వెలిగే సూర్యుడి కాంతి అంతర్గత మారణగీతాల్ని దాచుకున్న ప్రకృతి గుండెపై పసిమిని అద్దుతూంది.
ఇంకా అరని చెట్లపై మంచు బోట్లు అరని బాధితుల గుండె వేదననో, కంట ఒలికిన కన్నీళ్ళనో గుర్తుచేస్తుంటే అతడిని అనుసరించిన రమాకాంత్ సాయంతో సమీపంలోని చాలా గిరిజన వాడల్ని, తండాల్ని కలుసుకున్నాడు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇంకా మారని జీవితాలు అక్కడక్కడా ఎంత నాగరికతను పెరిగినా ఇంకా పెరగని బడుగు జీవితాల ఉదాహారణల్లా బక్కచిక్కిన జాతులూ, గుండెలకు చర్మంలా వేలాడుటున్న తల్లుల స్థానాలనుంచి పాలకోసంవెంపర్లాడే పసికందుల పెనుగులాటలు.... ఇవే.... అన్నిచోట్లాదర్శనమిస్తాయి.
అరణ్యవాసాలగురించి చైతన్యకి తెలీనిదేముందని.
మృగాల బారినుంచి మనుషుల్ని కాపాడగలనని చేప్పగలడు తప్పఏ మూలనుంచోపైకి దుమికే ప్రమాదాలకి ప్రతిచోటా తనేలా గండి కట్టగలడని.
అదికూడా కాదు __ అంతకుమించిన ఆకలి బాధనుంచి తను ఎలా ముందు రాత్రిచూసిన సెలయేటి ఒడ్డుకు చేరుకున్నాడు.
క్రూరమృగాల అడుగుజాడల్ని గుర్తించడంలో గల అనుభవం ఆ వన కిన్నెరా పాద ముద్రల్ని పట్టుకోవడంలో ఏ కొంచమైనా సాయపడుతుందా? అర్తిగా చూశాడు..... చదునుగా వుంది తప్ప ఆధారాలు లేవు.
"ఏమిటి....." ఏంటి వెదుకుతున్నారు?" రమాకాంత్ అడిగాడు.
ఏది చెప్పడానికి సంశయించని చైతన్య ఇక్కడచూసిన సంఘటన గురించి తెలియజెప్పలేకపోయాడు.
అదే చైతన్యని మరింత వేడుకుతున్నారు?" రమాకాంత్ అడిగాడు.
ఏదీ చెప్పడానికి చైతన్య ఒక్కడ చూసిన సంఘటన తెలియజెప్పలేకపోయాడు.
గుండె మీటిన విచిత్ర విపంచికలా కనిపిమ్చిమయమైన రంగుల హరివిల్లులా మాత్రం గుర్తున్న ఆ యువతినిజమే, కాదో అన్న మీమాంసఅతడ్ని మూగవాడ్ని చేసింది.
"రాత్రి టైగర్ మిమ్మల్ని చార్జి చేసింది ఇక్కదేనా..."
నిశ్సబ్దంగా కదిలాడు జవాబు చెప్పకుండా......
అక్కడికి వంద అడుగుల దూరంలో వున్న గోర్జిని చూస్తూ నెమ్మదిగా తలతిప్పివెదురుపోదల్ని సమీపించాడు.
నేలపై ఆస్పష్టంగా కనిపించిన పులికాల్లగుర్తులు....
వేళ్ళతో చెంపల్ని రుద్దుకుంటూ చుట్టూ కలయచూశాడు. వేళ హెక్టార్ల వైశాల్యంలో వున్న ఇదే అడవిలో ఇప్పుడు మేనీటర్ ఎక్కడో సంచరిస్తూ వుంటుంది.
ఒక రాత్రిలో సుమారు అరవై చదరపుమైళ్ళు విస్తీర్ణాన్ని కవర్ చేయగల పులి ఈ క్షణంలో ఇక్కడ ఏ పొదలోనయినా నక్కి వుండవచ్చు. లేదా మరోపాతికమైళ్ళదూరంలోమనిషిని ఆహారంగా మార్చుకునే ప్రయత్నంలో అవకాశం కోసం ఎదురు చూస్తూండవచ్చు.
