"కానీ అదిమాల్దీవుల సముద్ర జిలాల్లో అనుమతి లేకుండా ప్రయాణం చేస్తుంది." జవాబు చెప్పాడు. ప్రెసిడెంట్ ఖయ్యాం.
ఫకాలున నవ్వాడతను.
"నార్కో టక్స్ ను రహస్యంగా గోల్డెన్ క్రిసెంట్ నుంచి మాల్దీవులకి తరలించి వ్యాపారం చెయాలనుకునే కింగ్ విన్స్ అనుమతి పత్రాలతో ఇక్కడ అడుగు పెడతారని ఎలా అనుకుంటున్నారు. ప్రెసిడెంట్ గారు. ఎప్పటిలాగే ఈ సారి సవ్యంగా సాగిపోతుందనుకుంటేమీ సేక్యూరీటి సర్వీస్ డైరెక్టర్స్ కోస్ద్ గార్డ్స్ సహాయంతో మా పథాకాన్నిదెబ్బతీసాడు.
అందుకే కోట్లరూపాయలు మామెటీరియల్నీ కూడా వెనక్కితీసుకుపోవాలని కొంతసేపటి క్ర్తితం ఇక్కడ అడుగుపెట్టాం. మీమాల్దీవులలో మారణహొమాన్నిప్రారంభించిఇప్పటికే చాలామందిని నేలకూల్చిన మేం అలా మిమ్మల్నీ అదుపులోకితీసుకోవలనుకున్నాం. పాపం మీ నేషనల్ సెక్యూరిటీ సర్వీస్ డైరెక్టర్ సనద్ హుస్సేన్స్ ..."
"ఏమయ్యాడు?" ఉద్విగ్నంగా పప్రశ్నించాడు ఖయ్యాం.
"నేలకోరిగాడు. తను బంధించిన ఐదుగురు మనుషుల్నీ ఆ మెటీరియల్ వెనక్కీ ఇచ్చేయగానగానే రిరగాపడ్డారు. మా యజ్ఞానికి టని తొలి సమిధిగా మారాడు.
ఖయ్యాం నుదిటిపై స్వేదం అలజడిగా పేరుకుపోయింది.
"మీ చిన్న దేశానికి రక్షణగా వున్న ఆర్మీ నేవీ పోలీస్, షైర్ ఫోర్స్ అన్నిటి కలయికగా ఏర్పడిన పర్సనల్ సెక్యూరిటీ సర్వీస్ లోని రెండువేలమందిని సైనికులూ ఇప్పుడు ఎన్.ఎస్సెన్ హేడ్ క్వార్టర్స్ ను కాపాడు కోవటానికి విశ్వప్రయత్నంచేస్తుంటే చాలాముచ్చాటగా వుందిమిస్టర్ ప్రెసిడెంట్." ఇంగ్లీషులో సాగుతున్న ఆ వ్యక్తి సంభాషణ హఠాత్తుగా మాల్దీవుల మాతృబాష అయిన దీవేహృలోకి మళ్ళింది. "కనీ అందరూ ప్రాణాలను కోల్పోకముందే మీరు జోక్యం చేసుకోవడం క్షేమమున్నదే మా అభిప్రాయం చెప్పండి. మర్యాడుగా మా అయిదుగురు ఖైదీలను, మెటీరియల్ నీ అప్పగిస్తారా లేకపొతేముందుగా మీప్రానాలు కోల్పోతారా"
ఖయ్యాం స్థబ్ధుడై చూస్తూ కూర్చున్నాడు.
"ఆలోచించుకునే వ్యవధిలేదుమిస్టర్ ఖయ్యాం. నాకు జవాబు కావాలి.లేదా మా కిరాయి సైనికులు మరికొన్ని క్షణాల్లోమాల్దీవులు మొత్తం నేలమట్టం చేయబోతున్నారు.
"నాకు వ్యవధి కావాలి."
"ఎందుకు?"
"ఖైదీలకు విడుదల చేయమని ఆదేశించగలను, విడుదల చేయగలను తప్ప ఆ మెటీరియల్ ఎక్కడ దాచబడింది. నాకు తెలీదుగనుక..."
డామిట్! ఇటీజ్ అల్ అబ్బర్డ్స్"
"ఇది నిజం "అసహనంగా అన్నాడు ఖయ్యాం.
