చైతని గాయలకి ఫస్ట్ ఎయిడ్ అందిస్తూ చెప్పుకుపోతున్నాడు రమాకాంత్.
ఇదిమోదటిసారి కాదు.అదే వాక్యాలనీ అయిదారు రకాలుగా భావంవచ్చేట్టుగంతన్నరనుంచీ అంటున్నాడు. రమాకాంత్.
తూర్పునుంచి కిటికీద్వారా దూసుకొస్తున్న సూర్యకిరణాలు చైతన్య మొహంపై పడి చిత్రమైనా ఊరటని కలిగిస్తుంటే, తనతో కలసి వేతాదాలన్న తన అభీష్టాన్ని రమాకాంత్ ఏంట గంభీరంగా వ్యక్తంచేస్తున్నాదీ బోధపడిపోయింది.
"ఇట్స్ మార్వేలేస్ సర్...... కిటికీలోనుంచిచీకటి అరణ్యంలోకి చూడటానికే ధైర్యం చాలడంలేదే..... ఒంటరిగా వెళ్ళగలిగే సాహాసం ఎలా చేయగలిగారు. అందులోనూ ఇది మీరనుకున్నట్టు మామూలు అరణ్యం కాదే ....మేనీటర్ మూలంగా పగలే ఎవరూ ధైర్యంగా బయట తిరగ;లేకపోతున్నప్రమాదకరమైన అడవి... అలాంటిది..."
"రమాకాంత్ ..." మృదువుగా నవ్వాడు చైతన్య.
అతడి కళ్ళల్లో రాత్రి సంఘటన మిగిల్చిన క్జాడలుకానీ, గాయమైనా శరీరం తాలూకు అలసటగానీ లేదు.
"మా తాతగారూ చనిపోయినఇంట్లోనే మా మావయ్య చనిపోయాడు అదే ఇంట్లో ప్రమాదవశాత్తూ మాచేల్లీ ప్రాణాలు కోల్పోయింది. కాబట్టి ఇందరు చనిపోయిన ఆ ఇంట్లో నేనెలా వుండాలి అంటూ ఇల్లును వదలి పెట్టగలమూ.... ఇదీ అంతే....."
విచిత్రమైన తాత్వికటదర్శనమిచ్చింది చైతన్య విశ్లేషణలో .... విస్సరిత నేత్రాలతో చూస్తుండిపోయాడు రమాకాంత్.
జీవితాన్ని సాహసోపెతమైన అగాధపు అంచులపై నడిపిస్తూ, అలా జీవిచడమూ జీవితంలో భాగమే అన్నంత సామాన్యంగా మాట్లాడుతూ__ నిజమైన జీవితపు విలువలకి అద్దంపడుతున్న ఓ యువకడిక్కడ తారసిల్లాడు.....
అతడు చెప్పే నిర్వచనాలు చాలు ఏ యువకుడైనా ఆదర్శనంగా తీసుకొవడానికి, బ్రతుకు నందనంగా మలుచుకోవడానికీను.....
"మీ దగ్గర కనీసం పదిరుజులైనా వుంటాను" రమాకాంత్ ఉత్సుకతగా అన్నాడు.
"దేనికీ?"
"నూరేళ్ళు జీవితానుభవం సంపాదించడానికి"
నిర్లిప్తంగా నవ్వాడు చైతన్య __"నన్నో హీరోలా భావిస్తున్నరనుకుంటాను."
"భావించడమే కాదు సర్ అరాదిస్తున్నాను. అంతేకాదు.... నవ్వకండి... మన పరిచయం చాల స్వల్పమే అయినా, నాకు పుట్టబోయే కొడుక్కి మీపేరు పెట్టుకోవాలనుకుంటున్నాను..."
నిర్మలంగా నవ్వేశాడు చైతన్య మళ్ళీ.....
"నమ్మడంలేదు కదూ"
"అదికాదు"
"మరి"
"సన్నితంగా నమ్మినందుకు నవ్వుకుంటున్నాను"
"మీరు అవునన్నా కాదన్నా మీరు రియల్ హీరో..."
"నాకో జోక్ గుర్తుకోస్తోంది."
"చేప్పండయ్యా" అంతసేపూ నిభాయిమ్చుకున్న స్వామి హఠాత్తుగా సమీపంలో చతికిలబడ్డాడు.
"పెరియా వీర్యా అనే ఇద్దరు వ్యక్తులమధ్య అడవిలోని క్రూరమృగాల గురించి, వాటిమధ్య బ్రతికే అడవి జాతులగురించి తెలీదు. అయినా ఒఅకరికంటె మరొకరు ఘనులమని నిరూపించడానికి సిద్దపడ్డారు. అందులో పెరయ్యముండుంనాడట...."
ఇదీ ఆశక్తిగా వింటున్నాడు రమాకాంత్.
"ఏమని...?"
"కోయరాళ్ళు మహాధైర్యవంతులు వీర్యా. ఒకనాడు పాపికొండల్లో తిరుగుతున్నా నేను దాహంవేసి గోదావరి రేవులోకి దిగితె అక్కడ కొందరు కోయ యువతులుస్నానం చేయడం కనిపించింది. ఇంతలో నాతోపటు ఓ పెద్ద పులి నదిలోకి రాగానే ఓ కోయపిల్ల 'పో అవతలకి' అంటూ మొహంమీద నీళ్ళు చల్లేసరికి ఆ పులి గజగజా గట్టెక్కిపోయింది అని. అప్పుడు వీరయ్య ఏమన్నాడో తెలుసా" క్షణం ఆగాడు ఇద్దరి వేపు చూస్తూ.
స్వామి ఉత్కంఠను ఆపుకోలేకపోయాడు.
"ఏమన్నాడయ్యా" స్వామి అర్జెంటుగా జైక్యం చేసుకున్నాడు.
"కోయవాళ్ళంటే మాటలా?"
"నీ తలకాయ ...." ఖండించాడు చైతన్య.
"అది కోయవాళ్ళ గొప్పతనం కాదు."
"మరేంటయ్యా"
"పేరయ్య వీరయ్యాల్లా కోయగలిగిన వల్ల టాలంట్"
"అంటే..." ఇప్పటి చైతన్య ఉద్దేశం అర్ధమయిన రమాకాంత్ వెంటనే అందుకున్నాడు.
"మీ గురించి అంతా చెప్పుకునేది ఇలానే అంటారు.... నో... నేను అఫీషియల్ డేటాతో మీ ఫాన్నై పోయాను. ఇంత మీ గురించి తెలుసుకున్న నేను ఇప్పుడు మరొకటి తెలుసుకాగలిగాను."
"ఏమిటది?"
"మీరు జోక్స్ కూడా బాగా చెప్పాగలరని"
చైతన్య మొహంలోకి భావాలు క్రమంగా మరిపోయాయి__
"నిజానికి అలవాటు లేదు రామకాంత్ ..... నిశ్సబ్దంగా గుంభనంగా బ్రతకడమే చేతనయిన నాకు నా చెల్లి నమ్రత చావు బలమైన దెబ్బతీసింది. అది లేదు నవ్వించడానికి. అందుకే ఇలా నవ్వడమూ, నవ్వించడమూ అలవాటు చేసుకుంటున్నాను...."
చైతన్య అప్పటికే రెస్ట్ హౌస్ దాటి అడవిలోకి అడుగుపెట్టాడు.....
* * * *