Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 32

    "అలా మొత్తం తినేస్తుందా?"
   
    "ప్రతి అనుభవమూ ఓ కొత్తపాఠంగా మారే అరణ్యాలలోఇలాగే జరిగితీరుతుందనీ ఇదమిత్ధంగా తేల్చి చెప్పలేం కళేబరాన్ని పూర్తిగా తినే అవకాశం లేదనీ అనుకునేవాడ్ని. కానీ రక్తమరకలతోవున్న శవం పైబట్టని విడిచి పెట్టకుండా మేనీటర్ తినగలదనీ శ్రీశైలం అడవుల్లో నేను తెలుసుకున్న నిజం. క్షుద్భాధతో ప్రారభమైన నార మాంసభక్షణ పెద్ద పులి ప్రవర్తనలో ఎంత అసాధరణమైన మార్పుని తీసుకువస్తుందీ అంటే శవాన్ని పొదల్లో కేరియన్ యానిమల్స్ దరిచేరనివ్వదు. కసి : ఉన్మాదం!! ఇక ఏ మేనీటర్ నయినా మరింత క్రూరంగా మార్చేవి. సో..... మేనీటర్ ఉనికిని తెలుసుకునే ప్రయత్నంలో ఒక మనిషిని మరణం కోసం ఎదురుచూడడం కన్నా 'బెయిట్స్,' ని వాడాలనుకుంతున్నాను."
   
    పశ్చిమాన అడవిలో నుంచి ఓ కణుసుకేక వినిపించింది.
   
    వెనువెంటనే అంగూర్ చప్పుడు......
   
    పులిలాంటి క్రూరమృగం తాలుక ఉనికిని తెలియజెప్పే సూచనలవి......
   
    చైతన్య సాలోచనగా ఆ శబ్దాలు వినవచ్చే దిక్కుని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాడు.
   
    ఇదేమి పట్టించుకొని స్థితిలో అడిగాడు " అంటే ...... మేకనో, అవునో మేనీటర్ తిరిగే ప్రాంతంలో చెట్లకు కట్టి ఏ రాత్రివేళనో అది వచ్చేవరకు మాటువేయడాన్ని 'బెయిట్స్' పద్దతి అంటారేమో కదూ...."
   
    ఉన్నట్టుండి అరణ్యంలో అలజడి మొదలైంద.

    చైతన్య ప్రమాద సంకేతాన్ని అంచనావేస్తూ పడమటి దిక్కురి నడక ప్రారంభించాడు.
   
    రమాకాంత్ ఏదో అడబోతుంటే చప్పుడు చేయవద్దన్నట్టు సంజ్ఞచేశాడు.
   
    అదిగో.... సరిగ్గా అప్పుడు వినిపించింది పులి గాండ్రింపు .
   
    రమాకాంత్ కట్రాటలా నిలబడిపోయాడు.
   
    వేణువెంటనే ఆగ్నేయ దిశనుంచి ఆర్తనాదాలు, అక్రందనలూ .... భూమి ప్రకంపించే పద ఘట్టనలూ.
   
    చాలా సమీపంలోనే మారణకాండ మొదలైనట్టు అర్ధమైన చైతన్య ఆగలేదు.
   
    రెండు పర్లాగుంల దూరం డొంకలను అదిగామిస్తూ, ముళ్ళకంచేలను దాటుకుంటూ మిస్సైల్లా దూసుకుపోయాడు
   
    సుమారు పదిమందివరకు రెండుపదుల వయస్సుదాటని గిరజన స్రీలు పరుగెత్తుకోస్తున్నారు అభిముఖంగా.
   
    ఒక భయానిక దృశ్యాన్ని చూసిన అలజడి వారి కళ్ళలో....
   
    "అయ్యా..." ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరిరైపోతూచెప్పుకుపోతుందోయువతి "ఎండుకకట్టేలకోసం ఎల్లమంద తోట కాడికెళ్ళామయ్యా కొందరం పుల్లలేరుతుంటే, మరికొ౦దరు బుంగల్లో గడ్డి నింపుతున్నాం. ఎడనుంచోచ్చిందో పులి రక్కసినెట్టు కొమ్మమీదున్న దూలీని కాళ్ళందుకుంది. మాక్లముందునుంచే నోట కరుసుకుని వారిపోయింది"
   
    అప్పుడు చూశాడు..... నిశ్సబ్దంగా చైతన్య పాదాల్ని చుట్టేసిన ఓ యువతి కన్నీళ్ళతో అభిషేకిస్తూ , ఏదో చెప్పలని అందోళనగా కనుపాపల్ని కదిలిస్తూ చెప్పలేకపోతోంది.! 
   
