూ అంటూ నాకు నచ్చచెప్పి నాతోవచ్చిన న ప్రియనేస్తం..... నువ్వే నాకో స్మృతిగా మిగిలిపోయావెందుకని ఎందరు చనిపోయినా ఇల్లు వదిలిపెట్టగాలమూ అంటూ అమ్మ నాన్నల గురించి చెప్పిఈ అరణ్యకాండలోనువ్వు సమసిపోతూ బ్రతికినంతకాలం ఇది తిరుగుతూ ఓటమిలా నన్ను పరిహసించె దురదృష్టాన్ని ఎందుకు కలిగించావు..... నీ కొడుక్కి నా పేరు పెట్టుకుంటానన్నావు. సహాసానికి నేనో ప్రతిరూపాన్నిఅని సన్నితంగా పోగిడావ్.... నేను సామాన్యుడ్నే అని నచ్చచెప్పాలనుకుంటే నువ్వెందుకు లేకుండా పోయావు...."
మధ్యాహ్నానికల్లా రమాకాంత్ మరణ వార్త తెలిసిన పోలీసులు అరణ్యంలో అడుగుపెట్టారు
జిల్లా ఎస్పీ జరిగిన దానికి పూర్తిగా చేతన్యే బాధ్యుడంటూ ఆవేశంగా అరిచాడు...... భరించాడు అగీకారంలా.