Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 29

    సరీగ్గా అదే సమయంలో కాకతాళీయంగాట్రిగ్గర్ నొక్కబడడం వల్ల తూటా మోతకి అరణ్యం దద్దరిల్లిపోయింది.
   
    ముళ్ళు భుజాలకి గుచ్చుకుని ఒంట్లో నరాలు జివ్వుమన్నాయి.
   
    మోచేతుల నుంచి రక్తం చిమ్ముతోంది.
   
    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
   
    ఇప్పుడు పులి ఎక్కడున్నదీ, మరో అవకాశం కోసం ఎ మూల నుంచి ప్రయత్నించేదీ అతడి వూహా కందటంలేదు.
   
    గోతిలో వున్న ఎండు కట్టేల్నీ, పోదల్నీ బలంగా పట్టుకుని పైకి రావాలని ప్రయత్నిస్తూ సంశయంలో మునిగిపోయాడు.
   
    ఇప్పుడు జరిగింది కాదు అతడాలోచిస్తున్నది. జరగబోయే మరో ప్రతిఘటాన గురించే.....
   
    క్షణాలు టెన్షన్ గా గడుస్తున్నాయి.
   
    సహజంగా ముషులుంటే భయాన్నికోల్పోయిన పులి....అదీ గాకుండా యిప్పటికే నరమాంస భక్షుతో మరింత ఫేరోషియస్ గా  మారిన మేనీటర్ తనను చాలెంజ్ చేసే ప్రత్యర్దీని.... అందునా ఇలాంటి నిశిరాత్రి వేళ క్షమించి విడిచిపెట్టదు.

    చుట్టూ పేరుకున్న నిశీధి నీరవత అన్నీ యిప్పుడు వినిపిస్తోంద.
   
    మరణ భేటి కాదు__ ఇలా నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోవాల్సి రావడమేమిటీ అన్న భావమే అతడ్ని అమితంగా కలచివేస్తోంది.
   
    కసిగా దవడ కండరాలు బిగుసుకున్నాయి.
   
     ఒకవేళ చెల్లించాల్సిన మూల్యం ఎక్కువైనా కారణమూతన తొందరపాటే అన్న ఆలోచన రాగానే నెమ్మదిగా తలతిప్పి చూశాడు.... గోతి అంచున వ్రేలాడుటున్న ఓ చెట్టు ఊడ కనిపించింది.
   
    అసాధారణమైన చైతన్య అనుభవంలో ఎన్నోసార్లు ఆపదల్లో చిక్కుకున్న ఏనాడూ ఎవరో ర్వాలని, తనను కాపాడాలని ఎదురు చూడలేదు...... ధైర్యాన్ని మించిన మొండిచేతనమే చాలాదాకా అతడ్ని గేలిపించిగట్టుకు చేర్చింది,
   
    ఓ చేత్తో ఊడను పట్టుకుని పైకి వస్తూ, మరో రైఫిల్ ని గురిపేట్టిఅతడి శరీరం పూర్తిగా ఒడ్డుకు చేరకముందే గాలోలికి వరసుగా మూడుసార్లు పేల్చాడు. ఇక్కడ అతడి ప్రయత్నం యింక తను సాయుధుడై ఎదురు నిలవడానికి సిద్దంగా వున్నానని ప్రత్యర్ధికి తెలియ చెప్పటం మాత్రమే!
   
    చైతన్య అంచనా తప్పు కాలేదు.....
   
    సమీపంలో ఓ పొద కదిలిన  చప్పుడు.....
   
    అలర్ట్ గా రెండు చేతులతో రైఫీల్ పట్టుకున్నాడు.
   
    ప్రమాదాన్ని ఆహ్వానిస్తూ అర నిముషంపాటు ఎదురు చూసిన చైతన్య వూహించినట్లు పులి అతడి వేపు రాలేదు.
   
    దూరంగా వున్న వెదురు పొదల్లోకి పెరుగేట్టుతూ కనిపించింది.
   