    పైకి లేవదీస్తుంటే అన్నారెవరో ......
   
    "మూగదయ్యా అది.....రాలేనక్కా అంటే దూలీని బలవంతంగా అడవికి తీసుకొచ్చిన కొల్లి ఇప్పుడు చెల్లి కోసం ఆరాటపడుతున్నదయ్యా... సేతిలోకొడవలితోపులియెంటపడి పది బారల దూరం పరిగెత్తింది. యెల్లి పో అక్కా యెల్లి పోయే అన్న దూలీ అరుపులు ఇంటూ యేనక్కి వచ్చిసింది."
   
    పెగలని గొంతు పంజరంలో దాచుకున్న మమకారపు ఉరుములూ నిస్సహాయపు పిడుగులూ ఆమెను కలిచివేస్తుంటే దీనంగా చైతన్య  చేతులు పట్టుకుని చేతులుజోడిస్తూంది.
   
    ఒక అక్క బ్రతికివుండని చేల్లికోసం పిచ్చినమ్మకంతో చేస్తున్నాప్రత్నమిది...... చావని నమ్మకాన్ని భ్రాంతిగా మలుచుకుని గండిపడిన దుఃఖపు  కెరటాలను వారధి వేయమని చెబుతున్న అమాయకపు అరాటం....
   
    జాప్యం చేయదలచుకోలేదు.....
   
    మృత్యువుతో పోరాడి ఓ మనిషిని  బ్రతికించి తీసుకురాలేనని తేలిసినా మృత్యువు  ఉనికినైనా తెలుసుకోవడానికి ప్రయత్నించడమే అది..
   
    దారుణం జరిగిన పరిసరాల గురించి వివరాలని అడిగాడు తప్పతోడు రానివ్వలేవర్నీ. అప్పటికే కొల్లి వస్తానంటూ సంజ్ఞలతో వ్యక్తచేసింది కూడా.
   
    గిరజన యువతలందర్నీ  గూడెం చేర్చమని రమాకాంత్ తో చెప్పి వ్యవధిలేనట్టు వెంటనే అరణ్యంలోకి నడిచాడు.
   
    చైతన్య మొహంలో ఇప్పుడు ప్రసన్నత లేదు. గెలుపుకన్నా పోరాటమే ధ్యేయంగా భావించిన ఓ సైనికుడి కదలికలోని భావరహిత్యంతో  రెల్లు పొదల్నీ, బొమ్మజెముడు కంపెల్నీ దాచుకుంటూ సుమారు వందడుగులదూరం అధిగమించాడు.
   
    ఎక్కడో దట్టమైన పొదల మధ్య శవంతోబాటు నక్కిన పులిని గుర్తించే ట్రాకింగ్ ఎంత ప్రమాదకరమైనదో వేటలో అనుభవమున్న వాళ్ళకి తప్ప అర్ధంకానిది.
   
    వేటగాడు తనను గుర్తించడం కంటే పులే ముందు వేటగాడ్ని గుర్తిస్తుంది కాబట్టే వేటగాళ్ళ జీవితాలు చాలావరకు ట్రాకింగ్ స్టేజిలోనే అంతమై పోతుంటారు.
   
    నూటయాభై గజాల దూరం ఏటవాలుగా వున్న ప్రాంతాన్ని దాటేక బండరాళ్ళకి అనుకుని వున్నది ఓ సిందూర వృక్షం.
   
    అక్కడే నేలపై పడివున్న గడ్డిబుంగలు..... ఓ మూల తుమ్ముచెట్టుమొదలు దగ్గర ఆస్తవ్యస్తంగా విసిరేటట్టు ఎండుకట్టేలూ, కొడవళూ.....
   
    నేలపై చెల్లాచెదురైనా గడ్డి, పులి నోట చిక్కిన 'దూలి' ప్రాణభీతీతో సాగించిన పోరాటానికి సాక్ష్యంలా వుంది.        

 Previous Page Next Page