Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 4

 

    విజయ బ్లౌజ్ హుక్స్ తెగి ఆమె స్థనాలు బయటకి కనిపిస్తున్నాయి.
   
    "ఏమైంది విజ్జీ ... వాట్ హేపండ్ ?"
   
    "ఆ బాబు బలంగా నా బ్లౌజ్   చింపి.... పలు తాగాలని...." చెప్పుకుపోతుంది కళ్ళనీళ్ళుపర్యంత మవుతుంటే.
   
    "బాబెమిటి,పాలు తాగడమేమిటి ... ఆర్యూ మేడ్...." కిటికీలో నుంచి బయటకి చూశాడు.నిశ్సబ్దంగా వుంది అంతటా.
   
    "అయితే...." మృత్యురాజు కంఠంవినిపించింది మత్తుగా_ అతడి దృష్టి విజయ గుండెలపైనే వుంది.
   
    "ఆ పిల్ల దెయ్యం కంట పడాలా పిచ్చి తల్లీ....."
   
    అసహనంగా చీరని విజయ ఎదపైకిసర్దిన సురేంద్ర కోపంగా అన్నాడు మృత్యురాజు "పిల్ల దయ్యమేంటి.... కంటపడ్డమేమిటి?"
   
    "ఇక్కడ కౌరివి దయ్యాలతోపాటు ఓ పిల్ల దయ్యమూ తిరుగుతున్నది బాబూ. నచ్చిన ఆడపిల్ల ఆడపిల్ల వెంటపడతది పాలకోసం మీద కలియబడతది.
   
                   *    *    *    *
   
    ఒక కాళరాత్రి గడిచిన సాక్ష్యంగా ఉదయ కిరణాలు అడవిని ఆక్రమించాయిశవంపై కప్పిన కొత్తబట్టలా కనిపిస్తున్న ప్రకృతి అందాన్ని భయ విహాలంగా చూస్తూనే అన్నాడు సురేంద్ర "విజ్జీ నువ్వు చెప్పినదానిలో వాస్తవాన్ని చర్చించదలుచుకోవడంలేదు__ నేను ఏది ఏమయినా పంపేయాలనుకుంటున్నాను. తక్కినవి డ్యూఫ్ లో ప్లాన్ చేస్తాను" నిజానికి ఇలంటి ప్రపోజల్ పెట్టాడు.
   
    "సో" లోకేషన్ వేపు ఓమారు ఏకాగ్రతగా చూసిన సురేంద్ర అన్నాడు "నిన్నటి శీనుకు కంటిన్యూటీ ఇక్కడ ప్లాన్ చేద్దాం. నువ్వు పులి వెంటాడుతుంటే పడిపోతావు పరుగెత్తుతూ ఆ తర్వాత పులి నీమీదకి చార్జి చేయగానే ప్రక్కకు దోర్లావు.... అంతే ! ఈ లోయలోకి జారిపడ్డావు. ఆ తర్వాత శరీరం సహకరించనంత బాధతో పైకి లేచావు. సమీపంలో పులి కనిపించలేదు. అయినా భయం, అందోళన నెమ్మదిగా తూలుకుంటూనడచి గుట్ట దిగువున వున్న గడ్డిమబ్బుల్నీ చేరుకున్నావు. అప్పుడు కనిపించింది పులి. అంతే మళ్ళీ కళ్ళలో అందోళన. వెనక్కీ పరుగెత్తి ఆ దిగువున వున్న లోయ అంచును చేరుకొని రొప్పుతూ, దిక్కులు చూస్తూ విప్పతోటలో అదృశ్యమైపోతావు అయితే ఈరోజు టైగర్ ని ఉపయోగించడంలేదు. దాని పాయింటాఫ్ ప్యూలో కెమెరా కదులుతుండన్నమాట"  
   
    చెప్పిందంతా మననం చేసుకుంటున్న ఆమె ఆ స్థితిలో మరచి పోలేకపోతుంది నిన్న రాత్రి సంఘతల్నీ.
   
    గదిలోకి వచ్చి పక్కనే నిలబడ్డ పసికందును  చూసి ఎంతో అందోళన పడింది.
   
