చాలా బాదకరంగా ఒక నీటి బొట్టు అతడి కనుకొలకుల్లో నుంచి జారి అతడి చెంపలపై అలుముకున్న చెమట బిందువులతో కలసిపోయింది.
అతడు తవ్వుతున్నాడు......
సహనం నశించిపోతుంది...... చేతులు బొబ్బలేక్కుతున్నాయి ..... శరీరం వణుకుతూంది.
ఈ రాత్రి ..... తెల్లారకముందే ఆ శవాన్ని మాయం చేయాలి. మరోచోట మరోలా ఎవరికీ చిక్కకుండా అంతం చేయాలి.
లేనివాడు పోస్టుమార్టం జరిపి పోలీసులు నిజాన్ని గ్రహించి.....
ఆ తర్వాత అతడూహించలేకపోయాడు.......
అప్పటికే సుమారు నాలుగడుగులలోతువరకూ మట్టినిపైకిలాగేడు.....
మరో అడుగు లోతు.....
ఏ వైరాగ్యం అతడ్ని అవర్తిస్తూందో దుఃఖం కట్టలు త్రెంచు కుంటోంది..... సరిదిద్దుకోలేని తప్పిదానికి ఏర్పడిన నిస్సహాయతతో మరి __ అతడి గొంతులో సన్నగా వెక్కిళ్ళు......
కొన్ని గంటలపాటు ఆ స్మశానవాటికలో అతడు పడిన మానసిక వ్యధ ఏనాడూ అతడి కలవాటు లేనిది.....
మరో అరగంట కష్టపడితే భార్యకాదు కాని భార్య శవం దక్కుతుంది.....
దూరంగా కాలుతున్న కష్టం నుంచి వస్తున్న కాదు వాసన ___ ఆవేశంగా అతడు క్రిందకి వంగేడు......
సమీపంలో ఎక్కడో ఓ చిరుసవ్వడి......
ఉలికిపాటుగా పైకి చూసాడు..... చుట్టూ కలియచూసాడు.... నీరసం......
అంతటా చీకటి...... భ్రమపడుతున్నాడా .......
లేదు..... ఎక్కడో ఎవరో పొంచివున్నట్టు అతడి సిక్స్త్ సెన్సు చాల నమ్మకంగా చెబుతూంది.
అతడి గుండె సవ్వడే అతడ్ని భయపెడుతున్నట్లు అనిపించి....
చుట్టూ నిశితంగా పరికించి నమ్మకం కుదిరేక కొద్దిగా తలవంచాడు.....
ఇప్పుడు ఇక స్థిమితంగా ఉండలేదు...... వీలైనంత త్వరగా మట్టి పేళ్ళల్ని పైకి లాగి భార్య శవాన్ని......
మళ్ళీ ఏదో అలికిడి...... దూరంగా కాదు చాలా సమీపంలో......
నెమ్మదిగా తల తిప్పేడు.
అంతే.....
నేలకు నిర్వ్య ధనమై నిటలాక్షిని నిర్వర్ణవాగ్ని విర్యాసనార్డం పైకేగసినట్టుభీటిగా రెండడుగులు వెనక్కీ దూకెడు.....
కొండల్ని ఛిద్రం చేసే శ్ర్వాభి సారేచ్చాగల వద్దుతో త్రిశూలం దూసుకు వచ్చినట్టు ఏదో చప్పుడు......
నాన్సెన్స్ ...... ఇక్కడ మీ ప్రయోగమేమిటి......
మూడ్ చేడినట్టు రాస్తున్న కాగితాల్లోంచి తల పైకెత్తాడు వైధేయ.
ఎంతసేపటి నుంచి రింగవుతుందో మరి సమీపంలోని ఫోన్ కేసి అసహనంగా చూసాడు.
అనుకొని అవాంతరం.......
మరొక్క రెండు నిమిషాలు తను కంటిన్యూ చేసివుంటే ఆ వ్యక్తి శవాన్ని పైకి తీసాడా లేక అనుకుని అపడకి బలైపోయడా అన్నసందిగ్దతిని పాఠకుడికి సృష్టించి "సంశేషం" అంటూ ఒక "ఇష్యూ" కి సరిపడ్డ "టే౦ఫో" తో ఆ వారం కధను ముగించేవాడు......
"డామిట్" ఇంకా ఆగని పోనికేసి చూస్తూ కర్చీఫ్ తో ముఖంపై అలుముకున్న స్వేద బిందువుల్ని తుడుచుకున్నాడు......
రాస్తున్న వేళ పాత్రలోకి తనే "ఎలియనేట్" అయి విపరీతమైన అందోళనకు గురవుతుంటాడతను......
అందుకే ఇప్పుడతని గుండెలూ అదురుతున్నాయి.
కొద్దిగా తేరుకున్నాక రిలాక్సింగ్ గా ఫోన్ రిసీవరు అందుకున్నాడు.
"హలో"
ఓ తీయని కంఠంస్వరం వినిపించింది మృదుమధురంగా.
ఆ క్షణాన వెన్నెల పారాణిని చిమ్ముతున్నట్టు తనను పరామర్శించే ఒక యువతి తీయని గొంతు ఎంతటి పులకింతను కలిగించిందంటే టెన్షన్ లో నుంచి తేరుకున్న వైధేయ పాలపుంతలో అడుగిడి ఆకాశపు అంచులవరకు సాగిపోతున్న అనుభూతి క్షణంపాటు అతడి వివశుడ్ని చేసింది.
"యస్" సంగీత రససిద్ధిని పొందిన ఓ సరళీస్వరంలా జావాబిచ్చాడతను.......
"ఎవరూ మాటాడతున్నది" అది పలకరింపు కాదు. శ్రుతిచేసిన విపంచి ఠవళించిన ఒక పల్లవి.....
"ఎవరు కావాలి మేడమ్"
ఫకాలున ఒక నవ్వు వినిపించింది అవతలినుంచి....
ఎందుకో అర్దంకాలేదతనికి ......
ఒకవేళ ఎవరైనా తన అభిమాని తన గొంతు గుర్తించి అల్లరిగా తనను ఆటపట్టింస్తోందా.......
సంచలన రచయితగా ఎంతో కీర్తీని సంపాదించుకున్న వైధేయకు అభిమానులు కోకొల్లల్లు...... పోనల్లో పరామర్శలు వింతకాదు. కాని ఆ కంఠంలోకి లాలసత్వం కొత్త...... మనసును కొల్లగొట్టగల లాలిత్యం కొత్త......
"మీరెవరు" అన్నాడు మరో మారు.
"వైధేయ వున్నాడా"
క్షణంలో వెయ్యావంతు పులకించిన అతని మనసు ఆమె వాక్ ఝురిలోముసకలవ్వాలని తపించిన అతని హృదయం "వున్నాడా" అంటూ ఆమె ఏకవచనం ప్రయోగించేసరికి ఒక చిన్న అవసృతిని కోరని ఉపసృతి ఎదుర్కో వాల్సి వచ్చినట్టు కొద్దిగా కలవరపడింది.