ట్రయిలర్ వెం బోనులోకి అడుగుపెట్టిన షిబానీ అభినందనగా చూసిన సురేంద్ర అప్పుడు గమనించాడు.
ఇందాక షాట లో నేలపై విజయ ఇంకా లేవలేదు.
"వే హేపండ్ ఫస్ట్ ఎయిడ్ కోసం కేకపెట్టాడు......
ఆమె సన్నగా ప్రకంపొంచిపోతుంది.
కధానాయిక ఈ మధ్యనే సినిమారంగంలో అడుగుపెట్టిన వుజయ నటించిన రెండు చిత్రాలూ విడుదలై ప్రస్తుతం విజయఢంకా మోగిస్తూన్నాయి.
అనుభవమున్న నటులైనా పులితో కలసి నటించేటప్పుడు ఎంతో అందోళనపడేదీ తెలిసిన డైరెక్టరుగా ఆ రోజు చాలా షాట్స్ ని 'డ్యూఫ్' ని ఉపయోగించి పూర్తీచేద్దామనుకుంటేవిజయ అంగీకరించలేదు.
నటజీవితం ప్రారంభ దశలో ప్రతి నాటికీ వుండే దీక్ష మాత్రమే కాదు, ప్రమాదకరమైన షాట్స్ లో కూడా నిబ్బరంగా తనే పాల్గోనాలన్న ఉత్సాహమూ విజయకి ఎక్కువే ఆ విషయాన్నీ ఆమెని చిత్రరంగానికి పరిచయం చేసిన యువ దర్శకుడైన సురేంద్ర చాలా రోజుల క్రితమే గ్రహించాడు.
"భయపడ్డావు కదూ" లాలనగా అడిగాడు.
ఆమె కనుపపల్లో అలజడిఇమ్కా తగ్గలేదు..... అదికాదు ...ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఒడిపోతున్నట్లు ఆమె పెదవులు అదురుతున్నాయి.
"యూగేట స్పెండిడ్ ఫేర్మార్మేన్స్ విజ్జీ..." అభినందనగా అని తర్వాత చుట్టూ మూగిన యూనిట్ మెంబర్స్ ని గమనించి రహస్యంగా చేవిలోచేప్పాడు "గేతఫ్...అంతా మనకేసే చూస్తూన్నారు"
తేరుకుని గభాలున పైకి లేచిన విజయ అప్పటికి సురేమ్ద్రకి జవాబు చెప్పలేదు.......
సురేంద్ర ఆమెకి మానసికంగా చాలా చేరువైన వ్యక్తయినా గొంతుపెగలడంలేదు.
ఇంకా తడబడుతూ సుమారు పదిహేను అడుగుల దూరంలోవున్న ఓ పురుగు పోడవైపే చూస్తుంది.
ఇందాకటి 'షాట్' చివర్లో డైరెక్టరు ఆదేశం ప్రకారం బోర్లాపడిన ఆమెకు ముందక్కడ చిన్న చప్పుడు వినిపించింది.
ఏజంతువో పొంచివుందేమో అనుకుంటుండగా జడలుకట్టిన జుట్టుతో ఆరేళ్ళ పసికందు కనిపించాడు.
అదికాదు ఆమె అవాక్కయి చూస్తుండగానే ముందు కురికి రాబోయాడుగానిఇంతలో నల్ల మొద్దులా వున్న ఓ ఎలుగుబంటి వచ్చి ఆ బాబుని బలంగా పట్టుకుంది.
అక్కడో పసికందు కూరమృగం వాత పడిపోతూన్నాడని కేక పెట్టాలనికుంటుండగానే చిత్రంగా ఎలుగుబంటుని కావలించుకుని అమ్మ ఒడిలోనే ఓడిగినంత సంబరంగా నవ్వుతున్నాడుపికిలిపిట్టూలాచప్పుడు చేస్తూ....
అదే ఆమెని అంతసేపూ అందోళన పరచింది.
అదృశ్యమైన ఒక భయంకరమైన కీకారణ్యంలో క్రూరమృగాల మధ్య పసికందు ఇంత నిశ్చింతగా ఎలా వున్నాడో ఆమె వూహకందడం లేదు.
తను బరమపడిందా.....
ఇంకా నిర్విణ్ణురాలై చూస్తుంది అదే పోడ వేపు....
* * * *
అర్దరాత్రి దాటుతూంది.
వేల చదరపు మైళ్ళ గల దుర్గామారణ్యపు మధ్యలోని గుట్టపై వున్న ఫారెస్టు రెస్ట్ హావున్ మసక వెన్నెల వెలుతురులో ఖరీదైన గోరీలా వుంది.
ఒంటరిగా గదిలో వున్న విజయ నిద్ర రాక కిటికీ దగ్గరకు వచ్చి నిలబడింది.
రెస్ట్ హవున్ కి మార్గం వున్న సన్నని బత కదలలేని కళింగ నాగులా వుంది.
శశిరాత్రిఅరణ్య స్థబ్ధత ఆరిపోయిన చితులున్న శ్మశానాన్ని గుర్తుచేస్తూంది.
తూర్పున లోయలో వాయువ్యదిశలోసుదూరంగా పరుచుకున్న సిందూరావనం, దక్షణాన గుట్ట పైనుంచి జరుతున్న సెలయేరు నిశ్శబ్ధంగా సాగుతున్న పంపానది, ఆగ్నేయంగా విస్తరించిన కొండలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పాదాలకైన గాయాల గురించి ఆమె ఆలోచించడం లేదు.
ఇందాకటే పసికందే పదేపదే గుర్తుకోస్తున్నాడు.
చెబితే నవ్విపోతారని తెలుసు... నమ్మరానీ తెలుసు... అయినా సురేంద్రజి జరిగింది చేపాలనుకుంది.
అందరిముందూ పెదవి విప్పలేకపోయిన తను ఇప్పుడే సురేమ్ద్రకి ఈ రాత్రికే చెప్పాలి.
అప్పటికి రెండుసార్లు ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి అడిగింది. సురేంద్రకోసం ప్రస్తుతం సురేంద్ర నిర్మాత గదిలో ప్రొడ్యూసర్ తో బాటు అడవిలో ఘంటింగ్ కి సహకరిస్తున్న గిరిజనులకు పెద్దయిన బుగుతా మృత్యురాజుతోవున్నాడు.
ఆ గెస్ట్ హౌస్ లో ఎకాడేషన్ ఏర్పాటు చేసింది డైరెక్టరు, నిర్మాత హీరోయిన్ విజయకి మాత్రమె.... మేమ్బర్సు కి అక్కడ అయిదు కిలోమీటర్ల దూరంలో వున్న గిరిజినవాడలోవుండటానికి ఏర్పాట్లు చేశారు.
అది భయమో లేక ఒక నిజాన్ని చెప్పాలన్న ఉద్వేగమో యిక నిభాయించుకోలేనట్టు బయటకి నడిచింది.
అప్పుడు వినిపించింది ఓ లంగూరే కేక... ఓడలు జలదరించింది. చికటిపై కురుస్తున్న వెన్నెల చెట్ల మధ్యనుంచి పొడల్లా నేలను తాకుతుంటే చేష్టలుడిగి నిలబడిపోయింది అలాగే.....