    ఆ మసక వెలుతురులో పులిని కాల్చమని తొందరపడలేదుగాని....  తను ఎంత బలిష్టమైన పులితో పోరాటానికి నిద్దబడీంది భోధపడిపోయింది!
   
    సుమారు పదిన్నర అడుగుల పొడవున్న మేనీటర్ . ఆరోగ్యంగా వున్నా తను వూహించినట్టే ఓ పక్క కొద్దిగా కుంటుతొంది.
   
    అవయావాలు పట్టుదప్పినట్టు ఒంట్లో నరాలు పెరికేస్టున్నట్టు శరీరం సహకరించని మొండికేస్తోంది.
   
    నెమ్మదిగా వెనక్కీ తిరగబోతూ అసంకల్పితంగా చూశాడు...... మేనీటర్ వెళ్ళిన ప్రదేశాన్ని కాదు....
   
    ఇందాకటి అమ్మాయి కనిపించిన సేలయేటి ఒడ్డును!
   
    లేదక్కడ.....
   
    ఏమైంది....
   
    భయంతో పారిపోయిందా....
   
    అసలు ఇలాంటి అర్దరాత్రి వేళ కూడనిచోట ప్రత్యక్షమై నిశ్చింతగా  స్నానం చేస్తుండడమేమిటి.....
   
    ఆమె మనిషేనా......
   
    లేక తను భ్రమపడ్డాడా.....

    ఎవరామె .....
   
    దుర్గామారణ్యంలో సంచరిస్తూ కౄరమృగాల పదఘటనలతో కలతచెందే ప్రాంతాలకు రక్షణ కలిగిస్తూ, పాతికేళ్ళ వయసులోనే నూరేళ్ళఅనుభవాన్ని సొంతం చేసుకున్న చైతన్యకు విచిత్రమైన సంఘటనలుగానీ వ్యక్తులు కానీ కొత్తకాద.
   
    కానీ అప్పటికన్నాఈ యువతి అతడ్ని చాలా ఆశ్చర్యంలోకి నెట్టింది.
   
    అది కూడా కాదు.....
   
    కోరికా కాదు. కాంక్ష కాదు. కాని వెన్నెల్లో భారంగా కదిలేశ్రావణ మేఘంల్లాంటి ఆమె స్థనాలు పదే పదే గుర్తుకోస్తున్నాయి.
   
    నైతికమైన విలువల్ని గౌరవించే చైతన్య ఆమె నగ్న దేహాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ట్రాన్స్ లోకి జారిపోతున్నాడు చిత్రంగా.
   
    ఇలా ఎందుకు జరుగుతున్నదీ అతడికే తెలీదు.
   
    కాని ఒక నిశ్శబ్దపు రాత్రి ఆకాశంలో నుంచి వెన్నెల చప్పుడు చేయకుండా నేల జారే క్షణంలో... అదే సెలఎటీ నీటి తుంపర్ల మధ్య ఆమెను నిలదీసి ఎవరో తెలుసుకోవాలినిపిస్తోంది.
   
    తను కోరుకుంటున్నది ఇది మాత్రమేనా......
   
    ఇలా అనుకోగానే చైతన్య గుండె లయతప్పి చాలా అందోళనకు గురిచేసింది.
   
                                                        *    *    *    *   
   
    "మొదటిసారిబుల్లెట్ చప్పుడ్ని విన్నాక రావాలనిపించింది చైతన్య గారూయా తర్వాత నిశ్శబ్దం చాలా భయాన్ని గొల్పింది ఏం జరిగిందో తెలీని టెన్షన్ లో నేనూ, స్వామీ బయలుదేరాలకున్నాం. అంతలోనే మరో మూడు రౌండ్స్... మళ్ళీ పులి గాండ్రించడం..... మీకూ,పులికీ మధ్య ప్రత్యెకమైనఎన్ కౌంటర్ ప్రారంభమయిండనిపించింది...."        

 Previous Page Next Page