అతడి మనోభావాల్ని చదవగలిగినట్టు అన్నాడు రమాకాంత్.... "పులులు చాలావరకూ విప్పతోటల్లో వుండటానికి యిష్టపడతాయుంటారుగా లోపలి వేల్లిచూద్దామా?"
అతడి ఉత్సాహాన్ని అర్ధం చేసుకుంటూ "అంటే ...ప్రత్యక్ష పోరాటానికి సిద్దపడదామంటారు" మృదువుగా నవ్వాడు చైతన్య.
"అది కాదు సర్..... ఇది పగటిపూటగా ..... ఒకవేళ మనల్నిచూసినా ధైర్యంగా బయటకు రాలేదేమో అని....."
"ఈ నియమం పెద్దపులికి వర్తించదు రమాకాంత్." నడుస్తున్నప్పుడు మేనీటర్ జోన్ లో వున్నామన్న విషయాన్నీ చైతన్య మరచిపోలేదు. "మేనీటర్ గా మారిన చిరుతపులిలా పెద్దపులితన వేటని చీకటికి పరిమితం చేసుకోదు. క్రూరమృగాలాగా పిలవబడే రెండూ ఇంచుమించుఒక అలవాట్లున్నవి,ఆహారాన్ని సంపాదించుకోవడంలో ఒకే పద్దతిని అనుసరిస్తాయి. తాము చంపినా జంతువుల్ని కాని,మనుషుల్ని కాని చాలా దూరంవరకు లాక్కుపోగల శక్తిగలవి అయినా వేటలో ఒక సమాయాన్ని ఎన్నికోవు.... దీనికి కారణం రెండు జంతువుల దైర్యంలో వున్న భేదం. క్రూరమృగాలలోచాలా ధైర్యమూ, రాజసమూ గల జంతువు పెద్దపులి. మేనీటర్ గా కనబరిచే పెద్దపులి మనిషి వేటలో అనుభవం పెరిగి సామాన్యంగా మనిషి సంచరించే పగటినే తమ కనుకూలమియా సమయంగామార్చుకుంటుంది. సాధ్యమైనంతవరకూచీకటిలో రెచ్చగొడితే తప్పశ్రాంతినే కోరుకుంటుంది.
కానీ, చిరుతపులి అలా కాదు..... మేనీటర్ గా మారేక కూడా ఇంకా మనుషులంటే భయపడుతుంది. కొన్ని వందలమందినిచంపినా అనుభవ మున్నా కానీ పగటిపూట మనిషిని ఎదుర్కోవడానికి సాహాసం చేయలేక రాత్రివేళ గూడేల ప్రాంతాల్లో గిరజనుల కదలికల్నీ పరిశీలిస్తూ ఒక్కోసారి గుడిసేల్లోకి చొచ్చుకుపోతూ మనుషుల్ని హతమారుస్తుంది..... ఇది థీయరీకాదు. కూమారన్ జిల్లాల్లో సుమారు అయిదువందల మందిని చంపగలిగినఓ చిరుతపులిని గమనించాక కార్పెట్ లాంటి అనుభజ్ఞడయిన వేటగాడు చెప్పిన సత్యం. అయినా వేటలో వేటగాడికి పెద్దపులి కన్నా చిరుతపులి ఎక్కువ ఇబ్బందినీ, సమస్యనీ కలుగజేస్తుంది."
నిశ్శబ్దంగా వింటున్నాడు రమాకాంత్.
ఇద్దరూ ఇప్పుడు వాయువ్య దిశలోవున్న విప్పతోట దాటిసింధూర వనంలోకి అడుగుపెట్టారు.
"ఇప్పుడు ఎక్కడుందో తెలీని పెద్దపులిఉనికిని మీరెలా తెలుసు కోవాలనుకుంటున్నారు?"
"సామాన్యంగా ఒక మనిషి పిలువాతబడి మరణించాక గానీ పులి ఉనికిని మనం గుర్తించలేం కారణం మనిషి శవాన్ని ఏ పొదలోనోదాచిన పులికి అప్పుడప్పుడూ వచ్చి ఆకలి తీర్చుకోవటం అలవాటు కాబట్టి."