రెస్ట్ విహాస్ సిరీస్ చెట్ల పైనుంచీ మరో చప్పుడు, ఇంకెక్కడో కణుసు కేక......
ఉండుండీ అడవిలో సంచలనం మొదలైంది.
ఒకప్రమాదానికి ముందులాంటి స్థితి అది....
చాలా దిగువుగా ఎగురుతున్న ఓ తీతపు ఆర్తనాదం అమేనేంత కదిలించిందీ అంటే ఠక్కునవెనక్కీ జరిగి భయంతో బెడ్ పై కూర్చుండి పోయింది.
సరిగ్గా ఇదే సమయంలో......
ఏటవాలుగా వున్న గుట్టపై చెట్లవూడలు కొండచిలువుల్లా కదులుతూన్నాయి.
"మొ.... వ్వా..."
ఊడపైనుంచి మరో, వూడకి దూకుతున్న ఓ ఆకారం చేసిన అక్రందనది.
"మొ..... వ్వా......"
మళ్ళీ అదే అరుపు ....
గదిలోనే విజయ వెన్నులో సన్నగా చలి మొదలయింది.
.... ఆ నిశ్శబ్దపు చీకటి రాత్రిలో అది అరణ్యంలోని ఏ జంతువోపెట్టిన కేకలా లేదు.
అమ్మ పొత్తుళ్ళరుచిమరిగిన ఓ కూన నిస్సహాయంగా నేలజారి క్రూరమృగంలా కోమ్ములు కొడవళ్ళలా కుమ్ముతుంటే బ్రతుకు కొసకొమ్ములమాటున నక్కుతూ చేసిన ఆఖరి అక్రందనలా ఉంది.
కంపించిపోతూ అలాగే వుండిపోయిన విజయ గమనించలేదు.....
ఓ కోతులా వూడలపై పయనించిన ఆరేళ్ళ పసికందు ఇప్పుడు గోడపైకి ధుమికి ఆమెనే గమనిస్తున్నాడు......
అదికాదు. పెదవుల్ని తడుపుకుంటూ ఎలుగుబంటిలా చేతులు ముడిచి తూలుకుంటూ నడిచి కిటికీ చేరుకున్నాడు.
* * * *
"సుమారు ఏడాది క్రితం రాష్ట్రంలో చాలా సంచలనాన్ని శ్రిష్టిమ్చిన అడవి ... అదే నేను ఎక్స్ ప్లాయిట్ చేయాలకునున్నది మృత్యురాజుగారూ....కాబట్టే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ నిర్మాతా యిమ్తవరకు ఉపయోగించని ఈ ఆడవి బేక్ డ్రాఫ్ గా కధను తాయారుచేయించి ఎలాగు చరిత్ర వున్న ఈ పరిసరాల్ని పభ్లిసిటీకి వాడుకోవాలని.... యిక్కడే ఘాంటింగ్ మొదలుపెట్టాం" చెప్పకుపోయాడు సురేంద్ర.
మృత్యురాజు వెంటనే మట్లాడలేదు ముప్ప్హయ్యేళ్ళాకే గిరజనలకి నాయుకుడైన మృత్యురాజు ఏ వివరల్నీ అంత సునాయాసంగా బయటపెట్టాడు. కాని, బాగా తగి నప్పుడు కొద్దిగా నోరుజ్రుకుంటాడు. అంటే బాగా మత్తులో తప్ప కొన్ని నిజాల్నిబయటకికక్కే అలవాటు లేనివాడు అడవిలో మృత్యురాజుకి బాగా మత్తునందింస్తే, జీలుగు కళ్ళు తగి అక్కడకు వచ్చిన మృత్యురాజుకి ఫారెస్ విస్కీ మరింత మత్తునిచ్చింది. అందుకే డైల్యూట్ చేయకుండా గబగబా తగి యిప్పుడు తనను తను మరచిపోయే స్థితిలో వున్నాడు. "అయితే ..... ఈ అడవికి ఏడాది కొండత తప్పయిప్పుడు సెప్పుకోదగ్గసరిత్ర లేదంటారు" నవ్వేడు తోడేలులా....
"ప్రస్తుతం ప్రశాంతంగానేవుందిగా " వెంటనే అన్నాడు ముందు కొట్టిన తోడేలులా. "అవును సురేమ్ద్రయ్యా. ఏడాది కిందట ఏపుగావున్న కన్నెపిల్లలు మా గూడెం నుంచి తప్పిపోయారు. మాపిటేల మా గూడేల్లోకి అడుగు పెట్టిన జ్మ్రువు నోటసిక్కిమాకు దూరమైననారు.ఒకరూ ఇద్దరూ కాదు బాబూ! సందుల్లోనే అయేనక యేటగాళ్ళూ వచ్చినారు. ఏదేదో అడిగినారు. జంతువును సంపుతానని అడవంతా గాలిమ్చినారు. శవం సిక్కితెగదా జంతువులకోసం మాటేయ్యటానికి? అంతే ... సంగతేటో తెలీక తిరుగుతుందని కన్నెపిల్లలు కన్నోళ్ళ నుంచి దూరమౌతూనేవున్నరని ఎంతమందికితెలుసు......."
"వ్వాట్" నొసలు చిట్లించారు. సురేంద్ర. "ఇప్పటికి అడవి పరిస్థితి అలాగే ఉందా?" సురేంద్రలో అలజడి మోడలింనతొలి క్షణమిది.
"మరి ఆ జంతువుని...."
"జంతువు కాదది" నూతిలోలా వినిపించింది మృత్యురాజు కంఠం "రక్కసి... ఏ మాపిడేలా ఎక్కడి కోస్తదో ఏ యింటి ఏ పిల్లని ఎత్తుకేళ్తాదో తెలీని భూతం..... అది మడుసులకి కనిపించదంటరు."
మృత్యురాజు కళ్ళముందు ఇందాక చూసిన విజయ కటిభాగం అరమాగిన వళ్ళు, అతికించినట్లున్న పక్షం కదలాడుతుంటే కలలోలా చెప్పుకుపోతున్నాడు.
"ఎందుకన్నా మంచిది, ఇక్కడ మీరుజాగ్రత్తగా వుంటే మంచిదయ్యా......! అంతెందుకు రాత్రివేళ యిక్కడ కామనీ పిశాచాలు కొరవి దయ్యల్లా తిరుగుతుంటాయి. నీలాటికుర్రాళ్ళ యనకబడి సచ్చినొల్ల గొంతులతో పిలిచి సేమ్గున మీదకిద్మికిసంబరం సేసుకుంటాయంటారు."
ఇక టట్టుకోలేకపోయాడు అంతసేపూ ప్రాణాలుగ్గట్టుకునికూర్చున్న నిర్మత గోవర్ధనం "నీయమ్మ కడుపుకాల యింకాపవయ్యా__ యింకా పదిహేను రోజులుండాలి."
"నానా పెసినా అయ్యాగవయ్యా పెద్దమనిషి....... అడవి ఆర్తనాదం.....
అక్రనందన వినిపించింది. విజయ గదినుంచే అని గుర్తుపట్టటానికి పట్టింది అరక్షనమే....
వేగంగా దూదుకుపోయాడు సురేంద్ర.
విజయ ఒక్క అంగలో సురేమ్ద్రని చేరుకుంది.
ఊపిరి అందనట్లు రొప్పుతూ అతడ్ని చేట్టేసింది. అదికాదు ఆ స్థితిలో సైతం సురేమ్ద్రని ఆశ్చర్య పరిచింది.