"సనద్ హుస్సేన్ ను చంపి మీరు చాలా పోరపాటు చేశారు. పట్టుబడిన హెరాయిన్ గురించి సరయిన సమాచారం అందించేది అతడు మాత్రమే."
"డామిట్ నేను నమ్మను."
"నమ్మినా నమ్మకపోయినా ఇదిమాత్రం నిజం. ప్రశాంతమయినజీవితానికి అలవాటుబడ్డప్రజలు, ప్రభుత్వ యంత్రాంగమూ గల మాల్దీవుల అధ్యక్షుడిగా నేను ఎక్కువ జోక్యం చేసుకునేది స్వదేశీ రక్షణతో బాటు విదేశీ వ్యవహారాలను చక్కబరచుకోవడంలోనేతప్ప ఇలాటి విషయాల్లో కాదు. నువ్వు నమ్మకపోవచ్చు కానీ ఈ నేలపై నేరాలు జరగవు. అలాంటి సంస్కృతిగలఈ దేశనేతగా నేను నేర ప్రపంచంలోకి ఎప్పుడూ తొంగి చూడాలని ప్రయత్నించాను."
"అంటే మెటీరియల్ ఎక్కడున్నదీ తెలుసుకునే అవకాశం లేదంటారు."
"వెంటనే చెప్పలేను అన్నది నా జవాబు. కొంత వ్యవధి ఇస్తే ఎన్నే స్పేస్ లోని మిగతా అధికారులతో చర్చించి."
"యూ... బ్లడీ" సాయుధడయిన అ మనిషి చేతిలోని రాఫిల్ నిప్పులు కక్కేదే" అమాంతం పాణిముందుకు దూకి అతడి ప్రయత్నాన్ని నిరోదించాడు.
అక్కడి వ్యక్తులంతా అవాక్కయి చూస్తుండగానే పాణి అరిచాడు ప్రెసిడెంట్ ను చూస్తూ__
"మీరు వెళ్ళండి ఖయ్యాం... ఈ గదిలోనుంచి వెంటనే వెళ్ళిపొండి"
ఒక్కఅంగలో ఖయ్యాం పక్కగదిలోకి దూసుకుపోయాడు.
"ఆర్యూ మేడ్ " కోపాన్ని నిభాయించుకుంటూ అడిగాడు పాణి.
"నేనుఆదేశించింది ప్రెసిడెంట్ ను అదుపులోకి తీసుకోమనితప్పఘాట్ చేసి చంపమని కాదు."
"కాని సర్ " అబ్దుల్లా నచ్చచెప్పాబోయాడు "ఖయ్యాంని బెదిరిస్తే వెంటనే."
"నవ్వినప్పుడు బెదిరించాలనుకోలేదు అబ్దుల్లా కాల్చి చంపాలనుకున్నావు. అయినా పూర్తిగా మన అదుపులోకి వున్న ప్రెసిడెంట్ వేమత్నే కాదన్నా మరికొంతసేపటికి కాళ్ళ బేరానికి వచ్చేవాడుగా ... నేను సకాలంలో జోక్యం చేసుకోకపోతే పథకమంతా నాశనమయ్యేది. ఇప్పుడు నేను నెమ్మదిగా డీల్ ఆదేశాల్ని అందించిన పాణి గదిదాటి వెళ్తున్న సాయుధాల్నీ చూస్తూ నిలబడిపోయాడు చాలా సేపటిదాకా.
భారతదేశంలో చాలా పలుకబడి, ప్రశస్తిగల పాణి మాల్దీవులలో ఓ సినిమా నిర్మాతగా అడుగుపేట్టి తను ప్రారంభిచబోయే హిందీ చిత్రనిర్మాణానికి సంభందించిన అనుమతి గురించి అడుగుతున్నాడనుకున్న ప్రెసిడెంట్ ఖయ్యాం అతడే ఇలాంటి ఆపరేషన్ కి కారకుడని వూహించలేకపోయాడు.
అయితే అంతర్జాతీయ స్థాయిలో తన స్మగ్లింగ్ కార్యక్రమాన్ని సునాయాసంగా నిర్వహించగల పాణీ కూడా ఖయ్యాంగురించి చాలా తక్కువగా అంచనా వేసాడు.