SAARC _ (south asian association for regional cooperation) లో సభ్యత్వం గల మాల్దీవుల అధ్యక్షుడు ఖయ్యాం తన బెడ్ రూమ్ లో అడుగు పెట్టగానే తనకు ఏర్పడిన విపత్తు గురించి భారతప్రధానితో మాట్లాడాడు ఫోన్ ద్వారా.
ఆ విషయం పాణికి తెలీదు.
* * * *
మేర్సినరీస్ మాల్దీవులలో అడుగుపెట్టి అధ్యక్షుణ్ణి నిర్భంధించడంతోపాటు నేషనల్ సేక్యూరీటి సర్వీసెస్ హెడ్ క్వార్టర్సుని అధీనంలోకి తీసుకోవాలని కిరాయి సైనికలు చేస్తున్నా పోరటం 'మాలే' లో జరుగుటున్న రక్తపాతం గురించి కేవలం ఒక ఫోన్ కాల్ తో తెలుసుకున్న భారత ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది.
విదేశాంగ రక్షణశాఖల మంత్రివర్గ సహచరులతో చర్చించిన భారత ప్రధాని భారత సేవ అండతో మాల్దీవులలో పరిస్థితులను చక్కదిద్దాలని నిర్ణయించిన మరుక్షణం ....
ఆగ్రాలోని మిలటరీ కమెండో రిజిమెంట్ కి చెందిన 'పేరాబ్రిగేడ్ 50 'అలర్ట్ చేయబడింది.
తివేండ్రంమిమనాశ్రమంలో సివిలియన్ ప్లయిత్స్ రద్దు చేయబడ్డాయి.
హిందూ మహాసముద్రంలో వున్న 'INS గోదావరి' 'INS బెట్వా' ఓడలు తక్షణమే మాల్దీవుల వైపుగా దూసుకుపోవలసిందిగా అదేశించబడ్డాయి.
ప్రపంచదేశాలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న రాత్రి పదకొండు గంటల సమయంలో తివేండ్రం నుంచి ఆకాశమార్గంగుండా మాలిచేరుకున్న పదహారు వందలమంది 'పేర్రాట్రూపర్లు' ఒక పథకం ప్రకారం మాల్దీవుల్నీ చుట్టూముట్టాయి.
అప్పటికే జాతీయ భద్రతాదళం హెడ్ క్వర్దార్స్ ని గెలుచుకున్న కిరాయి సైనికులు సునాయాసంగా హేరాయిన్ పార్శిల్స్ ని చేజిక్కుంచుకున్నారు, కానీ,అయిదుగురు ఖైదీలను విడిపించలేకపోయారు.
అదీ సాధించేవారే.... ఇమ్తలోభారట సేన ముట్టడి ప్రారంభమై పోయింది.
కొందరు నేలకోరగగా మరికొంతమంది తప్పించుకు పారిపోయారు. భారతసేన తిరుగు బాటుదారుల గాలింపులో మునిగిపోయింది.
సుమారు నాలుగుగంటల 'ఆపరేషన్'
మాల్దీవులలో తిరుగుబాటు అణచి వెయబడింది.
ప్రెసిడెంట్ ఖయ్యాం భవంతి ముందు కపలా వున్న అబ్దుల్లా తన సహచరులతో కలసి భారతసేనని ఎదుర్కోబోయాడు కాని, కెవలం పదినిముషాల వ్యవధిలో నేలకోరిగాడు.
ఓ తుఫాను తర్వాత ప్రశాంతత ......
ఖయ్యాం తనను చేరుకున్న భారతసేనలకు చెందిన మిలటరీ జనరల్ ప్రతాఫ్ సింగ్ కృతఙ్ఞతలు తేలియచేసాడు.
అంతకుముందు తను ఆ మాత్రం గాలి పీల్చుకోవాడానికికారణమైనా పాణికోసం బయటకొచ్చి చూసాడు. లేడక్కడ.
సరిగ్గా అరగంటతర్వాత అందోళనగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు పాణి.
"గాడ్ ఈజ్ గ్రేట్" అభినందించాడు ఖయ్యాంనే చూస్తూ.
"ఇట్స్ వాట్ గాడ్... ఇట్స్ ఇండియా" ఇంకా కంపిస్తూనే వున్నాడు ఖయ్యాం.
భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చలనచిత్ర నిర్మాతగా పాణిని మేజర్ జనరల్ కి పరిచయం చేసిన ఖయ్యాం వెంటనే అన్నడు." "ఇలాంటి అనుభవం నాకుగానీ, ఈ దేశప్రజలకుగానీ తొలిసారి మిస్టర్ పాణీ..... దీనికి మూలకారకులెవరో నేను వూహించలేకపోతూన్నాను."
"బందీలుగా వున్న అయిదుగురు ఖైదీల ద్వారా వివరాల్ని సేకరించడంకష్టం కాదనుకుంటాను." వెంటనే గుర్తుచేసాడు. పాణి.
కదిలారు అంతా.....
రక్తపాతం నిండిన వీధుల్లో అపరాత్రివేళమేజర్ జనరల్ ప్రతాఫ్ సింగ్, పాణీలతో కారులో వెడుతున్న ఖయ్యాం వూహించలేదు.
అప్పటికి ఇరవైనిముషాలుక్రితమే నిర్భందంలోవున్న అయిదుగురు ఖైదీలు విషపూరితమైన ఇంజక్షన్ తో ప్రాణాలు కోల్పోయారు.
అంతేకాదు, అయిదువందల కిలోల హెరాయిన్ ప్రస్తుతం ఓ చిన్న మోటార్ బోట్ లో ఆకాశంలో గస్తీ తిరుగుతున్నైమ్దియాన్ ఎయిర్ ఫోర్స్ కళ్ళు గప్పి దక్షణంగా దూసుకుపోతూంది.
అయిదువందలకిలోల హెరాయిన్ అయిదువందలకోట్ల రూపాయల ఖరీదైతే మరణించిన అయుడుగురు ఖైదీలు ఒకవేళ బ్రతికివుంటే అంతకన్న ఖరీదైన ఒక వ్యవస్థని నేలమట్టంచేసే సాక్ల్షులయ్యేవారు.
అందుకే అలా చంపబడ్డారు.
అదంతా అరగంట వ్యవధిలో సాధించగలిగింది ఇండియన్ బిజినెస్ టైకూన మిస్టర్ పాణీ.
* * * *
ఉలికిపాటు నిద్ర లేచాడు చైతన్య.
తను పోరపడలేదు.
మరోసారి వినిపించింది ఆర్తనాదం....
"మొ...వ్వా"
అరణ్యాన్ని విలాసంగా మార్చుకున్న ప్రతి జంతువు. ప్రతి పక్షిగొంతూ అతడికి పరిచితమే.
కానీ ఇప్పుడు వినిపించింది చైతన్య అనుభవానికి అందనది.
"మొ...వ్వ"
చైతన్య ఓడలు జలదరించింది ఇప్పుడేదో అర్తనాధంలా కాక గొంతు నులిమేవేళకణుసు పెట్టె కేకలా వినిపించింది. అదీ రెస్ట్ హౌస్ కి సమీపంలో వున్న అరణ్యంలో నుంచి గదిలోని మసక వెలుతురులో చేతికున్న డిజిటల్ వాచీ చూసుకున్నాడు.
తెల్లవారుఝామున మూడుగంటల పదినిమిషాలు కావొస్తోంది.