    అయినా కేక పెట్టలేకపోయింది. మకిలి పట్టిన చందమామ శకలంలాంటి  శరీర ఛాయతో ఉలికిపడి పడే నక్షిత్రాల్లాంటి విప్పారిత నేత్రాలతో  ఎంత ముద్దోచ్చాడని. అర నవ్వుల తరంగా మనిపించాడు. ఏ చరిత్రలోనూ ఇమడని ఒలికిపడిన అక్షరాల తోరణంలా కనిపించాడు. చూస్తుండగానే బ్లావుజు లాగాడు.పెదవులతో తన స్థనాన్ని స్ప్రిశించి.... సరిగ్గా అక్కడే ఆమె టాక్సిలోనుంచి తెరుకున్నదీ __పెద్దగా ఆర్తనాదం చేసిందీ. అసలుఎవారా బిడ్డ.
   
    "ఆర్యూ ఓకే" సురేంద్ర కంఠం వింటూనే తేరుకుంది.
   
    "రిహార్సల్ అక్కర్లేదుగా డైరెక్టుగా షాట్ ప్లాస్ చేద్దాం."
   
    అర నిముషంలో క్లాఫ్ ఇవ్వబడింది.
   
    కెమెరా చప్పుడు తప్ప అక్కడ నిశ్శబ్దం ఆవరించింది   
   
    లోయ అంచునుంచి నిస్రణగా పైకి లేచిన విజయ ముందు భయంగా దిక్కులు చూసింది. తూలుకుంటూ నడిచి గుట్ట దిగువున వున్న గడ్డిమబ్బుల్నీ చేరుకుంది.
   
    షాక్ ... ఎదురుగా పులి కనిపించినట్టు.
   
    సురేంద్రతోపాటు యూనిట్ అంతా ఉత్సుకతగా చూస్తున్నారు.
   
    కెమెరా చేతులతో పట్టుకున్న కెమెరామెన్ నెమ్మదిగా ముందుకు కదులుతున్నాడు. అవసరమయినప్పుడు "జూవన్' ఆపరేట్ చేస్తూ.
   
    విజయ భయంగా రెండడుగులు వెనక్కీ వేసింది. నిజనికి ఆమె వ్యక్తం చేస్తూంది తండ్రేవరో తెలీని కూతురిగా ఆమె బాల్యం యించుమించు ఇలాంటి స్థితిలోనే గడిచింది. జనారణ్యంలో మనుషుల ఇలాగే పులిలా వెంటాడి వేధిస్తుంటే అక్కడ మొదలైన జీవితాన్ని ఇక్కడిదాకా ఎదుగెట్టు అహొరాత్రులు శ్రమించింది.
   
    ఆమెకు అదంతా గుర్తుస్తుంటే అలవోకగా కళ్ళు వర్షిస్తున్నాయి.
   
    ఆమె విస్పతోటలోకి పరుగెత్తింది.
   
    షాట్ ముగిసిన సూచనగా 'కట్' అన్నాడు సురేంద్ర పోర్టబుల్ మైక్ లో
   
    అప్పుడు వినిపించిందో గావుకేక.
   
    ముందు స్థానువైన సురేంద్ర వెనువెంటనే వందగజాల దూరంలో వున్న విప్పతోటలోకి పరుగెత్తాడు.
   
    విజయ లేదక్కడ. అసలు ఏ అలికిడీ వినిపించలేదు.
   
    తన బ్రతుకు అధ్యయంలో నటించే చివరి సన్నివేశం అదేనన్నట్టు హాఠాత్ గా అంతర్దానమైపోయింది.
   
    "వి.....జ్జీ" శిథిల నిశీధి గొంతునుంచి జారిన క్షతగాత్ర స్వరంలా సురేంద్ర అక్రందనతో  అడవి ప్రతిధ్వనించింది.

    కండలు తిరిగిన చేతికున్న తాయెత్తునూ, నడుంకున్న జింక చర్మాన్నీ తడుముకుంటూ చూస్తున్నాడు మృత్యురాజుకసిగా.
   
                  *    *    *    *
   
    "కూనాం అడవుల్లో సినీనటి విజయ అదృశ్యం  ఓ క్రూర మృగానికి బలయిన వర్ధమాన నటి విజయ.
   
    అదృశ్యమైంది ఓ మామూలు వ్యక్తి కాదు, అప్పటికే లక్షల సంఖ్యలో అభిమానం పొందగలిగిన ప్రముఖ నటి. తెలుగు దినపత్రికతో పాటు ఇంగ్లీషు డైలీలుకూడా ఆ వార్తని ప్రముఖంగా ప్రచురించినాయి.

 Previous Page Next Page