ఒక ప్రమాద భూయిష్టమై, దుర్గమారణ్యంలో అపరాత్రివేళ సంచరించడం తొందరపాటుని అతడికి తెలీని విషయంకాదు.
అయినా ఉస్తుకతని ఆపుకోలేకపోయాడు.
సమీపంలో ఆదమరచి నిద్రపోతున్నాడు యస్సై రమాకాంత్.
గదిలోని ఓ మూల బొంతపై గుర్రు పెడుతున్నాడు స్వామి.
బహుశా తోడుగా తీసుకువెళ్ళాలని ఏ ఒక్కరైనా మేల్కోలోపేవాడేమో.
అదిగో అప్పుడు వినిపించింది ఓ పులి గాండ్రింపు.
హఠాత్తుగా అరణ్యం దద్దరిల్లిపోయింది.
వెనువెంటనే ఇందాకటి అర్తనాధం వినిపించింది.
ఒకవేళ మేనీటర్ మరో ప్రాణిని వేటాడుతూందా?
ఆ భయంతోనే అలాంటి ఆక్రందనచేస్తూ అరణ్యంలో ఆ ప్రాణేదో పరుగెత్తుతూందా.......
స్పష్టంగా బోధపడని విషయాలవి.
జాప్యం చేయడాలుచుకోలేదు....
మరో ప్రాణి. రక్షణ విషయంలో సకాలంలో నిర్ణయాలుతీసుకుంటే తప్ప న్యాయం జరిగే అవకాశంలేని దుర్గమాణ్యంలో ఒక ఆటవిక నీతి అమలు కాకముందే అడుగుపెట్టాలి.
రైఫిల్ నీ, లార్చీని అందుకున్నాడు.
గది దాటి బయటకు వెళ్ళబొతుంటే "సర్" అన్నారేవరో.
ఎప్పుడు నిద్రలేచాడోరమాకాంత్ సమీపంలో నిలబడి వున్నాడు. "నేను రానా సార్?"
వారిస్తున్నట్టు తల అడ్డంగా వూపాడు చేతన్య.
"ఇట్స్ టూ రిస్కీ ....."
ఇప్పుడు తను అడుగు పెడుతున్నది పచ్చని ప్రకృతిలో ఆహ్ల్లదాన్ని అందించే అరణ్యంలో కాదు.....
అప్రత్తంగా వుంటేతప్ప సవ్యంగా రాలేని మండుతున్న మరుభూలోకి.
రిలాక్స్ మిస్టర్ రమాకాంత్ "
"ప్లీజ్ ... అర్దిస్తున్నాను"
"మిమ్మల్నీ భయపెట్టడం నా అభిమతం కాదు. నిశ్సబ్దంగా వుండే అపరాత్రి వేళ హఠాత్తుగా మొదలైన అలజడి, అరణ్యంలో సంచరించడానికైనా ఏంట భీతిని గోలిపేదీఅనుభవంలో తప్పఅర్ధంకాని విషయం."
"అలాంటి అనుభవం నన్ను దక్కించుకొనివ్వండి."
"కాని ఇలాంటి సమయంలో అనుభవాన్ని కోరుకోవడం అవసరానికి మించి మూల్యం చెల్లించడమవుంతుంది" విస్మయంగా అడిగాడు. రమాకాంత్.
"అఫ్ కోర్స్ ... డానికి మీరే పేరు పెట్టినా నాకు అభ్యంతరం లేదు. ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో తెలుసుకోలేక పోయాననిపించే జీవితం లాంటిది మేనీటర్స్ తిరిగే అరణ్యం. కూడా కాబట్టే చాలావరకూ జీవితాలు ఇక్కడ అర్ధాంతరంగా ముగిసిపోతుంటాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానూఅంటే ఇంకా పరిసరాలే పూర్తిగా పరిచయం కాని ఈ అరణ్యంలో అదీ ఇలాంటి నిశీధి వేళ మీరు నాతో రావడం ఇష్టంలేక" మృదువుగా నవ్వుతూచూసాడోక్షణం.
"మోరోవర్..... నాకైతే ఇంకా పేళ్ళికాలేదు.... సో....నేను రిస్క్ తీసుకున్నా పెద్దగా నష్టంలేదు...... అవునా...."
అరలిప్తిలో చాలా ఫేలాసఫీని స్పష్టం చేశాడు. చైతన్య. ఆ స్థితిలో కూడా ఇంకా అతడి పెదవులపై చెదరని చిరునవ్వు.
బ్రతుకు సాధించిన రుషుత్వం అలా నవ్వగలిగేట్టుచేస్తుందో లేక ఆలోచన వ్వగలిగేవాళ్ళని రుషులంటారో రమాకాంత్ తెలీదు కాని.....
కోరి అపదల్లోకి అడుగు పెట్టాలనుకుంటున్న తనను సుతిమెత్తగా మందలిస్తూ తను అపదలోకి ఓ బాధ్యతలా చొచ్చుకుపోవాలనుకుమ్టున్నాడుచేతనయ.
పొరిగింటిలో పడ్డ దొంగల గురించి తెల్లవారేకసుదీర్గంగా చర్చించుకునే మనిషి ___ అపరాత్రివేళ దొంగలు పడినట్టుతెలిసినా ప్రాణభీతీతో పొరుగు మనిషికి సాయం చేయలేని స్థితిలోదాక్కునే సంఘాన్నే చాలదాకా గమనించిన ఓ ఫోలీసాఫీసరు ఇక్కడ మేధ కందని వ్యక్తిత్వాన్ని చూస్తూ వుందిపోయాడు.
"స్వీట్ డ్రీమ్స్"
బయటకు కదిలాడు చైతన్య.
నిజానికి ఇప్పుడు అరణ్యంలో అడుగు పెట్టాల్సిన అగత్యంలేదు. కాని చైతన్య ని ముందుకు నడిపించిందికేవలం ఉత్కంఠమాత్రమె.
అతడి జీవితంలో ఏ కొద్దిగానైనా సాధించింది సరిగ్గా ఇలాంటి ప్రేరణకి లోనైనప్పుడే..... అదే ప్రేరణ ఈ రోజు అతడ్ని ముందుకు నెట్టింది.
ఏటవాలుగా వున్న గుట్టపై నుంచి క్రిందకి దిగుతుంటే కోరిమృత్యు గహ్వరంలోకి జారుతున్నట్ట్లుగా వుంది.
కొన్నినిమషాల క్రితం కలవరపాటుగా ప్రతిధ్వనించిన అరణ్యం ఇప్పుడు సద్దుమణిగిఒక తుఫానుకి ముందు ప్రాశాంతతని గుర్తు చేస్తూంది.
ఆకాశంలోకి చంద్రుడు ఆరిపోయే ముందు దీపపు వెలుగులా వేనెల్ని తగ్గించాడు.
సరిగ్గా ఏభై అడుగుల దూరంలో చీకటి దట్టంగా వ్యాపించిన విప్పతోట.
కుడివేపు పలచగా పెరిగిన కలబంద మొక్కల.
చాలాసేపు నిశ్సబ్దంగా నిలబడిపోయిన చైతన్య కళ్ళు చిట్లించి విప్పతోట చీకటిలోకి చూస్తున్నాడిప్పుడు.
తనకు వినిపించిన ఆర్తనాదం ఆ తోటలోనుంచే అనే సిక్సై సైన్స్ చెబుతుంది.
ఒకవేళ అదే నిజమైతే గాండ్రిస్తూ అరణ్యంలోనివీరవం చేరిసిన పులి కూడా ఇదే ప్రాతంలో వుంది వుంటుంది."